
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నా రు. సుప్రీంకోర్టు ఆక్షేపణలకు ప్రధాని నరేంద్ర మోదీ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దేశానికి క్షమాపణ చెప్పి, నైతిక బాధ్యత వహించాలన్నారు.
మఖ్దూంభవన్‌లో పార్టీ నేత చాడ వెంకటరెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 20 కోట్ల మంది కార్మికులు రెండు రోజు ల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేశారన్నా రు. అయితే ఈ సందర్భంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో కొన్ని కార్మిక వ్యతిరేక చట్టాలతో సిటిజన్ రిజిస్ట్రేషన్ బిల్లును తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలన్నారు.