సీఎం కేజ్రీవాల్కు కేంద్రం మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్రం ప్రకటించింది. విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
మరోపక్క, కావాలనే డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీని కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ ఆరోపించారు. అందుకే విచారణను అడ్డుకుంటోందని అన్నారు. స్కాంలో జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ అంటే భయమెందుకు అని ప్రశ్నించారు. జైట్లీ ఏ తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.