
యడ్డీకి క్లీన్ చిట్.. బీజేపీలో సంబరాలు
మైసూరు : ముడుపుల కేసుల నుంచి మాజీ సీఎం, బీజేపీ రాష్ట్రశాఖ అద్యక్షుడు బీ.ఎస్. యడ్యూరప్పకు క్లీన్ చిట్ రావడంతో గురువారం మైసూరు నగరంలో మాజీ మంత్రి.ఎస్.ఎ. రామదాసు నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.
అగ్రహారలో ఉన్న గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 101 కొబ్బరి కాయలు కొట్టి స్వీట్లు పంపిణీ చేశారు. రామదాసు మాట్లాడుతూ యడ్యూరప్పపై లేనిపోని ఆరోపణలు చేయగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు.