Hero Arjun Sarja Gets Clean Chit In Me Too Case After Three Years: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment