Zakia Jafri
-
గుజరాత్ అల్లర్లపై న్యాయ పోరాటం చేసిన జకియా జాఫ్రి కన్నుమూత
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి(86) శనివారం చనిపోయారు. ‘అమ్మ అహ్మదాబాద్‌లోని ఆమె సోదరి ఇంట్లో ఉన్నారు. ఎప్పటిలాగానే శనివారం ఉదయం కూడా కుటుంబసభ్యులతో గడిపారు. అసౌకర్యం అనిపిస్తోందని చెప్పడంతో డాక్టర్‌ను పిలిచాం. ఆయన వచ్చే సరికే చనిపోయారు. అప్పుడు సమయం 11.30 గంటలు’అని జాఫ్రి కుమారుడు తన్వీర్ తెలిపారు. అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుకు అహ్మదాబాద్‌లో దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది కరసేవకులు చనిపోవడం మరునాడే అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీ కాలనీపై జరిగిన దాడిలో ఎహ్సాన్ జాఫ్రి సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర కలహాలకు దారి తీశాయి. ఈ ఘటనల వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందంటూ అనంతరం జకియా జాఫ్రి సుప్రీంకోర్టు గడప తొక్కారు. న్యాయం పోరాటం చేపట్టి, దేశం దృష్టిని ఆకర్షించారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తదితరులపై చార్జిషీటు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు చాలినంతగా లేరనే విషయం తెలిసి కూడా ఆయన ప్రభుత్వం సైన్యాన్ని మోహరించడంలో ఆలస్యం చేసిందని వాదించారు. ఆమె వాదనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశాలతో 2008లో సిట్ ఏర్పాటైంది. 2012లో సిట్ నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కేసును మూసివేసింది. మోదీ, మరో 62 మందికి క్లీన్చిట్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె తిరిగి మెట్రోపాలిటన్ కోర్టుకు, తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఫలితం దక్కలేదంటూ చివరికి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు. చివరికి, జకియా జాఫ్రి వాదనల్లో పస లేదంటూ సుప్రీంకోర్టు 2022లో ఆమె అర్జీని కొట్టివేసింది. జకియా జాఫ్రి మరణంపై సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాడ్ స్పందించారు. దూరదృష్టి కలిగిన మానవతావాదిగా జకియా జాఫ్రిని అభివరి్ణంచారు. -
గుజరాత్ అల్లర్ల కేసులో.. నిందితులకే ‘సిట్’ కొమ్ముకాసింది
న్యూఢిల్లీ: 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాధించిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఆరోపించారు. ఈ కేసులో సిట్ ఎలాంటి విచారణ జరపలేదని, పైగా నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిందని గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సభ్యులకు, పోలీసులకు ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు శిక్ష పడకుండా సిట్ రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుల్బర్గ్ సొసైటీ వద్ద జరిగిన అల్లర్లలో ఎహసాన్ జాఫ్రీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల వ్యవహారంలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీతో సహా 64 మంది నిందితులకు ‘సిట్’ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు లాయర్ సిబల్ వాదించారు. అల్లర్లు జరుగుతున్నా గుజరాత్ సర్కార్ మిన్నకుండిపోయిందన్నారు. కేసులో ‘సిట్’ ఎలాంటి విచారణ జరపకపోగా నిందితులకు కొమ్ముకాసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 16న వాదనలు కొనసాగనున్నాయి. -
‘మోదీకి క్లీన్చిట్’పై సుప్రీంలో 26న విచారణ
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 26వ తేదీన విచారించనుంది. అప్పటి గుజరాత్ సీఎం మోదీకి క్లీన్చిట్ ఇస్తూ సిట్ తీసుకున్న నిర్ణయంపై ఆ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీ ఎహ్ సాన్ జాఫ్రీ భార్య జకియా గుజరాత్ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే, ఆధారాలు లేవంటూ 2017లో కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ జకియా సుప్రీం ను ఆశ్రయించగా సోమవారం జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతోపాటు ఇదే కేసులో సహ పిటిషనర్‌గా పరిగణించాలంటూ సామా జిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ పెట్టుకున్న అర్జీపైనా ధర్మాసనం వాదనలు వింది. 2002 గోద్రాలో సబర్మతీ రైలు బోగీకి దుండగులు నిప్పు పెట్టడంతో పెద్ద సంఖ్యలో జనం చనిపోగా గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. -
2002 గుజరాత్ అల్లర్ల కేసు: సుప్రీం కోర్టు విచారణ
-
'కోర్టు తీర్పు సంతోషం కలిగించలేదు'
అహ్మదాబాద్: గుల్బర్గ్ సొసైటీ కేసులో అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై విశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కోర్టు తీర్పును సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ స్వాగతించారు. దోషులుగా తేలిన 24 మందిలో 11 మందికే జీవితఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దోషులకు యావజ్జీవ శిక్ష విధించాలని అప్పీలు చేస్తామని ప్రకటించారు. తాము ప్రతీకారం కోరుకోవడం లేదని, పశ్చాత్తాపం కోరుకుంటున్నామని చెప్పారు. కోర్టు తీర్పు పట్ల ఎహసాన్ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తనకు ఆనందం కలిగించలేదన్నారు. ఇది సరైన న్యాయం కాదన్నారు. దోషులందరికీ జీవితఖైదు విధించకపోవడంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దీనిపై తమ న్యాయవాదులను సంప్రదిస్తున్నానని చెప్పారు. అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీలు చేస్తామని దోషుల తరపు బంధువులు పేర్కొన్నారు.