పార్టీలు ... డివిజన్లలో మార్పు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఇరవై మందికి పైగా గత పాలక మండలిలో, మరో పదిమంది 2002లో కార్పొరేటర్లుగా గెలిచిన వారు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లలో ఉండ గా... ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. కొందరు అవే డివిజన్ల లో రెండోసారి గెలుపొందగా... మరికొందరు ఇతర డివిజన్ల నుంచి విజయం సాధించారు. గతంలో ఉన్న కొన్ని డివిజన్లు రద్దు కావడం.. కొన్నింటిలో రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేయలేకపోవడం వంటికారణాలతో ఇతర డివిజన్ల నుంచి బరిలో దిగారు.
ఎంఐఎం కార్పొరేటర్లు పార్టీ మారనప్పటికీ... కొందరి డివిజన్లు మారాయి. అలాంటి వారిలో మాజీమేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. గత పాలక మం డలిలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన బంగారి ప్రకా శ్ ఇప్పుడు వేరే డివిజన్ నుంచి గెలుపొం దారు. ఎంఐఎం కోఆప్షన్ సభ్యురాలు అయేషారూబినా ఈసారి అహ్మద్‌నగర్ డివిజన్ నుంచి గెలిచారు. వీరిలో కొందరు మూడోసారి ఎన్నికైన వారు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.
రెండో పర్యాయం కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో జిట్టా రాజశేఖరరెడ్డి (వనస్థలిపురం), సయ్యద్ మిన్హాజుద్దీన్ (అక్బర్‌బాగ్), మీర్ వాజి ద్ అలీఖాన్, తారాబాయి (ఫలక్‌నుమా), సున్నం రాజ్‌మోహన్ (పురానాపూల్), మహ్మద్ యూసుఫ్ (దత్తాత్రేయనగర్), కె.సత్యనారాయణ (జూబ్లీహిల్స్), జగన్ (జగద్గిరిగుట్ట) ఉన్నారు.
మరోసారి గెలిచిన వీరులు!
Published Sun, Feb 7 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement
Advertisement