న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 26వ తేదీన విచారించనుంది. అప్పటి గుజరాత్ సీఎం మోదీకి క్లీన్‌చిట్ ఇస్తూ సిట్ తీసుకున్న నిర్ణయంపై ఆ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీ ఎహ్ సాన్ జాఫ్రీ భార్య జకియా గుజరాత్ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే, ఆధారాలు లేవంటూ 2017లో కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ జకియా సుప్రీం ను ఆశ్రయించగా సోమవారం జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతోపాటు ఇదే కేసులో సహ పిటిషనర్‌గా పరిగణించాలంటూ సామా జిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ పెట్టుకున్న అర్జీపైనా ధర్మాసనం వాదనలు వింది. 2002 గోద్రాలో సబర్మతీ రైలు బోగీకి దుండగులు నిప్పు పెట్టడంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోగా గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి.
Comments
Please login to add a commentAdd a comment