
మంత్రాలయం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ద్రోహి అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి విమర్శించారు. శనివారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో కౌతాళం మండలం ఉప్పరహల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గాదలింగప్ప, శేఖన్న, ఉసేని, లింగప్ప, మర్రిస్వామి, అయ్యప్ప, టీడీపీ నాయకులు ఈరన్న, మహదేవ, వెంకన్నలతో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి రాగానే గాలికొదిలారన్నారు. ప్రభుత్వ ఫలాలు కూడా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెడుతూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏకాంభ్రం రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరిన కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment