సీమాంధ్రులకు వత్తాసు పలుకుతున్న కేంద్రం
చంద్రశేఖర్‌కాలనీ : కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రులకు వత్తాసు పలుకుతోందని టీఆర్‌ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం చెలాయించేవిధంగా చర్యలు తీసుకోవడం, దగాపడిన తెలంగాణకు ఇంకా అన్యాయం చేసేందుకు సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతోందని ఆరోపించారు.
ఆరు దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం తనవంతు తోడ్పాటునందించాల్సిన విషయం మరవడాన్ని తెలంగాణ ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ విషయంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించినా, ఈ విషయంపై బీజేపీ నాయకులు రాద్ధాంతం చేయడం తగదన్నారు. 39 లక్షల మంది రైతులకు * 19 లక్షల వరకు రుణాలను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేస్తుం దన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమది రైతు ప్రభుత్వమన్నారు. ఈ నెల 19 జరిగే ఇంటింటి సర్వేకు జిల్లా రైతులు,ప్రజలందరు సహకరించాలని కోరారు.