
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లో యస్‌బ్యాంకు షేరు మళ్లీ ఫాంలోకి వచ్చేసింది. తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యస్‌బ్యాంకుకు క్లీన్ చిట్ ఇవ్వడంతో లాభాల మెరుపులు మెరిపిస్తోంది. దాదాపు 30శాతానికి పైగా ఎగిసి ఇన్వెస్టర్లను మురిపిస్తోంది.
మొండిబకాయిలు, ప్రొవిజనింగ్ అంశాలలో యస్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ నుంచి క్లియరెన్స్ లభించడంతో ఈ కౌంటర్ ఒక్కసారిగా జోరందుకుంది. గతేడాది(2017-18) ఆస్తుల(రుణాలు) క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ వంటి అంశాలలో ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించిన అంశాన్ని ఆర్‌బీఐ ధృవీకరించిందని మార్కెట్ రెగ్యులేటరీ సమాచారంలో యస్ బ్యాంకు వెల్లడించింంది. దీంతో ఆర్‌బీఐ నుంచి రిస్క్ అసెస్‌మెంట్ నివేదికను పొందినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment