Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్‌లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్‌తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్‌చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్‌సీబీ) స్పష్టం చేసింది.
చదవండి:👇
'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్
12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment