Meyor Selection
-
మేయర్ కర్చీకి ఫోర్జరీ బూచి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ కుర్చీకి టీడీపీ నేతలు ఎసరు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన ఆ గిరిజన మహిళను ఆ పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేయించేందుకు కుట్రలు, కుయుక్తులు ప్రారంభించారు. మేయర్ దంపతులను వైఎస్సార్సీపీకి రాజీనామా చేసే విధంగా వారిని ఫోర్జరీ బూచితో బెదిరించి.. రెండు వారాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమకు అనుకూలమైన సోషల్ మీడియా ద్వారా మేయర్ భర్త పాత్రపై విస్తృత ప్రచారం చేస్తూ పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదంతా కార్పొరేషన్లో పెత్తనం కోసమే అనే ప్రచారం జరుగుతోంది.నెల్లూరు నగరపాలక సంస్థ హోదాను సంతరించుకున్న తర్వాత మొదటి సారిగా ప్రథమ పౌరురాలిగా గిరిజన మహిళకు రిజర్వేషన్ కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి నెల్లూరు 12 డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికై న పోట్లూరి స్రవంతిని మేయర్‌ను చేసింది. అయితే రాష్ట్రం, జిల్లాలో అధికార మార్పిడి జరగడంతో టీడీపీ ప్రభుత్వ నేతలు నగరపాలక సంస్థలో పెత్తనం కోసం రాజకీయ కుట్రకు తెర తీశారు. మేయర్ పదవిలో ఉన్న గిరిజన మహిళను టార్గెట్ చేసి ఆమె భర్త జయవర్ధన్ తన భార్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెరపైకి తెచ్చారు.వైఎస్సార్సీపీలో ఉన్న మేయర్ దంపతులను టీడీపీలోకి చేర్చుకునేందుకు టీడీపీ నేతలు కుయుక్తులు పన్నడంతో భయపడిపోయిన వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సముఖంగానే నెల్లూరు రూరల్ ప్రజాప్రతినిధిని శరణు వేడుతూ, క్షమాపణలు అడిగారు. దీన్ని బట్టి టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని అర్థమవుతోంది. మేయర్ దంపతులపై టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారనే ప్రచారం జరగడంతో తాజాగా మరో కొత్త వ్యూహాన్ని రచించారు.డిప్యూటీ మేయర్‌తోనే..నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో మేయర్ దంపతుల ప్రమేయం ఉందని బూచిగా చూపి ఆమెతో తన పదవికి రాజీనామా చేయించే కుట్రలు పన్నుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోది. రెండు వారాలుగా గిరిజన మహిళను మానసిక క్షోభకు గురి చేస్తున్న టీడీపీ నేతలు త్వరలోనే మేయర్ సీటును ఖాళీ చేయించి.. డిప్యూటీ మేయర్‌ను ఇన్చార్జి మేయర్ స్థానంలో కూర్చొబెట్టి తమ పెత్తనం సాగించే ప్రయత్నాలు మమ్మురం చేశారని కార్పొరేషన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేయర్ తన పదవికి రాజీనామా చేసే విధంగా విచారణలో ఉన్న ఫోర్జరీ వ్యవహారాన్ని తమకు అనుకూల సోషల్ మీడియాలో మేయర్ భర్త ప్రమేయం ఉన్నట్లుగా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారు.గతంలో వైఎస్సార్సీపీ నుంచి మేయర్‌గా ఎన్నికై .. ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన అబ్దుల్ అజీజ్ హయాంలో జరిగిన తప్పులను ప్రస్తుత మేయర్ స్రవంతి భర్తకు ముడిపెట్టి భయపట్టే కుట్రలు జరుగుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి మార్ట్‌గేజ్‌లో ఉన్న భవనాలను విడుదల చేయించి దాదాపు రూ.15 కోట్ల మేర కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ.వాస్తవంగా కార్పొరేషన్ పాలన వ్యవహారాలు అన్ని కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి. మార్జ్గేజ్లో ఉన్న భవనాలను రిలీజ్ వ్యవహారం కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ విధానం ఎక్కడా మాన్యువల్‌గా జరగలేదు. గతంలో టీడీపీ హయాంలో బీపీఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే మాన్యువల్‌గా చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఏ సంబంధం లేని ఓ న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయించడం, ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరగకుండానే సోషల్ మీడియాలో నలుగురు వైఎస్సార్సీపీ నేతలకు ఉచ్చు అంటూ పోస్ట్‌లు పెట్టించడం చూస్తే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమనే చర్చ జరుగుతోంది.కేవలం కార్పొరేషన్‌పై పెత్తనం కోసం టీడీపీ ప్రజాప్రతినిధుల మైండ్ గేమ్‌తో మేయర్ దంపతులతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఇదీ చాలదన్నట్లు ఇంకా వారిపై ఒత్తిడి పెంచి మేయర్ పదవి నుంచి దించేసే కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తున్నారు.నోరు విప్పని మంత్రి నారాయణ..రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ తన శాఖ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థలో రెండు వారాలుగా ఫోర్జరీ వివాదం నడుస్తోంది. ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు నోరు విప్పకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధుల మైండ్ గేమ్ అర్థం చేసుకున్న నారాయణ ఈ వ్యవహారంలో తలదూర్చడానికి సందేహిస్తున్నారా? లేక ఆ మైండ్‌గేమ్‌లో ఆయన పాత్ర ఉందా? అనే అనుమానాలపై చర్చ నడుస్తోంది.మీడియా ముందుకు రాని కమిషనర్..రెండు వారాలుగా కార్పొరేషన్లో కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారనే ప్రచారంపై ప్రాథమిక విచారణలో కూడా నిజమేనని తేలింది. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్‌కు అప్పగించారు. నలుగురు టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయితే కార్పొరేషన్లో ఏం జరుగుతుందనే విషయంపై కమిషనర్ మీడియా ముఖంగా ఎందుకు వెల్లడించలేదనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.నిజంగా తన సంతకం ఫోర్జరీ జరిగి ఉంటే ఫోరెన్స్కు పంపారా? అలా ఎందుకు చేయలేదు. కేవలం అధికారులను బలి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫోర్జరీ వ్యవహరం నిజమైతే వాస్తవాలు బయట పెట్టేందుకు కమిషనర్ ఎందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలతో పాటు నగర ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కోణంగా ఉండడంతోనే మీడియా ముందుకు వచ్చే సాహసం చేయలేదనే చర్చ జరుగుతోంది. -
ఇదీ మేయర్ లెక్క..
* ఎన్నికైన కార్పొరేటర్లు 150 * ఎక్స్ అఫీషియో సభ్యులు 67 మంది * మొత్తం ఓటర్లు 217 సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ను ఎన్నుకోవడంలో మరో ట్విస్ట్ ఎదురయ్యింది. మేయర్ ఎన్నికలో 217 మందికి ఓటు హక్కు ఉంది. ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు వీరిలో ఉన్నారు. ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేసేందుకు ఇటీవల జీవోను సవరించడంపై హైకోర్టులో ఉన్న కేసు సోమవారం విచారణకు రానుండటం.. ఆగమేఘాల మీద సదరు జీవోను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ తేవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో మేయర్‌ను ఎన్నుకోనున్న ఎక్స్అఫీషియో సభ్యులు ఎందరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం మేరకు అర్హత కలిగిన ఎక్స్‌అఫీషియోలు 67 మంది ఉన్నారు. ఏపీకి కేటాయించిన రాజ్యసభ సభ్యులకు సైతం ఇక్కడ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించారు. తామిక్కడి ఓటర్లయినందున తమకు కూడా ఓటు హక్కు ఉండాలని ఎంఏ ఖాన్ కోరడంతో ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించి... వారికి అవకాశం కల్పించారు. ఈ మేరకు మేయర్ ఎన్నికకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కార్పొరేటర్లతో పాటు వీరందరికీ ఆహ్వానపత్రాలు పంపడంతో వారు ఈ నెల 11న మేయర్ ఎన్నికకు హాజరు కానున్నారు. ఎన్నిక జరిగే హాల్లోకి వెళ్లేముందు అంతకుముందు తామెక్కడా మేయర్ ఎన్నికలో ఓటు వేయలేదని డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలి. వీరిలో కనీసం సగం మంది హాజరైతే మేయర్ ఎన్నికకు కోరం ఉన్నట్లు లెక్క. అంటే కనీసం 109 మంది హాజరైతే మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. అయితే టీఆర్ఎస్కు సంఖ్యా బలమున్నందున మేయర్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఎక్స్ అఫీషియోలుగా ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో పదిమంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు, 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఇక్కడ ఓటు హక్కు ఉండగా, మిగ తా వారు ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కులేని వారు.. ఎమ్మెల్సీల్లో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులకు ఇక్కడ ఓటు హక్కు లేదు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కూడా లేదు. వీరు ఇప్పటికే ఇతర పురపాలికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుల నిర్ధారించుకున్నారు. ఎమ్మెల్సీలు.. 1. భూపాల్‌రెడ్డి, 2 సుంకరిరాజు, 3.కె.జనార్దన్‌రెడ్డి , 4. భూపతి రెడ్డి , 5. సతీష్‌కుమార్, 6. కర్నె ప్రభాకర్, 7. వి.స్వామిగౌడ్, 8. ఎండి సలీం, 9.నాయిని నరసింహారెడ్డి , 10. గంగాధ ర్‌గౌడ్, 11. డి.రాజేశ్వరరావు, 12. పూల రవీందర్, 13. మహమూద్‌అలీ, 14. కసిరెడ్డి నారాయణరెడ్డి ,15. పి.సుధాకర్‌రెడ్డి ,మ16. మహ్మద్ అలీ షబ్బీర్, 17. పల్లా రాజేశ్వర్, 18. యాదవరెడ్డి, 19. బి.వెంకటేశ్వర్లు, 20. ఎం.శ్రీనివాసరెడ్డి, 21. నేతి విద్యాసాగర్, 22. రాములు నాయక్, 23. పట్నం నరేందర్‌రెడ్డి, 24. భానుప్రసాదరావు, 25. సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి, 26ఎంఎస్ ప్రభాకర్, 28. నారదాసు లక్ష్మణరావు, 29. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి.