రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న రీపోలింగ్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికల రూపంలో తెప్పించుకున్నారు. రీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నివేదికలను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీంతో రీ పోలింగ్ అవసరమయ్యే కేంద్రాలను శనివారం ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
రీపోలింగ్ నిర్వహించే కేంద్రాలు..
కడప జిల్లా జమ్మలమడుగు 80, 81, 82 పోలింగ్ కేంద్రాలు
కరీంనగర్ హుస్నాబాద్ 170 పోలింగ్ కేంద్రం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట 122 పోలింగ్ కేంద్రం
మైలవరంలో 123వ పోలింగ్ కేంద్రం
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం 212 పోలింగ్ కేంద్ర
గుడివాడ 123, అవనిగడ్డ 91, 29 పోలింగ్ కేంద్రాలు
నందిగామ 171, 174 కేంద్రాలు
కృష్ణా పెనమలూరు 59, 172 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
అరకు పార్లమెంట్ పరిధిలో పాడేరు 68, సాలూరు 134, కూరుపాం 192లలో రీపోలింగ్
ఖమ్మం జిల్లా కొత్తగూడెం 161 పోలింగ్
శ్రీకాకుళం అసెంబ్లీ 46వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి భద్రాచలం నియోజకవర్గం 239 కేంద్రం
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి 371-ఏ కేంద్రంలో రీపోలింగ్
జహీరాబాద్ పార్లమెంట్ పరిధి జుక్కల్‌లో 134వ పోలింగ్ కేంద్రం
నిజామాబాద్ రూరల్ పరిధిలో 9, 48, 168 పోలింగ్ కేంద్రాలు
బోధన్ 164 పోలింగ్ కేంద్రం
బాన్సువాడ 39, 146, 187 పోలింగ్ కేంద్రాలు
తెలంగాణలో 12 చోట్ల, సీమాంధ్రలో 17 చోట్ల రీ పోలింగ్