రాజధాని ఎంపిక కోసం విశాఖ చేరుకున్న కమిటీ
సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం నియమించిన కే. శివరామకృష్ణన్ కమిటీ శుక్రవారం విశాఖపట్నానికి చేరుకుంది.
విశాఖపట్నం: సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం నియమించిన కే. శివరామకృష్ణన్ కమిటీ శుక్రవారం విశాఖపట్నానికి చేరుకుంది. రాజధాని ఎంపిక కోసం అధ్యయనం చేస్తున్న కమిటీ రేపు విశాఖ నగరంలో పర్యటించనుంది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాలను శివరామకృష్ణ కమిటి పరిశీలించనుంది.
కొత్త రాష్ట్రానికి రాజధానిగా విశాఖ జిల్లాకు ఉన్న అర్హతలపై కమిటీ కసరత్తు చేయనుంది. ఐదుగురు సభ్యులతో ఉన్న ఈ కమిటీ విశాఖతో పాటు విజయవాడ కూడా పర్యటిస్తుంది. ఈ కమిటీ పర్యటన కారణంగా విశాఖకు ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో విశాఖవాసుల్లో రాజధాని ఆశలు రేకెత్తుతున్నాయి.
ఇందులో చైర్మన్ కె.శివరామకృష్ణన్‌తో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రథిన్‌రాయ్, బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ డెరైక్టర్ అరోమర్ రేవి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అర్బన్ ఎఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, హైదరాబాద్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి ఉన్నారు.