నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ | clean chit to Narendra Modi in poll code violation case | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీకి క్లీన్ చిట్

Published Fri, Aug 8 2014 5:28 PM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM

నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ - Sakshi

నరేంద్ర మోడీకి క్లీన్ చిట్

అహ్మదాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి ఉపశమనం లభించింది. ఈ కేసు విచారించిన గుజరాత్ పోలీసులు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చారు. అహ్మదాబాద్ కోర్టుకు ఈ మేరకు నివేదిక సమర్పించారు.

 ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ఓటేసిన  అనంతరం పోలింగ్ కేంద్రం బయట పార్టీ గుర్తు కమలం చూపుతూ సెల్ఫీతో ఫొటో దిగారు. పోలింగ్ కేంద్రం సమీపంలో పార్టీ గుర్తు చూపడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారించిన పోలీసులు మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement