సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఈ విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపిస్తామని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శనివారం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై శాస్త్రీయంగా చెబుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. నారాయణఖేడ్‌లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినా నిర్లక్ష్యం చేసిందన్నారు.
నోటా ఆప్షన్ తొలగించడం, ఈవీఎంలకు ప్రింటర్లు లేకుండా ఎన్నికలను నిర్వహించడం, పేపర్ బ్యాలెట్‌ను నిర్వహించాలని కోరినా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, సిద్దిపేట పురపాలక ఎన్నికలనైనా పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
న్యాయపోరాటం చేస్తాం: కాంగ్రెస్
Published Sun, Feb 14 2016 3:51 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement