సీబీఐ డైరెక్టర్గా అనిల్ కుమార్ సిన్హా బుధవారం బాధ్యతలు చేపట్టారు.
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్గా అనిల్ కుమార్ సిన్హా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన 1979 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. రంజిత్ సిన్హా స్థానంలో సీబీఐ డైరెక్టర్గా అనిల్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే.
అనిల్ సిన్హా నిన్నటిదాకా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా పనిచేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్నడీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.