'కోర్టు తీర్పు సంతోషం కలిగించలేదు'
అహ్మదాబాద్: గుల్బర్గ్ సొసైటీ కేసులో అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై విశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కోర్టు తీర్పును సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ స్వాగతించారు. దోషులుగా తేలిన 24 మందిలో 11 మందికే జీవితఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దోషులకు యావజ్జీవ శిక్ష విధించాలని అప్పీలు చేస్తామని ప్రకటించారు. తాము ప్రతీకారం కోరుకోవడం లేదని, పశ్చాత్తాపం కోరుకుంటున్నామని చెప్పారు.
కోర్టు తీర్పు పట్ల ఎహసాన్ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తనకు ఆనందం కలిగించలేదన్నారు. ఇది సరైన న్యాయం కాదన్నారు. దోషులందరికీ జీవితఖైదు విధించకపోవడంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దీనిపై తమ న్యాయవాదులను సంప్రదిస్తున్నానని చెప్పారు. అహ్మదాబాద్ కోర్టు తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీలు చేస్తామని దోషుల తరపు బంధువులు పేర్కొన్నారు.