విశాఖను రాజధానిగా కోరడం సరికాదు
రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మరో వ్యాఖ్య చేశారు. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కోరడం సబబు కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, స్టీల్ ప్లాంటు లాంటివన్నీ ఉన్న తమ నగరాన్ని రాజధానిగా చేయాలని విశాఖ వాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆశలపై నారాయణ నీళ్లు చల్లారు.
వుడా (విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)లో అవినీతి నిర్మూలనకు నెల రోజుల్లో చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తామని, వీటిలో ప్రతి 15 రోజులకు ఒకసారి అభివృద్ధిపై సమీక్షిస్తామని ఆయన అన్నారు. మునిసిపాలిటీ, వుడా అధికారులతో సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.