'4 లక్షలకు పైగా సీమాంధ్రుల ఓట్లు తొలగింపు' | 4 lakh seemandhra voters removed from hyderabad list | Sakshi
Sakshi News home page

'4 లక్షలకు పైగా సీమాంధ్రుల ఓట్లు తొలగింపు'

Published Mon, Sep 21 2015 3:24 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

'4 లక్షలకు పైగా సీమాంధ్రుల ఓట్లు తొలగింపు' - Sakshi

'4 లక్షలకు పైగా సీమాంధ్రుల ఓట్లు తొలగింపు'

న్యూఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్లో 4 లక్షలకు పైగా సీమాంధ్ర ఓటర్లను తొలగించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  జీహెచ్ఎంసీలో ఓట్లు తొలగింపుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్కు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుట్రపూరితంగా మరొక 25 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు.  

జీహెచ్ఎంసీ కమిషనర్ సోమశ్ కుమార్ టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. బోగస్ ఓటర్లను తొలగిస్తే అభ్యంతరం లేదని అన్నారు. డోర్ లాక్, షిప్ట్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తొలగింపు ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగింపు ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని, గ్రేటర్ ఎన్నికల జాబితా ఫైనల్కు ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవారిని కాకుండా బయట వ్యక్తిని పరిశీలకుడిగా నియమించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement