CBI chief
-
జస్టిస్ రమణ కూడా తప్పుకున్నారు!
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం.నాగే శ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. సీబీఐ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు తమ రాష్ట్రం వాడేననీ, ఆయన కుమార్తె వివాహానికి కూడా వెళ్లానని అందుకే ఈ ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తర్వాత ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న మూడో జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన వైదొలగడంతో సీనియర్ జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని మరో ధర్మాసనం ఈ కేసును శుక్రవారం నుంచి విచారిస్తుందని సీజేఐ ప్రకటించారు. జనవరి 10న ప్రధాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఐపీఎస్ అధికారి ఆలోక్‌వర్మను సీబీఐ చీఫ్ హోదా నుంచి తొలగించిన అనంతరం ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియామకం సరిగా జరగలేదంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్ధ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శంతన గౌడర్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ.. ‘సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం.నాగేశ్వర రావు, నేనూ ఒకే రాష్ట్రం వాళ్లం. ఆయనతో నాకు పరిచయం ఉంది. న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన అల్లుడు కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా’ అని ప్రకటించారు. కాగా, సీబీఐ చీఫ్ ఎంపిక విషయమై చర్చించేందుకు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నట్లు ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. -
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
-
‘వర్మా.. ఈ ఒక్కరోజు పనిచేయండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ తీరుతో పోలీస్ సర్వీసుకు సీబీఐ మాజీ చీఫ్ ఆలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీవిరమణ చేసే వరకూ సర్వీసులో కొనసాగాలని కోరింది. అలోక్ వర్మ ఈనెల 31న (నేడు) పదవీవిరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ ఒక్కరోజు పనిచేయాలని ఆయనను హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. కాగా,సీబీఐ చీఫ్‌గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ ఆస్ధానాను వేరే శాఖకు బదలాయించింది. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు: మరో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసు విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోగా.. తాజాగా రమణ కూడా వీరి జాబితాలో చేరారు. ఈ విషయం గురించి రమణ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర రావుది, నాది ఒకే రాష్ట్రం. అంతేకాక నేను, అతని కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యాను. ఈ నేపథ్యంలో నేను ఈ విచారణ బెంచ్‌లో ఉండటం సబబు కాదు. అందుకే తప్పుకుంటున్నాను’ అని తెలిపారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున.. ఈ కేసు తదుపరి విచారణకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే జస్టిస్ సిక్రీ కూడా ఈ కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకుటున్నట్లు ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తొలిగించిన ఉన్నతాధికార కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. దాంతో తాను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సిక్రీ తెలిపారు. తాజాగా ముడో వ్యక్తి ఎన్వీ రమణ కూడా ఈ బెంచ్ నుంచి తప్పుకున్నారు. పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు విచారణకు గొగోయ్ దూరం
-
ఆ కేసు విచారణకు గొగోయ్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈనెల 24 నుంచి జరిగే ఈ కేసు విచారణకు దూరంగా ఉన్నానని, మరో బెంచ్ ఈ పిటిషన్‌ను విచారిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌కు పేర్ల కుదింపు, ఎంపిక, నియామకంలో పారదర్శకత ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా 1986 ఒడిషా కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును గత ఏడాది అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్దానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వారిని ప్రభుత్వం సెలవుపై పంపింది. తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు వెనువెంటనే ఆస్ధానా అవినీతి కేసును విచారిస్తున్న డీఎస్పీ ఎకే బస్పీ, డీఐజీ ఎంకే సిన్హా,జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా పెద్దసంఖ్యలో అధికారులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు వర్మ, ఆస్ధానాల వ్యవహారం న్యాయస్ధానానికి చేరిన క్రమంలో నాగేశ్వరరావును ప్రభుత్వం అడిషనల్ డైరెక్టర్ స్ధాయికి ప్రమోట్ చేసింది. -
ఆలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను బలవంతపు సెలవుపై పంపించడం చెల్లదని, ఆయన్ని ఆ పదవిలో పునర్నియమిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మరునాడే అంటే, గురువారం సాయంత్రం ఆయన్ని ఆ పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్ వర్మను ఆ పదవిలో కొనసాగించడం సీబీఐ ప్రతిష్టకే భంగకరం కనుక ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి అగ్నిమాపక సర్వీసుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయంతో సీబీఐ ప్రతిష్ట మరింత మసకబారింది. ఆలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ రహస్య నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలతో కూడిన ఎంపిక కమిటీ వర్మపై వేటు వేసింది. ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ మోదీ, జస్టిస్ సిక్రీలు నిర్ణయం తీసుకోగా ఖర్గే వ్యతిరేకించారు. మెజారిటీ నిర్ణయం కనుక ఆలోక్ వర్మను బదిలీ చేశారు. సీబీఐ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోదీ ప్రభుత్వం అలా చేయకుండా బదిలీ ఎందుకు చేసింది? ఆయన అవినీతికి పాల్పడితే శిక్షించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచవచ్చుగదా! అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి అలోక్ వర్మ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటి నుంచే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పరిణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి ? అసలు సీబీఐకి స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? రాకేశ్ అస్థాన నియమకం నుంచే అనుమానాలు 1984, గుజరాత్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాకేశ్ అస్థానను 2017, అక్టోబర్ 22వ తేదీన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులకు ఉపయోగించుకోవడం కోసమే అస్థానను మోదీ ప్రభుత్వం నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల కేసులను దర్యాప్తు జరపడం ద్వారా ‘సూపర్‌కాప్’గా ముద్రపడిన రాకేశ్ అస్థాన, మోదీకి మంచి విశ్వాసపాత్రుడన్న ప్రచారం ఉంది. హవాలా కేసులో ముడుపులు ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు దాఖలు చేసి సీబీఐలోని ఆయన కార్యాలయంపై స్వయంగా దాడులు జరపడం తెల్సిందే. అదే రోజు రాత్రి కేంద్రం ఆదేశాల మేరకు కేంద్ర విజిలెన్స్ అధికారులు సీబీఐ కార్యాలయంలోని ఆలోక్ వర్మ కార్యాలయంపై దాడులు జరిపారు. పరస్పర ఆరోపలు చేసుకుంటున్న అస్థాన, వర్మలను అదే రోజు బలవంతపు సెలవులపై కేంద్రం పంపించింది. ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండా తనను ఎలా తొలగిస్తారంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అన్ని సమాధానం లేని ప్రశ్నలే అప్పటి నుంచి అన్ని ప్రశ్నలు, అనుమానాలు తప్ప, ఏ ఒక్కదానికి సరైన జవాబు దొరకడం లేదు. ఎంపిక కమిటీ నిర్ణయం లేకుండా వర్మపై చర్య చెల్లదని అప్పుడే తేల్చి చెప్పాల్సిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నాయకత్వంలోని బెంచీ అలా చేయకుండా వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది ? ఎందుకు రహస్య నివేదిక అడిగింది ? అస్థానపై అదే దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు? సీవీసీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తప్పని ఎందుకు పేర్కొంది? మళ్లీ మోదీ నాయకత్వంలోని ఎంపిక సమీక్షించే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వర్మను సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది? తాను తెప్పించుకున్న సీవీసీ రహస్య నివేదికను మోదీకి ఎందుకు పంపించింది? అలోక్ వర్మపై చర్య తీసుకున్న మోదీ కమిటీ రాకేశ్ అస్థానపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఆయన ఎందుకు ఇప్పుడు స్వచ్ఛంద సెలవుపై వెళ్లారు? హిందూత్వ వాదిగా ముద్రపడిన నాగేశ్వర రావునే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు? ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారం ఎందుకు జరుగుతోంది? ‘సీబీఐ యజమాని మాటలు పలికే పంజరంలో రామ చిలక’గా అభివర్ణించిన సుప్రీం కోర్టే ఎందుకు ప్రభుత్వం వైపు మొగ్గు చూపిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. అప్పుడే ప్రభుత్వం సచ్చీలతగానీ, సీబీఐ ప్రతిష్టగానీ తేలేది. -
ఆలోక్ వర్మపై వేటు
ఆలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం బదిలీ చేసింది. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్‌రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్‌పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్‌గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. పలు బదిలీలు చేపట్టిన వర్మ సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్కే సిన్హాను 2018 అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్ ఆదేశాలిచ్చారు. భేటీలో ఏమయింది? ఆలోక్ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ... వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ విభాగంలోని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి బయటపడుతుందనే.. రఫేల్ కుంభకోణం కేసును ఆలోక్ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వివరణ కోరి ఉండాల్సింది బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. ఖర్గే అసమ్మతి నోట్ ఆలోక్‌ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్ ఇచ్చారు. ముందుగా ఆలోక్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. నాగేశ్వర్‌రావుకే మళ్లీ పగ్గాలు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఉన్నారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఒరిస్సా కేడర్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్‌లు రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఆలోక్ వర్మ తొలగింపు వెనక.. న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే.. 1. మాంస వ్యాపారి మొయిన్ ఖురేషి మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త సతీశ్‌బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్ వర్మ అనుమతివ్వలేదు. 2. ‘సీబీఐలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 3. గుర్గావ్లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్ వర్మ పేరు ఉంది. 4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. 5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు. 6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్‌ను దాచిపెట్టారు. 7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు. 8. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది. 9. కేబినెట్ కార్యదర్శి ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి. 10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్ డైరెక్టర్‌గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు. ఎన్నో మలుపులు.. 2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ 2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ఆగస్ట్ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్ సానా రూ.2కోట్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రెటరీకి ఆస్థానా లేఖ. అక్టోబర్ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన సానా. అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. అక్టోబర్ 23: రాకేశ్ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్‌కు ఏడురోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు. నవంబర్ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. 2019, జనవరి 8: ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙ జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్ కమిటీలో జస్టిస్ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ జనవరి 10: ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్డ్ కమిటీ భేటీ. ఆలోక్ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు -
బ్రేకింగ్ : సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ చీఫ్‌గా అలోక్‌వర్మకు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. (సీబీఐ చీఫ్‌గా మళ్లీ అలోక్ వర్మ) సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్ వర్మ బుధవారమే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు సీబీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ వరుస సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేశారు. అంతేకాకుండా జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. (‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ) -
సీబీఐ వివాదం : సుప్రీం ముందుకు సీవీసీ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో నిగ్గుతేలిన అంశాలపై సుప్రీం కోర్టు సోమవారం ఆరా తీయనుంది. ప్రాధమిక దర్యాప్తు నివేదికను నేడు సుప్రీం కోర్టు పరిశీలించనుంది. వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై రాకేష్ ఆస్ధానా చేసిన ఆరోపణలను పాయింట్ల వారీగా అలోక్ వర్మ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తోంది. కాగా, వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణకు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీం కోర్టు పర్యవేక్షకుడిగా నియమించింది. వర్మపై అవినీతి ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, సీవీసీలకు గత నెల 26న నోటీసులు జారీ చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ రగడ : సుప్రీంను ఆశ్రయించిన అలోక్ వర్మ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు చేరింది. తనను డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి అకారణంగా సెలవుపై పంపడం పట్ల అలోక్ వర్మ న్యాయపోరాటం చేపట్టారు. సీబీఐ చీఫ్‌గా తనను తొలగించిన ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ పిటిషన్‌ను శుక్రవారం విచారించనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. కాగా, అలోక్ వర్మతో పాటు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికిరాత్రి సెలవుపై పంపిన విషయం తెలిసిందే. మరోవైపు ముడుపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాను కాపాడేందుకే అలోక్ వర్మను తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది. నూతన సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఒడిషా క్యాడర్‌కు చెందిన తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును నియమించింది. -
సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏకే సిన్హా
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. రంజిత్ సిన్హా స్థానంలో సీబీఐ డైరెక్టర్‌గా అనిల్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే. అనిల్ సిన్హా నిన్నటిదాకా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్నడీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. -
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటా: సిన్హా
న్యూఢిల్లీ: కర్తవ్య నిర్వహణలో ఎదురైయ్యే సవాళ్ల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటానని సీబీఐ నూతన డైరెక్టర్ అనిల్ కుమార్ సిన్హా అన్నారు. సీబీఐ నైతిక నిష్ఠను కాపాడేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం సీబీఐ డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. అందరి సహకారం తనకి కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం అనికుమార్ సిన్హాను సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసింది. -
ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవి రేసులో సీబీఐ చీఫ్
న్యూఢిల్లీ: ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవి రేసులో భారత్ తొలిసారి నిలిచింది. ఈ పదవికి పోటీపడుతున్న సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హాకు మద్దతు కూడగట్టాలని విదేశీ వ్యవహారాల శాఖను సీబీఐ కోరింది. ఈ అభ్యర్థనను ఆ శాఖ హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ పదవికి పోటీపడేవారి తుది జాబితాను ఈనెల 16న ఫ్రాన్స్‌లోని లియాన్‌లో విడుదల చేస్తారని, దానిలో రంజిత్ సిన్హా చోటు దక్కించుకుంటున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. సిన్హాతో పాటు యూరప్ నుంచి ముగ్గురు, ఆఫ్రికా, అమెరికా నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలవనున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అమెరికా, కెనడా, చిలీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, జపాన్, కొరియా, నైజీరియా, అల్జీరియా, రువాండా, ఖతార్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. వీరికి ఫ్రాన్స్‌కు చెందిన మిరెల్లీ బల్లేస్ట్రాజీ నేతృత్వం వహిస్తారు. వీరి మధ్యన ఏకాభిప్రాయం రాకపోతే ఇంటర్‌పోల్‌లో ఉన్న 190 సభ్యదేశాల ప్రతినిధులతో ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ రొనాల్డ్‌నోబుల్ పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగుస్తుంది.