సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ చీఫ్‌గా అలోక్‌వర్మకు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. (సీబీఐ చీఫ్‌గా మళ్లీ అలోక్ వర్మ)
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్ వర్మ బుధవారమే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు సీబీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ వరుస సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్(ఇన్‌చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేశారు. అంతేకాకుండా జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. (‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ)
Comments
Please login to add a commentAdd a comment