ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధిపతిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అలోక్ వర్మ రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా సేవలు అందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియామక కమిటీలో ప్రధానితోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్‌సింగ్ ఖేహర్, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.
సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా డిసెంబర్ 2న పదవీ విరమణ చేయడంతో అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. వర్మ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-యూనియన్ టెర్రిటరీ)కి చెందిన 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో దేశ రాజధాని ఢిల్లీలో, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. దేశాన్ని కుదిపేసిన బొగ్గు కేటాయింపుల కుంభకోణం దర్యాప్తును సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆయనపై పాత్రపై దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆ సంస్థకు, ప్రత్యేకించి కొత్తగా దాని సారథ్య బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మకు సవాల్‌గా మారిన సంగతి తెలిసిందే.
సీబీఐ చీఫ్‌గా ఢిల్లీ మాజీ సీపీ!
Published Wed, Feb 1 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
Advertisement
Advertisement