సవాళ్లను దీటుగా ఎదుర్కొంటా: సిన్హా | Committed to preserve CBI's integrity, sasy Anil Kumar Sinha | Sakshi
Sakshi News home page

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటా: సిన్హా

Published Wed, Dec 3 2014 12:38 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటా: సిన్హా

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటా: సిన్హా

న్యూఢిల్లీ: కర్తవ్య నిర్వహణలో ఎదురైయ్యే సవాళ్ల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటానని సీబీఐ నూతన డైరెక్టర్ అనిల్ కుమార్ సిన్హా అన్నారు. సీబీఐ నైతిక నిష్ఠను కాపాడేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం సీబీఐ డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. అందరి సహకారం తనకి కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం అనికుమార్ సిన్హాను సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement