న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వ్యవహారంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీపై ఆరోపణలు చేసిన హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. డీడీసీఏ అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదికలో జైట్లీ పేరు లేకపోవడంతో ఆమ్‌ఆద్మీ పార్టీ తీరుపై బీజేపీ మండిపడింది. అబద్ధాలు మాట్లాడటం ఆప్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టింది.
'ఆప్ నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జైట్లీపై వేసిన నేరపూరిత పరువునష్టం కేసును ఉపసంహరించుకోవాలి. తామే పరువునష్టానికి పాల్పడినట్టు కోర్టుకు తెలియజేయాలి' అని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ డిమాండ్ చేశారు. జైట్లీ డీడీసీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఆధునీకరణ విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
'కేజ్రీవాల్.. క్షమాపణ చెప్పు'
Published Sun, Dec 27 2015 9:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement