integrity
-
‘ఎమర్జెన్సీ’ నిర్ణయాలన్నీ... చెల్లవని చెప్పలేం
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు. మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారం జరుగుతున్న దాడి!: ధన్‌ఖడ్
భారతదేశ సమగ్రతపై పక్కా ప్లాన్ ప్రకారమే తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హెచ్చరించారు. గ్లోబెల్స్ ప్రచారం కూడా చిన్నబోయేలా ఈ దాడి జరుగుతోందన్నారు. ఈమేరకు ఆయన ఓ వార్త సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుధ్దాన్ని పక్షపాత ధోరణితో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకోవాలని చూడటం దురదృష్టకరం అన్నారు. అవినీతి అంశాన్ని ఎలా రాజకీయ కోణంలో చూడగలమని ప్రశ్నించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమను టార్గెట్ చేస్తుందంటూ.. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలోనే ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ న్యాయవ్యవస్థ పట్ల గర్విస్తోందని అన్నారు. ఎవరికైనా పరువు నష్టం వాటిల్లందంటే తక్షణమే ఉపశమనం పొంది, న్యాయం చేకూరేలా చేసే సుప్రీం కోర్టులాంటి న్యాయవస్వయస్థ ఎక్కడ లభిస్తోందన్నారు. అయినా ఈ అంశంపై మాకు పాఠాలు చెప్పడానికి ప్రపంచంలో ఎవరికీ చట్టబద్ధత గానీ అందుకు సంబంధించి సాక్ష్యాధారాలు గానీ వారి వద్ద లేవని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును గమనిస్తున్నాం అని జర్మని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ధన్ఖర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేగాదు తన ప్రసంగంలో భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారమే దాడి జరుగుతోందని, అందుకోసం దేశం లోపల, వెలుపల కొన్ని దుష్ట శక్తుల పనిచేస్తున్నాయన్నారు. అంతేగాదు భారతదేశ వృద్ధిని కుంటిపరిచే ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తోందని ఆరోపించారు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇతర దేశాల్లో తన సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలు కచ్చితం అడ్డుకట్ట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ధన్‌ఖడ్. (చదవండి: పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని) -
రాహుల్... భారతీయాత్మ ఇదీ!
భారతదేశం వివిధ భాషలు, ఆహార– ఆహార్యాలు, ప్రాంతాలు, కుల – మత – వర్గాలు, సంస్కృతీ సంప్రదాయాల సంగమస్థలి. భారతీ యాత్మకు ఇదే నిదర్శనం. భారత్‌పై దండయాత్రలు చేసిన విదేశీయ శక్తులన్నీ ఈ వైవిధ్యాన్ని ఉపయో గించుకొని, విభజించి పాలించు విధానం ద్వారానే ఆధిపత్యం చలాయించాయి. ఆనాటి దురాక్రమణ దారులే కాదు, ఇప్పటి కొన్ని విదేశీ శక్తులు సైతం ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే దుర్బుద్ధితో ప్రజల మధ్య విభేదాలు రాజేస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం అనేక రాజకీయ పార్టీలు తమ కంటూ ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయాలనే అనుసరించాయి, నేటికీ అనుస రిస్తున్నాయి. మన దేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. దేశ విభిన్నత్వాన్ని కాపాడుతూనే సమైక్యతకు పాటుపడేవారు ఒకరకం. జాతీయ సమైక్యతా భావనను తుంగలో తొక్కి విభేదాలను విద్వేషాల స్థాయికి తీసుకెళ్లి, పబ్బం గడుపుకొనేవారు రెండోరకం. లక్షలాది భారతీయుల ఉచకోతకు, కోట్లాది మంది నిరాశ్రయులు కావడానికి దారితీసిన దేశ విభజన వంటి విషాద ఘటనల నుంచి వారింకా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. నేర్చుకోరు. కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ రెండో తరహా నాయకుల కోవకు చెందినవారు. కుటుంబ పాలన నిలబెట్టుకోవడానికి తన పార్టీ ఇన్నాళ్లూ అనుసరిస్తూ వచ్చిన విధానానికి భిన్నమైన రీతిలో ఆయన పాదయాత్ర చేపట్టారు. దేశ విభజనకు కారణమైన వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో ఇప్పుడు సాగుతున్న నాటకానికి సూత్రధారి కావడమే విచిత్రం, విస్మయకరం. దేశాన్ని కలిపి ఉంచుతున్నది ఏమిటో, ఎందుకో – రాహుల్ గాంధీకి పట్టదు, పట్టింపు లేదు. ఆయన ముత్తాత, దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వేసిన బాటలోనే ఆయన పయనిస్తున్నారు. దేశాన్ని ఒకటి చేస్తున్న దేమిటో తెలుసుకోవడానికి, కనీసం అర్థం చేసుకోవడానికీ ఆనాడు నెహ్రూ ప్రయత్నించలేదు. ‘‘ఏదో వారిని (ప్రజల్ని) కలిపి ఉంచుతోంది. భారత్ విభిన్న నైసర్గిక, ఆర్థిక, సాంస్కృతిక స్వరూప – స్వభావాలు కలిగి ఉన్నది. అనేక వైరుధ్యాలు! అయినప్పటికీ – ఏవో తెలియని గట్టి బంధాలు వారందరినీ కలిపి ఉంచుతున్నాయి’’ – అని స్వాతంత్య్రానికి ఏడాది ముందు ప్రచురించిన ‘ద డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, జవహర్లాల్ నెహ్రూ చేసిన తీవ్ర తప్పిదాలకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఆయన, ఆయన వారసులు తీసుకున్న అనేక చర్యలు దేశంలో విభజన బీజాలే నాటాయి. దేశాన్ని కలిపి ఉంచుతున్న బలమైన బంధం ఏమిటన్నది నెహ్రూకు అర్థంగాక పోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఆరని కుంపటి అయ్యింది. భారతీయత కన్నా ఒక మతమే మిన్న అనీ, దేశ భిన్నత్వాన్ని కాపాడాలంటే ఆ మతానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న దురవగాహనే వారిని ముందుకు నడిపింది, దేశాన్ని వెనక్కి నడిపింది. ఆ దరవ గాహనతోనే నెహ్రు, కశ్మీర్ సమస్యను అంత ర్జాతీయం చేశారు. ఎనిమిదేళ్లనాడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేదాకా – కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం కరాళ నృత్యం చేసింది. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తçప్పులు చేసినందువల్లే రెండు మత వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. దాని ఓటుబ్యాంకు రాజకీయాలతో సమస్య ముదిరింది. ఇందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దే. ఈ బాధ్యతను అది స్వీక రిస్తుందా? ఇది జోడోనా లేక తోడోనా? నెహ్రూ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరంకుశ నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించడానికి సర్దార్ పటేల్ గట్టి చర్యలు చేపట్టకపోయి ఉంటే... దేశం మధ్యలో తెలంగాణ మరో అగ్ని గుండమయ్యేది. రాహుల్ కుటుంబ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రజల మధ్య కులమతాలు, ప్రాంతాలు, భాషలంటూ విభజన రేఖలు గీసింది. మహిళల అభ్యున్నతి గురించి రాహుల్ తరచూ మాట్లాడుతుంటారు. ఇతర మతాలకు చెందిన మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకూ హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు – రాహుల్ తండ్రి, అప్పట్లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని అటకెక్కించారు. దేశ ప్రజలందరినీ ఒకే గాటన కట్టే దిశలో ముందడుగు వేసే బదులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతీ– సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాలు అంటూ వారి మధ్యన మరింత ఎత్తున గోడలు కట్టారు. లింగాయత్‌లు–హిందువులు; రాజ్‌పుత్‌లు–ఇతరులు; హిందువులు–ముస్లింలు; దళితులు–అగ్ర కులాలు అంటూ వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి, తమాషా చూడట మొక్కటే పరమ పవిత్ర కర్తవ్యంగా ఆ పార్టీ భావిస్తోంది. తన ‘తోడో’ రాజకీయాల కోసం అందివచ్చే ఎలాంటి అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టడం లేదు. 130 కోట్ల మందికి పైగా భారతీయులు భక్తి – శ్రద్ధలతో దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ... భారత్ ఒక దేశం కాదు, జాతీ కాదు, కేవలం రాష్ట్రాల సమాహారం మాత్రమేనంటూ వింత, వితండ వాదనను రాహుల్ తెరమీదకు తెచ్చారు. నెహ్రూ పేర్కొన్నట్లు – దేశ ప్రజలందరినీ కలిపి ఉంచుతున్న బలమైన బంధం– భారతీయత – అంటే ఏమిటన్నది అర్థం చేసుకోగలిగితే– ‘జోడో’ లక్ష్యం సాధించే దిశగా సాగిపోవడం, గమ్యం చేరడం రాహుల్ గాంధీకి పెద్ద కష్టమేమీ కాదు! (క్లిక్ చేయండి: భారత్ జోడో పాదయాత్రతో కొత్త ఉత్సాహం) - కిశోర్ పోరెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి -
కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం కష్టమే: సర్వేలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: అస్థిరతలు, సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో కార్పొరేట్ ఇంటిగ్రిటీని (కంపెనీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం/ఆచరణ సాధ్యత) కొనసాగించడం కష్టమని 78 శాతం మంది భారత నిపుణులు భావిస్తున్నారు. 34 వర్ధమాన దేశాల నుంచి 2,750 మంది బోర్డు సభ్యులు, మేనేజర్లు, ఉద్యోగుల అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం తీసుకుంది. ఇందులో భారత్ నుంచి 100 మంది ఉన్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన దేశ సంస్థలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్కువ చర్యలను ఎదుర్కొంటున్నాయి. ఇంటెగ్రిటీ ప్రమాణాలను ఉల్లంఘించినందుకు తమపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకున్నట్టు మన దేశం నుంచి 60 శాతం కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇతర వర్ధమాన దేశాల నుంచి ఇలా చెప్పిన వారు 38 శాతమే ఉన్నారు. మారుతున్న నిబంధనలను వేగంగా అమలు చేయడం కష్టంగా ఉన్నట్టు భారత్‌లో 65 శాతం మంది చెప్పారు. వర్ధమాన దేశాల నుంచి ఇలా చెప్పిన కంపెనీలు 45 శాతంగానే ఉన్నాయి. భారత స్టార్టప్‌లు పెరుగుతున్న కొద్దీ.. నియంత్రణపరమైన నిబంధనల అమలు పెంచడానికి మరింత సమయం తీసుకోవచ్చని ఈవై ఇండియా గ్లోబల్ మార్కెట్స్ లీడర్ అర్పిందర్ సింగ్ పేర్కొన్నారు. ఇక మన దేశంలోనే ఎక్కువ కంపెనీలు ఈఎస్జీ దిశగా అడుగులు వేస్తున్నాయి. 47 శాతం కంపెనీలు తాము కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా ఈఎస్జీ విధానం కలిగి ఉన్నట్టు చెప్పాయి. వర్ధమాన దేశాల నుంచి కేవలం 33 శాతం కంపెనీలు ఇలా చెప్పాయి. చదవండి: మూన్‌లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు -
BRICS SUMMIT: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం
న్యూఢిల్లీ: అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించుకోవాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తదితర అంశాలను చర్చించిన బ్రిక్స్ దేశాల నేతలు ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలే పరిష్కారమంది. ఈ విషయంలో ఐరాస, రెడ్ క్రాస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాలైన ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని తీర్మానించింది. అంతకుముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఇంకా తొలిగిపోలేదని, దీని నుంచి బయటపడేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం సహాయకారిగా ఉంటుందని చెప్పారు. ‘‘కరోనా మహమ్మారి నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ వరుసగా మూడో ఏడాది మనం సమావేశమయ్యాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు తగ్గినప్పటికీ, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగం విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే రకమైన వైఖరి కలిగి ఉన్నాయి. ఆర్థికంగా తిరిగి పుంజుకునేందుకు మనం పరస్పరం సహకరించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది’’అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. బ్రిక్స్‌ను కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగించారు. ఏకపకంగా కొందరు విధించే ఆంక్షలను, చిన్న కూటముల ఏర్పాటుకు సాగే ప్రయత్నాలను వ్యతిరేంచాలని పిలుపునిచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి విధానాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘కొన్ని దేశాలు సైనిక కూటములను విస్తరించుకునేందుకు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆధిపత్యం సాధించుకునే క్రమంలో ఇతర దేశాల హక్కులు, ప్రయోజనాలను కాలరాస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిని ఉపేక్షిస్తే మరింత అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి’’అని పరోక్షంగా ఆయన అమెరికా, ఈయూలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా, ఈయూల నాటో విస్తరణ కాంక్షే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మూల కారణమన్నారు. భేటీలో మోదీ, జిన్‌పింగ్‌లతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో 41%, జీడీపీలో 24%, వాణిజ్యంలో 16% బ్రిక్స్‌లోని ఐదు దేశాలదే. -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
చట్టబద్ధమైన అధికారాలతో మీడియా కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా తన విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవకతవకలు, అక్రమాలను అరికట్టడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని బుధవారం ప్రతిపాదించింది. మీడియాలో నకిలీ వార్తల బెడద పెరిగిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) ఎన్నికల నేరంగా పరిగణించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సును త్వరగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘వార్తల ప్రచురణ/కవరేజీలో నైతిక విలువలు’ పేరిట ఒక నివేదికను పార్లమెంట్లో సమర్పించింది. -
దేశం కోసం మహిళా టీచర్ సాహసం
సాక్షి, చెన్నై: దేశ సమైక్యతను కాంక్షిస్తూ మహిళా టీచరు బుల్లెట్ పయనానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడుతో అనుబంధం ఉన్న టీచర్ రాజ్యలక్ష్మి ఢిల్లీలో పని చేస్తున్నారు. ఈమె దేశంపై యువతలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మదురై గోరిపాలయం నుంచి ఆమె తన ప్రయాణం మొదలెట్టారు. బుల్లెట్ నడుపుకుంటూ, మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించి, దేశ సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆమె వెన్నంటి క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన 12 మంది, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరో 12 మంది యువకులు మోటారు సైకిళ్ల మీద వెళ్లనున్నారు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఢిల్లీ మీదుగా హిమాచల్ ప్రదేశ్ వరకు 4450 కి.మీ దూరం 19 రోజుల పాటు ఈ ప్రయాణం సాగనుంది. అలాగే ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలోని ఒప్పగౌండన్ హల్లిలో సమాచార శాఖ నేతృత్వంలో గ్రంథాలయం నిర్మించారు. ఇక్కడే భరతమాత స్మారక ఆలయాన్ని సైతం ఏర్పాటు చేయగా, వీటిని మంత్రి స్వామినాథన్ ప్రారంభించారు. -
ఈసీ సూచనల్లో సమగ్రత ఏదీ?
ఎన్నికలకు విశ్వసనీయత కల్పించడం, రాజకీయ పక్షాలు వెలువరించే ఎన్నికల ప్రణాళికలు ఆచరణయోగ్యమైనవిగా లేనప్పుడు లేదా అధికారంలోకొచ్చాక ఆ ప్రణాళికలను బేఖాతరు చేసిన ప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై కాక ఇప్పుడు జమిలి ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వ హించడంలోని మంచిచెడ్డల సంగతలా ఉంచి తాజాగా ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదన సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒక ఏడాది రద్దయ్యే అసెంబ్లీలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం ఆ ప్రతిపాదన సారాంశం. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకొచ్చాక జమిలి ఎన్నికలపై అడపా దడపా చర్చ సాగుతూనే ఉంది. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ప్పుడు లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక ఈ జమిలి ఎన్నికల గురించి మొదటగా ప్రస్తా వించింది. ఆ తర్వాత బీజేపీయే తరచు దీన్ని గురించి మాట్లాడింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకేసారి ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. ఆయన స్థానంలో వచ్చిన రాంనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో సైతం ఈ ప్రతిపాదన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన ప్రతిపాదన జమిలి ఎన్నికల ఆలోచనకు భిన్నమైనది. జమిలి ఎన్నికల ఉద్దేశం ‘ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు’ అయితే...ఈసీ చెబుతున్నది ‘ఒక ఏడాది– ఒకేసారి ఎన్నికలు’. అలాగని ఈసీ జమిలి ఎన్నికలకు వ్యతిరేకి కాదు. అది జరగాలంటే రాజ్యాం గంలోని వివిధ అధికరణలకు సవరణలు తీసుకురావడం పెద్ద పని గనుక తన ప్రతిపాదనను పరిశీలించాలని అది కోరుతోంది. నిజమే... జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని అధికరణలు– 83(పార్లమెంటు ఉభయ సభల పదవీకాలం), 85(లోక్‌సభ రద్దు), 172(రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం), 174(అసెంబ్లీల రద్దు), 356(రాష్ట్రపతి పాలన విధింపు)–వగైరాలను సవరించాల్సి ఉంటుంది. ఈసీ ప్రతిపాదనకైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని 15వ సెక్షన్ సవరిస్తే సరి పోతుంది. ఆ సెక్షన్ ప్రకారం పదవీకాలం పూర్తవుతున్న అసెంబ్లీకి వ్యవధి ఆరు నెలలకు మించి ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకూడదు. నిరుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా అందులో అయిదు రాష్ట్రాలు–పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు ఒకసారి... గుజ రాత్, హిమాచల్‌ప్రదేశ్‌లకు మరోసారి రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక ఏడాదిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలన్నిటినీ ఒకేసారి జరపాలన్న ఈసీ తాజా ప్రతిపాదన సాకారం కావడానికి అడ్డంకులు పెద్దగా ఉండవు. అలాగే రెండు, మూడు నెలలు తప్ప ఎవరూ పెద్దగా నష్టపోయేది ఉండదు. అయితే జమిలి ఎన్నికల్లాగే దీనికి కూడా ఆచరణలో బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగిన రాష్ట్రాలన్నిటా పాలకపార్టీలు ఒకే రకంగా నికరమైన మెజారిటీ తెచ్చుకోలేకపోవచ్చు. ఉదాహరణకు మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తగిన మెజారిటీ లేక చతికిలబడింది. దాని స్థానంలో వచ్చిన జేడీ(ఎస్)– కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు అధికారంలో నెట్టుకురాగలదో తెలియదు. ఆ రెండు పార్టీల మధ్యా అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నందువల్ల అదెప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరూ సుస్థిర ప్రభుత్వాన్ని అందించే అవకాశం లేదని తేలినప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకెళ్లడం మినహా మరో మార్గం ఉండదు. అలాంటి సందర్భాలు అరుదుగా తప్ప రావని అనుకోవడానికి లేదు. పైగా పటిష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు సైతం కుప్పకూలిన ఉదం తాలు మన దేశంలో లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన అల్లుడు చంద్రబాబే కుప్పకూల్చారు. దీనికి విరుగుడుగా ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుకు విఫలయత్నం చేశారు. ఆయన అభీష్టం నెరవేరితే వెనువెంటనే మళ్లీ ఎన్నికలు వచ్చి ఉండేవి. అన్ని పార్టీల తీరుతెన్నులూ ఒకేవిధంగా ఉంటున్నాయన్న అభిప్రాయం ఓటర్లలో ఏర్పడి, అది నిర్లిప్తతకు దారితీసినప్పుడు సహజంగానే ఎన్నికల ఫలితాలు అనిశ్చితిని తీసుకొస్తాయి. అలాగే అధికార పక్షాలు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న వైనం కూడా ప్రజల్లో ఏవగింపు కలిగిస్తోంది. ఈ విషయంలో ఫిరాయింపుల వల్ల నష్టపోయే పార్టీ తప్ప మరెవరూ మాట్లాడరు. స్పీకర్లు కళ్లు మూసుకుంటారు. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని గవర్నర్ వరకూ ఎవరూ అది తప్పని చెప్పరు. న్యాయస్థానాలు సైతం ఏళ్ల తరబడి నాన్చడం తప్ప త్వరగా తేల్చవు. అలాగే డబ్బులిచ్చి ఓట్లు కొనడం, ఇతరత్రా ప్రలోభపరచడం వంటి పనులు రాను రాను పెరుగుతున్నాయి. ఇలాంటి పరిణామలు ప్రజల్లో నైరాశ్యాన్ని మరింత పెంచుతున్నాయి. వీటిని పోగొట్టడానికి ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే...పరిష్కారాన్ని అన్వేషిస్తే ఎన్నికలకు విశ్వసనీయత కలుగుతుంది. హంగ్ అసెంబ్లీల బెడద తప్పుతుంది. అప్పుడు జమిలి ఎన్నికల విధానమైనా, మరొక విధానమైనా సత్ఫలితాలనిస్తుంది. ఒకేసారి ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించి, ఇలాంటి సమస్యలను విస్మరించడం వల్ల అనుకున్న ప్రయోజనాన్ని సాధించడం సాధ్యం కాదు. తాము రూపొందించే ఎన్నికల ప్రణాళికల గురించి, వాటిల్లో చేసే వాగ్దానాల గురించి నిబంధనలు పెట్టాలని పార్టీలు ఎటూ కోరవు. కనీసం ఈసీ అయినా ఆ దిశగా ఆలోచించాలి. లా కమిషన్‌కు అది చేసిన సూచనలు ఇలాంటి అంశాలన్నిటితో మరింత సమగ్రంగా ఉంటే బాగుండేది. -
చిత్తశుద్ధితో ఆర్థిక సంస్కరణలు
ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత సరళీకృతం • ప్రపంచానికే భారత్ ఓ ఆశాకిరణం • వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన గాంధీనగర్: భారత దేశంలో ఆర్థిక సంస్కరణలను కొనసాగించటంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గాంధీనగర్‌లో ద్వైవార్షిక వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సీఈవోలనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘వ్యాపారానికి అనువైన వాతావరణం ఏర్పాటుచేయటం, పెట్టుబడులను ఆకర్షించటం మా ప్రధాన బాధ్యత’ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్విరామ కృషి, జీడీపీ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక సూచికల్లో స్థిరమైన వృద్ధితోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కారణంగా భారత్ ఇప్పటికే వ్యాపారానుకూల దేశంగా ముద్ర వేసుకుందన్నారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులతో భేటీ సదస్సుకు ముందు ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలు, వ్యాపార ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సెర్బియా ప్రధాని అలెగ్జాండర్ తదితర రాజకీయ ప్రముఖులతోపాటు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, వ్యాపార వేత్తలతోనూ భేటీ అయ్యారు. రువాండా, భారత్ సంబంధాలతోపాటు ఫోరెన్సిక్ సైన్స్‌లో సహకారం, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి లో చేరేందుకు రువాండా అంగీకారం అంశాలపై ఒప్పందపత్రాలపై సంతకాలు చేసుకున్నారు. జపాన్ కంపెనీల ప్రతినిధులతో కలిసి వచ్చిన ఆ దేశ ఆర్థిక మంత్రి సీకో హిరిషోగి మోదీని కలిశారు. డెన్మార్ మంత్రి లార్స్ క్రిస్టియన్, ఇజ్రాయిల్, స్వీడన్, యూఏఈ మంత్రులతోనూ ప్రధాని భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్లో పేర్కొంది. డెన్మార్క్ మంత్రితో సమావేశం సందర్భంగా ‘పురూలియా ఆయుధ డీలర్ కిమ్ డేవీపై రాజద్రోహం కేసు వేయటంపై డెన్మార్క్ సహకారం ఉంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు’ అని పీఎంవో ట్విటర్లో పేర్కొంది. వివిధ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ థామస్, ఫ్రెంచ్ విద్యుత్ కంపెనీ ఈడీఎఫ్ సీఈవోతో పాలు పలువురు ప్రముఖుల పాల్గొన్నారు. ప్రపంచాభివృద్ధికి ఇంజన్ భారతే.. ‘ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా భారత్ తట్టుకుని నిలబడగలిగింది. అందుకే ప్రపంచంలో ఓ ఆకర్షణీయమైన దేశంగా భారత్ పేరు సంపాదించుకుంది. ప్రపంచాభివృద్ధికి మమ్మల్ని ఓ ఇంజన్‌లాగా (ముందుండి నడిపే వాడిలా) చూస్తున్నారు’ అని మోదీ తెలిపారు. వ్యాపారానుకూల దేశంగా భారత్‌ను నడిపించే దిశలో.. లైసెన్సింగ్ విధానాన్ని, నిబంధనలను సరళీకృతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ‘మా సుపరిపాలన వాగ్దానం ప్రకారం మేం వివిధ రంగాల్లో వందల రకాల కార్యాచరణను అమలుచేస్తున్నాం. రోజు రోజుకూ మా విధానాలను, పద్ధతులను హేతుబద్ధీకరించుకుంటున్నాం. వివిధ రంగాల్లో వేర్వేరు పద్ధతుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్నీ సరళీకరించాం’ అని మోదీ వెల్లడించారు. మే 2014 నుంచి దేశంలో 130 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.87 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయని.. మేకిన్ ఇండియాపై విదేశీ కంపెనీలకున్న నమ్మకానికి ఇదో నిదర్శనమన్నారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ ఎఫ్‌డీఐలు అందుకుంటున్న దేశం కూడా భారతేనని స్పష్టం చేశారు. -
గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి
ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు భద్రాచలం : అధికారులు గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధి సాధించినప్పుడే స్వాతంత్య్ర ఫలాలు దక్కినట్లుగా భావించాలన్నారు. దీనికోసం అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఏజెన్సీ పరిధిలోని విద్యాసంస్థల ద్వారా 41,297 మంది విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది పదో తరగతిలో 91 శాతం ఫలితాలు సాధించామని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేలా తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా 25,436 మొక్కలను పాఠశాలల ప్రాంగణాల్లో నాటామన్నారు. సీజన ల్ వ్యాధుల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకు 400 చొప్పున, ఇల్లెందుకు 380 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఏజెన్సీ పరిధిలోని 24 మండలాల్లో 1,12,688 కుటుంబాలకు చెందిన 1,89,995 మంది కూలీలకు 47.56 లక్షల పనిదినాలు కల్పించి.. వేతనాల కింద రూ.59.92కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.13.87లక్షలతో ఆయిల్ ఇంజన్లు, సైకిళ్లు, పైపులు, కట్టుమిషన్లు అందజేశామన్నారు. అనంతరం ట్రైకార్ పథకంలో భాగంగా టాటా మేజిక్ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భద్రాచలంలోని లిటిల్æఫ్లవర్ విద్యార్థులు చేసిన జై తెలంగాణ గీతానికి పీఓతోపాటు ఇతర యూనిట్ అధికారులంతా హర్షధ్వానాలతో ఉత్తేజపరిచారు. ఐటీడీఏలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులు, అధికారులకు పీఓ రాజీవ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే లిటల్ ఫ్లవర్ విద్యార్థుల తరఫున విద్యాసంస్థల చైర్మన్ మాగంటి సూర్యంకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీడీ జయదేవ్ అబ్రహం, ఏజెన్సీ డీఈఓ రవీందర్, ఏపీఓ జనరల్ కె.భీమ్రావు, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల, డీఎంఓ రాంబాబు, డీసీఓ బురాన్, మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ నారాయణరెడ్డి, ఏజీపీ సాల్మన్ రాజు పాల్గొన్నారు. -
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటా: సిన్హా
న్యూఢిల్లీ: కర్తవ్య నిర్వహణలో ఎదురైయ్యే సవాళ్ల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటానని సీబీఐ నూతన డైరెక్టర్ అనిల్ కుమార్ సిన్హా అన్నారు. సీబీఐ నైతిక నిష్ఠను కాపాడేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం సీబీఐ డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటానని చెప్పారు. అందరి సహకారం తనకి కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం అనికుమార్ సిన్హాను సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసింది. -
మన దేశం పేరును రాజ్యాంగంలో ఎలా చేర్చారు?
రాజ్యాంగ ప్రవేశిక - ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. ఉదా: మత స్వేచ్ఛ లౌకిక రాజ్య స్థాపనకు పునాది. సమానత్వం (Liberty): ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం. సమానత్వం అంటే అన్ని రకాల అసమానత్వాలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తనకు తాను పూర్తిగా వికాస పర్చుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం. సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదరభావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షత లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. ఐక్యత, సమగ్రత (Unity & Integrity): దేశ ప్రజలందరూ కలిసి ఉండటానికి ఐక్యతాభావం దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మత, కుల, ప్రాంత అనే సంకుచిత ఆలోచనకు అతీతమైన ఆదర్శం. ‘సమగ్రత’ అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. 1970 తర్వాత దేశంలో అనేక ప్రాంతాల్లో, ప్రాంతీయవాదం, వేర్పాటు వాదం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్ర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ‘సమగ్రత’ అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ప్రవేశిక సవరణకు అతీతం కాదు ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ప్రకరణ 368 ప్రకారం ఉంటుందని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనంలోకి వస్తుంది కాబట్టి, దాని సారాంశం (ఞజీటజ్టీ) మార్చకుండా ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత’ అనే పదాలను చేర్చారు. ఇదే మొదటి, చివరి సవరణ కూడా. ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా? రాజ్యాంగ సారాంశమంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే 1973లో కేశవానంద భారతి వివాదంలో పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినప్పుడు కూడా డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది. ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత ప్రవేశిక రాజ్యాంగ ఆధారాన్ని పేర్కొంటుంది. ఇది రాజ్యాంగ ఆమోద తేదీని తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపరమైన సహాయకారిగా ఉపయోగపడుతుంది. విమర్శలు: ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు చేయకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్థావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. అదేవిధంగా పరిమితికాదు. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ప్రవేశికలో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి. మాదిరి ప్రశ్నలు 1. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించాల్సిన లక్ష్యం? 1) సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సమానహోదా, అవకాశం 2) ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ 3) వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించే సౌభ్రాతృత్వాన్ని సాధించాలి 4) పైవన్నీ 2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) ఫ్రెంచి 2) బ్రిటిష్ 3) ఐర్లాండ్ 4) రష్యా 3. కిందివాటిలో సరికాని జత ఏది? 1) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు - గోలక్‌నాథ్ కేసు 2) ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే - కేశవానంద భారతీ కేసు 3) లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపమే - ఎన్.ఆర్. బొమ్మయ్ కేసు 4) పైవన్నీ సరైనవే 4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం? ఎ) సామ్యవాదం బి) లౌకిక సి) సమగ్రత డి) సార్వభౌమ 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి 5. మనదేశం పేరును రాజ్యాంగంలో ఎలా పొందుపర్చారు? 1) ఇండియా - భారత్ 2) హిందూస్థాన్ 3) అఖండ్ భారత్ 4) సింధూస్థాన్ 6. భారతదేశం ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది? 1) ప్రజాస్వామిక వ్యవస్థ 2) పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ 3) అధ్యక్ష తరహా వ్యవస్థ 4) సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ 7. భారత రిపబ్లిక్ రాజ్యాంగం అనేది? 1) రాజ్యాంగ సభ ద్వారా నిర్మితమై, గవర్నర్ జనరల్ ద్వారా ఆమోదం పొందింది. 2) బ్రిటిష్ పార్లమెంట్ ప్రతిపాదించగా, రాజ్యాంగసభ ఆమోదించింది. 3) భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తావించగా, రాజ్యాంగ సభ ఆమో దించింది. 4) రాజ్యాంగ పరిషత్తు రచించి, స్వీకరించింది. 8. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించింది ఎవరు? 1) మహాత్మాగాంధీ 2) అంబేద్కర్ 3) వల్లభాయ్ పటేల్ 4) ఠాకూర్‌దాస్ భార్గవ 9. రాజ్యాంగ ప్రవేశిక? 1) సూచనాత్మకమైంది. 2) విషయ సూచిక లాంటిది 3) 1, 2 4) ఏదీకాదు 10. ప్రవేశిక నుంచి దేన్ని తెలుసుకోవచ్చు? 1) రాజ్యాంగ ఆమోద తేది 2) రాజ్యాంగ ఆధారాలు 3) రాజ్యాంగ ఆశయాలు 4) పైవన్నీ 11. ప్రవేశికకు సంబంధించి సరైంది? 1) రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది 2) ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు 3) సవరణకు అతీతం కాదు 4) పైవన్నీ సరైనవే సమాధానాలు 1) 4; 2) 1; 3) 4; 4) 3; 5) 1; 6) 4; 7) 4; 8) 4; 9) 1; 10) 4; 11) 4. -
'రాష్ట్రాలు ఎన్నిఉన్నా సమైక్యత ముఖ్యం'
హైదరాబాద్ : రాష్ట్రాలు ఎన్ని ఉన్నా సమైక్యత ముఖ్యమని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. లోక్‌సత్తా పార్టీ శనివారం హైదరాబాద్ జూబ్లీహాల్లో 26అంశాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని తెలుగు ప్రజలకు నమ్మకం కల్పించాలని అన్నారు. గతాన్ని తవ్వకుండా భవిష్యత్ గురించి ఆలోచిద్దామని ఆయన పేర్కొన్నారు. ఆవేశాలు, వాదనలు లేకుండా అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారికి విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య విభేదాలు లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని జయప్రకాష్ నారాయణ తెలిపారు. హైదరాబాద్ గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.