leave issue
-
పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వలేదని..
చండీగఢ్ : ఉన్నత విద్యాసంస్కారాలకు నిలయాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు వేధింపులకు కేంద్రంగా మారుతున్నాయి. హెచ్వోడీలు, సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. గత నెల సీనియర్ల వేధింపులు తట్టుకోలేక గైనకాలజీ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న పాయల్ సల్మాన్ తాడ్వి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సోదరి పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వకుండా వేధించడంతో ఓ వైద్యుడు క్యాంపస్ హస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కర్ణాటక ధర్వాడాకు చెందిన ఓంకార్(30) హరియాణాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్లో పీడియాట్రిక్స్‌లో ఎండీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓంకార్ సోదరికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాల్సిందిగా హెచ్‌వోడీని కోరాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. కోర్సు విషయంలో కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్థాపం చెందిన ఓంకార్ హస్టల్లో తన గదిలోని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. అయితే హెచ్ఓడీ వేధింపుల మూలానే ఓంకార్ చనిపోయాడని అతని స్నేహితులు చెప్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు పోలీసులు. -
రఫేల్ భయంతోనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటుచేసుకుంటున్న అవినీతి బయటపడుతున్నందున భయంతోనే అలోక్‌ను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రఫేల్ కుంభకోణానికి సంబంధించిన దస్త్రాలను అలోక్ సేకరిస్తున్నందునే ఆయనపై వేటు పడిందన్నారు. రాహుల్ ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రధాని సందేశం చాలా స్పష్టంగా ఉంది. రఫేల్‌కు ఎవరు దగ్గరగా రావాలని ప్రయత్నించినా వారు పదవి కోల్పోతారు. తుడిచిపెట్టుకు పోతారు’ అని ఆరోపించారు. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ‘రఫేల్‌లో ఫోబియా’ కారణంగానే అలోక్‌ను మోదీ తప్పించారన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. మోదీకి ఇష్టుడైన అస్థానాను కాపాడటం కోసమే అలోక్‌ను కూడా కేంద్రం తప్పించిందని ఆరోపించారు. -
సెలవు కోసం గొడవ.. నలుగురిని కాల్చేశాడు!
అతడు రెండు నెలల పాటు యోగా శిబిరానికి హాజరై వచ్చాడు. మళ్లీ సెలవు కావాలన్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ అతడికి ఒక్కసారిగా కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిల్ తీసుకున్నాడు.. దాన్ని అన్‌లాక్ చేశాడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురు తోటి జవాన్లను బలిగొన్నాడు. ఈ ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గల నబీ నగర్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీజీసీఎల్) యూనిట్లో జరిగింది. నిందితుడు బల్వీర్‌సింగ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక ఏఎస్ఐ కూడా ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. విధులు ముగించుకుని షిఫ్ట్ మారుతున్న సమయంలో జవాన్లు ఒకచోట చేరారు. ఇంతలో అక్కడ చిన్న వివాదం తలెత్తడంతో అకస్మాత్తుగా బల్వీర్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. "బల్వీర్ తన సర్వీస్ రైఫిల్ తో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది సహోదర హత్యతో సమానం" అని ఎస్పీ అన్నారు. ఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారని తెలిపారు. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించిందని సీఐఎస్ఎఫ్ పేర్కొంది. బిహార్ విద్యుత్తు బోర్డులో ఎన్టీపీసీ, ఎన్సీజీసీఎల్ జాయింట్ వెంచర్‌గా నడుస్తున్నాయి.