takes over
-
నీలిరంగు చీరలోన జపాన్‌లో ఒక సందమామ
‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు కొందరు. ‘అయినా సరే, నేను నాలాగే ఉంటాను’ అంటారు కొందరు. రెండో కోవకు చెందిన డిజిటల్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్ మహిశర్మ వీడియో వైరల్ అయింది. గోల్డెన్ బార్డర్స్ బ్లూ శారీ ధరించి జపాన్‌లోని టోక్యో వీధుల్లో చిద్విలాసంగా నడుస్తున్న ఆమె వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్ దృష్టిని ఆకర్షించింది. ‘ఐ వోర్ ఏ శారీ ఇన్ జపాన్ రియాక్షన్స్ ఆర్’ కాప్షన్‌తో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో ఏడు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. వీడియోలో ఆబాలగోపాలం మహిశర్మను ఆశ్చర్యంగా చూస్తున్న, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. -
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్ బజాజ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. గురువారం పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏకే సిన్హా
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా అనిల్ కుమార్ సిన్హా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. రంజిత్ సిన్హా స్థానంలో సీబీఐ డైరెక్టర్‌గా అనిల్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే. అనిల్ సిన్హా నిన్నటిదాకా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెన్నడీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.