
మాజీ క్రీడాకారుడు ప్రతాప్ కుమార్‌కు ప్రభుత్వ పెన్షన్ పత్రాన్ని అందిస్తున్న శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకర రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్, ఆసియన్ పతక విజేత చింత ప్రతాప్‌కుమార్‌కు ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున క్రీడా పెన్షన్ మంజూరు చేసిందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం శాప్ కార్యాలయంలో పెన్షన్ పత్రాన్ని ఆయనకు అందజేసి సత్కరించారు. ప్రతాప్‌కుమార్ 1975లో సౌత్ కొరియాలో జరిగిన 2వ ఆసియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లను 48 సెకన్లలో అధిగమించి రికార్డు కాంస్య పతకం సాధించారు.
1973లో మద్రాస్‌లో జరిగిన ఇండో రష్యన్ అథ్లెటిక్ టెస్టులో రెండో స్థానం, 1975లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ట్రయాంగ్యులర్ 800 మీటర్ల పరుగులో మొదటి స్థానం, వివిధ అంతర్జాతీయ వెటరన్ మీట్‌లలో సత్తా చాటారు. ప్రతాప్‌కుమార్ జాతీయ స్థాయిలో 9 బంగారు, 6 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తనను గుర్తించి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడంపై ప్రతాప్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment