సీమాంధ్ర నుంచే పరిపాలన: చంద్రబాబు
నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సీమాంధ్ర అభివృద్ధికి మోడీ సంపూర్ణ సహాయం అందిస్తారు అని చంద్రబాబు అన్నారు.
సీమాంధ్ర ఆర్ధిక పరిస్థితి ఎంటో తెలియదని.. కనీసం ఎన్ని అప్పులు, ఎంత ఆదాయాలు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏకు కామన్ ప్రోగ్రామ్ అంటూ ఏమి లేదన్నారు.
దేశాభివృద్ధిపై మోడీకీ అద్భుతమైన ఆలోచనలున్నాయన్నారు. సీమాంధ్ర నుంచే పరిపాలన సాగిస్తానని, త్వరలో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తానని ఓప్రశ్నకు చంద్రబాబునాయుడు సమాధానమిచ్చారు. మంచి సూచనలు ఎవరూ ఇచ్చినా స్వీకరిస్తానని మోడీ అన్నారని మీడియాకు చంద్రబాబు తెలిపారు. అలాగే పవన్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.