
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ భరత్ రామ్ నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ..గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు గ్రామాల్లో ఉన్నారని, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి సరైన గుర్తింపు దక్కుతుందని ఆయన అన్నారు.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సలహాలు తీసుకుంటున్నామని బైరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వసతులతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సింధూ, రజనీలను ప్రొత్సహించినట్లే ప్రతిభ కల్గిన క్రీడాకారులను ప్రొత్సహిస్తామని బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment