'క్షమాపణల కోసం అడుక్కుంటున్నారు' | BJP almost begging me for an apology tweeted aravind kejriwal | Sakshi
Sakshi News home page

'క్షమాపణల కోసం అడుక్కుంటున్నారు'

Published Mon, Dec 28 2015 11:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'క్షమాపణల కోసం అడుక్కుంటున్నారు' - Sakshi

'క్షమాపణల కోసం అడుక్కుంటున్నారు'

ఢిల్లీ: బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాడి కొనసాగుతోంది. అరుణ్ జైట్లీ విషయంలో తనను క్షమాపణలు చెప్పాలని బీజేపీ దాదాపు అడుక్కుంటోందని, అయితే తాను మాత్రం క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. జైట్లీ పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా నిజాలు బయటకు వస్తాయన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదని తెలిపారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ పలు అవినీతి కార్యకలాపాలు జరిగినట్లు పేర్కొందని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అయితే ఆ అవినీతికి బాధ్యులను గుర్తిచేందుకు విచారణ కమిషన్ వేయాల్సిందిగా కమిటీ సూచించినట్లు తెలిపారు. ఇప్పుడు బాధ్యులను గుర్తించేందుకు విచారణ కమిషన్ వేస్తున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఢిల్లీ విజిలెన్స్ విభాగం ముఖ్యకార్యదర్శి చేతన్ సంఘీ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ డీడీసీఏ వ్యవహారాలపై విచారణ జరిపి 237 పేజీల నివేదికను రూపొందించింది. ఇందులో జైట్లీపై వచ్చిన ఆరోపణలను ఎక్కడా నిర్ధారించలేదు. దీంతో బీజేపీ నేతలు అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement