కొత్తగూడెంలో ఏఐటీయూసీ ధర్నా
అధికారుల నిర్బంధం
శ్రీరాంపూర్ : కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఏ ఐటీయూసీ ఆందోళనకు దిగింది. చలో కొత్తగూడెoలో భాగంగా సోమవారం ఆ యూనియన్ అన్నీ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కొత్తగూడెం తరలివెళ్లి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులెవ్వరిని లోనికి వెళ్లనీయకుండా కా ర్యాలయం మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి దిగ్బంధనం చేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొ న్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య మాట్లాడుతూ, కార్మికుల 31 డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేపట్టామన్నారు. గు ర్తింపు సంఘం టీబీజీకేఎస్ నాయకులు అధికారం కోసం కొట్టుకుంటూ కార్మికుల సమస్యలను గాలికొదిలేశారని పేర్కొన్నారు.
కంపెనీ లాభా ల నుంచి కార్మికులకు 25 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. బదిలీ ఫిల్లర్లను పర్మినెం ట్ చేయాలని, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, డిస్మిస్ కార్మికులందరికీ ఒక్కసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రా క్ ద్వారా డిపెండెంట్లను తీసుకోవాలని, కంపెనీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. దీంతోపాటు కొత్తగా అధికారంలోకి వ చ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను కూ డా నెరవేర్చాలన్నారు.
కార్మికులకు ఐటీ మాఫీ చేయించాలని, సకల జనుల సమ్మె సందర్భంగా కార్మికులు కోల్పోయిన వేతనాన్ని వడ్డీతో సహా ఇప్పించాలని, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర నాయకులు మిర్యా ల రంగయ్య, భానుదాసు, వీరభద్రయ్య, మ ల్లారెడ్డి, రాజేశ్వర్‌రావు, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచీల కార్యదర్శులు ఎల్.శ్రీనివాస్, బాజీసైదా, కిషన్‌రావు పాల్గొన్నారు.