ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరవదు: వెంకయ్య | there is no chance to congress win single seat, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరవదు: వెంకయ్య

Published Fri, May 9 2014 12:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

there is no chance to congress win single seat, says venkaiah naidu

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఖాతా తెరవదని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవదని, డిపాజిట్లూ దక్కవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం నేర్పుతారన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీమాంధ్రలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మోడీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని, బీజేపీ-టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు ఆందోళనకు గురి చేసిందన్నారు.

 

భూమిలో దాచిన మద్యాన్ని ఎన్నికల ముందు బయటకు తీసి పంపిణీ చేయడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ధనం, మద్యం, ఇతర ప్రలోభాలకు అతీతంగా ప్రజలు మంచి పరిపాలనకు ఓటు వేశారని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement