delhi cricket body
-
భారత్‌లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్‌లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్‌లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్‌లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్‌గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది. -
కీలక పదవికి జైట్లీ కుమారుడు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్ ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. -
సీఎం కేజ్రీవాల్‌కు కేంద్రం మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్రం ప్రకటించింది. విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మరోపక్క, కావాలనే డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీని కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ ఆరోపించారు. అందుకే విచారణను అడ్డుకుంటోందని అన్నారు. స్కాంలో జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ అంటే భయమెందుకు అని ప్రశ్నించారు. జైట్లీ ఏ తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. -
'కేజ్రీవాల్.. క్షమాపణ చెప్పు'
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వ్యవహారంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీపై ఆరోపణలు చేసిన హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. డీడీసీఏ అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదికలో జైట్లీ పేరు లేకపోవడంతో ఆమ్ఆద్మీ పార్టీ తీరుపై బీజేపీ మండిపడింది. అబద్ధాలు మాట్లాడటం ఆప్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టింది. 'ఆప్ నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జైట్లీపై వేసిన నేరపూరిత పరువునష్టం కేసును ఉపసంహరించుకోవాలి. తామే పరువునష్టానికి పాల్పడినట్టు కోర్టుకు తెలియజేయాలి' అని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ డిమాండ్ చేశారు. జైట్లీ డీడీసీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఆధునీకరణ విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
'48 గంటల్లో నివేదిక ఇవ్వండి'
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పై తలెత్తిన అవినీతి ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను నియమించింది. 48 గంటల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ క్రికెట్ బాడీలో పెద్ద మొత్తంలో అవినీతి చోటుచేసుకుందని, అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్యానెల్ వేసింది.