రాజశేఖర్‌రెడ్డి, ఏరాసు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ టికెట్ వదులుకొని ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిపోగా.. ఇప్పుడు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో ఈ సీటు ఆశించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కోరగా.. ఆయన సైతం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు.
అధికారపార్టీ ఓడిపోతుందనే...
శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రోజు రోజుకూ బలపడుతోంది. మండలాలు, గ్రామాల వారీగా నేతలు క్యూ కడుతున్నారు. దీంతో అధికార టీడీపీకి నాయకత్వమే లేకుండా పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటమి ఖాయ మని తెలుసుకున్న బుడ్డా రాజశేఖరెడ్డి, ఏరాసు ప్రతా పరెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిసింది. అయితే, తన భార్య అనారోగ్యం వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బుడ్డా రాజశేఖరెడ్డి తన అను చరులతో చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగ కుండా పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటు న్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ‘నంద్యాల’ ఏవీ సుబ్బారెడ్డిని శ్రీశైలం నుంచి బరిలో దింపాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. ఆయన అంగీకరిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది.
వీడని ‘సీట్ల’ ముడి..
మరోవైపు కర్నూలు, కోడుమూరు, నంద్యాల సీట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి కుటుంబం ప్రకటించింది. గురువారం తాము ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు వేస్తామని తేల్చి చెప్పింది. చంద్రబాబును నమ్మి పూర్తిగా మోస పోయామని ఆ కుటుంబం మండిపడుతోంది. ఇక కర్నూలు సీటును మొన్నటివరకు ఎస్వీ మోహన్ రెడ్డికి ఇస్తామంటూ టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ సీటును టీజీ భరత్‌కు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. తనకు సీటు ఇవ్వకపోతే అటు పత్తికొండ, ఇటు ఆలూరు, కర్నూలులో టీడీపీని ఓడిద్దామని ఎస్వీ మోహన్‌రెడ్డి అనుచరులకు స్పష్టం చేసినట్లు సమా చారం. ఇక కోడుమూరు సీటును రిటైర్డు ఐఏఎస్ రామాంజనేయులుకు ఇవ్వొద్దని కోట్ల వర్గం అం టుండగా.. ఆయనకే ఇవ్వాలని, లేదంటే తన అను చరులకివ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.
మీరెంత సంపాదించారో నాకు తెలుసు!
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరా యించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు తన మార్క్ ‘యూజ్ అండ్ త్రో’ రాజకీయం రుచి చూపి స్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఇక కోడు మూరు ఎమ్మెల్యే మణిగాంధీకి సీటు నిరాకరించారు. పార్టీ మారిన సమయంలో ఎవరెవరికి ఎంత ఇచ్చా నో? తర్వాత ఎవరెవరు ఎంత సంపాదించారో చిట్టా అంతా తన వద్ద ఉందని చంద్రబాబు వీరిని హెచ్చ రిస్తున్నట్లు తెలిసింది. దీంతో వారంతా కిందామీద పడుతున్నారు. చంద్రబాబు మాటలతో వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చి ఎంత పెద్ద తప్పు చేశా మో అర్థమవుతోందని వారంతా తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. మరోవైపు ఓటమి ఖాయమని తెలుస్తున్నందున.. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేసి.. ఉన్న డబ్బులను కూడా ఎందుకు పోగొట్టుకోవడమని భావిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment