ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఫిబ్రవరి 2న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాష్ట్ర నేతలతో సమీక్ష జరుపుతున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో కాంగ్రెస్ ఓటమిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి పార్టీ ఓటమి అంశంపై దిగ్విజయ్ కి వివరణ ఇచ్చుకున్నారు. రేపు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో విజయవాడలో భేటీ అవ్వనున్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో దిగ్విజయ్ పాల్గొననున్నారు.