ఇదీ మేయర్ లెక్క..
* ఎన్నికైన కార్పొరేటర్లు 150
* ఎక్స్ అఫీషియో సభ్యులు 67 మంది
* మొత్తం ఓటర్లు 217
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ను ఎన్నుకోవడంలో మరో ట్విస్ట్ ఎదురయ్యింది. మేయర్ ఎన్నికలో 217 మందికి ఓటు హక్కు ఉంది. ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు 67 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు వీరిలో ఉన్నారు. ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేసేందుకు ఇటీవల జీవోను సవరించడంపై హైకోర్టులో ఉన్న కేసు సోమవారం విచారణకు రానుండటం..
ఆగమేఘాల మీద సదరు జీవోను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ తేవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో మేయర్‌ను ఎన్నుకోనున్న ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎందరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం మేరకు అర్హత కలిగిన ఎక్స్‌అఫీషియోలు 67 మంది ఉన్నారు. ఏపీకి కేటాయించిన రాజ్యసభ సభ్యులకు సైతం ఇక్కడ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించారు. తామిక్కడి ఓటర్లయినందున తమకు కూడా ఓటు హక్కు ఉండాలని ఎంఏ ఖాన్ కోరడంతో ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించి... వారికి అవకాశం కల్పించారు.
ఈ మేరకు మేయర్ ఎన్నికకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కార్పొరేటర్లతో పాటు వీరందరికీ ఆహ్వానపత్రాలు పంపడంతో వారు ఈ నెల 11న మేయర్ ఎన్నికకు హాజరు కానున్నారు. ఎన్నిక జరిగే హాల్‌లోకి వెళ్లేముందు అంతకుముందు తామెక్కడా మేయర్ ఎన్నికలో ఓటు వేయలేదని డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలి. వీరిలో కనీసం సగం మంది హాజరైతే మేయర్ ఎన్నికకు కోరం ఉన్నట్లు లెక్క. అంటే కనీసం 109 మంది హాజరైతే మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు.
అయితే టీఆర్‌ఎస్‌కు సంఖ్యా బలమున్నందున మేయర్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఎక్స్ అఫీషియోలుగా ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో పదిమంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఇక్కడ ఓటు హక్కు ఉండగా, మిగ తా వారు ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కులేని వారు..
ఎమ్మెల్సీల్లో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులకు ఇక్కడ ఓటు హక్కు లేదు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కూడా లేదు. వీరు ఇప్పటికే ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుల నిర్ధారించుకున్నారు. ఎమ్మెల్సీలు..
1. భూపాల్‌రెడ్డి, 2 సుంకరిరాజు, 3.కె.జనార్దన్‌రెడ్డి , 4. భూపతి రెడ్డి , 5. సతీష్‌కుమార్, 6. కర్నె ప్రభాకర్, 7. వి.స్వామిగౌడ్, 8. ఎండి సలీం, 9.నాయిని నరసింహారెడ్డి , 10. గంగాధ ర్‌గౌడ్, 11. డి.రాజేశ్వరరావు, 12. పూల రవీందర్, 13. మహమూద్‌అలీ, 14. కసిరెడ్డి నారాయణరెడ్డి ,15. పి.సుధాకర్‌రెడ్డి ,మ16. మహ్మద్ అలీ షబ్బీర్, 17. పల్లా రాజేశ్వర్, 18. యాదవరెడ్డి, 19. బి.వెంకటేశ్వర్లు, 20. ఎం.శ్రీనివాసరెడ్డి, 21. నేతి విద్యాసాగర్, 22. రాములు నాయక్, 23. పట్నం నరేందర్‌రెడ్డి, 24. భానుప్రసాదరావు, 25. సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి, 26ఎంఎస్ ప్రభాకర్, 28. నారదాసు లక్ష్మణరావు, 29. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి.