సీమాంధ్రలో ఫ్యాన్ గాలి | Fan shows leading in seemandhra polls | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో ఫ్యాన్ గాలి

Published Thu, May 8 2014 2:07 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

సీమాంధ్రలో ఫ్యాన్ గాలి - Sakshi

సీమాంధ్రలో ఫ్యాన్ గాలి

 ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్
 
 సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన సీమాంధ్ర ఎన్నికల పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎనిమిదవ విడతగా జరిగిన ఈ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాం తంగా పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు సీమాంధ్ర అంతటా ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించబోతోందని పార్టీ నేత లు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తీరును విశ్లేషించుకున్న తెలుగుదేశం శిబిరంలో పూర్తి గా నిరుత్సాహం ఆవరించింది. బుధవారం సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగిన తీరును బట్టి ఆయా పార్టీలు తమ గెలుపు అవకాశాలను విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. నియోజకవర్గాలవారీగా సేకరించిన నివేదికల మేరకు, వైఎస్సార్‌సీపీ కనీసం 140 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకుంటుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉదయం పోలింగ్ మొదలైనప్పటినుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వివరించారు. భారీ విజయాలతో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించబోతోందనే వార్తలే న లువైపుల నుంచి వెల్లువెత్తుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పరిస్థితి తమ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి రాబోతున్నామని పార్టీ ముఖ్య నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.
 
 బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ జగన్‌కు అనుకూలంగా ప్రభంజనం స్పష్టంగా కన్పించిందని అన్ని జిల్లాల నుంచీ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది. ఏ వర్గానికీ కొమ్ముకాయని జాతీయ, రాష్ట్ర మీడియా వర్గాలు కూడా వైఎస్సార్‌సీపీయే పూర్తి ఆధిక్యతలో ఉందని... టీడీపీ-బీజేపీ రెండూ కలిసి కూడా ఏ దశలోనూ జగన్ గాలిని కనీసం నిలువరించ లేకపోయాయని పోలింగ్ అనంతరం విశ్లేషించాయి. చిత్తూరు మొదలుకుని శ్రీకాకుళం దాకా సీమాంధ్ర అంతటా జగన్ హవా యే సాగిందని ఆ వర్గాలు అంచనా వేశాయి. ఉద యం నుంచి తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుం డా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన వైనం చూస్తే వారంతా మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టంగా కన్పించింది. వృద్ధులు, మహిళలు, యువ తీ యువకులు... ఇలా అన్ని వర్గాల వారూ ఓటేయడానికి పోటెత్తారు. జగన్, విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం సందర్భంగా వారిని చూసేందుకు, వారి మాటలు వినేందుకు ఎండకు, వానకు లెక్క చే యకుండా ఎలాగైతే గంటల తరబడి భారీ సంఖ్యలో ప్రజలు వేచి చూశారో పోలింగ్ రోజున ఓటేయడానికి కూడా ఓటర్లు అదే తరహాలో పోటెత్తారు. కుల, మత, ప్రాంత, వర్గాలతో నిమిత్తం లేకుండా అంతా ఏకాభిప్రాయంతో జగన్‌కు ఓటేసినట్లు పోలింగ్ అనంతరం పార్టీకి అందిన నివేదికల్లో తేలిందని నేత లు పేర్కొన్నారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని, మిగతా జిల్లాల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటామని వారన్నారు.
 
 నిస్తేజంలో దేశం నేతలు
 
 సాధారణంగా ఏ ఎన్నికల సమయంలోనైనా వాతావరణం ఏ మాత్రం సానుకూలంగా కనిపించినా చెప్పలేనంత హడావుడి చేసే టీడీపీ నేతలు బుధవారం మాత్రం అసలు తెర మీదికేరాలేదు. కనీసం తమ స్పందనలు తెలియజేయడానికి కూడా వారెవరూ మీడియా ముందుకు రాలేదు. పలువురు టీడీపీ నేత లు అర్ధరాత్రి దాకా అంతర్గత విశ్లేషణల్లో తలమునకలయ్యారు. టీడీపీ అధ్యక్షుడు బాబు కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఉదయం నుంచి జిల్లా నేతలతో పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గడిపారు. అనేక నియోజకవర్గాల్లో వెనుకబడ్డామన్న సమాచారం టీడీపీ నేతలను బాగా కుంగదీసింది. వారం తా అందుకు కారణాలు విశ్లేషించే పనిలో పడ్డారు. సీమాంధ్ర మొత్తంమీద ఏ జిల్లాలోనూ తమకు కనీసం ఆశాజనకమైన పరిస్థితి కూడా కన్పించకపోవడంతో నేతలంతా నీరసించారు. జిల్లాల్లో ఉన్న నేతలు పరిస్థితి ఎలా ఉందంటూ వాకబు చేస్తూ కన్పించారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారంతో మరింతగా నిరుత్సాహపడ్డారు. చివరి క్షణాల్లో కాంగ్రెస్ నేతలను భారీగా పార్టీలో చేర్చుకోవడం, బీజేపీ మద్దతు తీసుకోవడం.. ఇలా తమను దెబ్బతీసిన అంశాలపై టీడీపీ నేతలు ఇప్పటినుంచే విశ్లేషణలో పడ్డారు. కాంగ్రెస్ నేతల్లోనైతే అసలు పోలింగ్ ను పట్టించుకున్న నాయకుడే కరువయ్యారు!
 
 పోలింగ్ సరళి
 
 సీమాంధ్రలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకే 13 జిల్లాల్లో సరాసరిన 33 శాతం పోలింగ్ నమోదయింది. ఆ సమయానికి కర్నూలు జిల్లాలో గరిష్టంగా 41 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపు 52 శాతం, 3 గంటలకు 63 శాతం ఓట్లు పోలయ్యాయి. మిట్టమధ్యాహ్నం మండుటెండలోనూ ఓటర్లు ఓపిగ్గా లైన్లలో నిలబడి ఓట్లేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement