vuda
-
వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి 12 ప్రాంతాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి డిపీఆర్‌లు సిద్దం చేసినట్లు పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస రావు తెలిపారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పస్తామన్నారు. కోవిడ్ కారణంగా గత ఆరు నెలలలో రాష్ట్ర పర్యాటక శాఖ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రం సూచనల మేరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్క్ లు, మ్యూజియంలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. ఉడాకి పూర్వ వైభవం తీసుకువస్తామని, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోపు ఎన్ఎడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. (చదవండి: పర్యాటకానికి మరింత ఊతం) రుషికొండలో బోటింగ్ పాయింట్‌ను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో విశాఖ జిల్లాల్లోని అయిదు చోట్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా బౌద్దారామాలనుని అభివృద్ది చేసి, పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాక ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బీచ్ టూరిజంలపై కూడా దృష్టి సారించామన్నారు. పర్యాటక కొత్త పాలసీ ప్రకారం టూరిజం ఆపరేటర్లు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. -
‘ఓజోన్’ ఉచ్చు ఎవరి మెడకు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో పెను ప్రకంపనలు సృష్టించిన ఓజోన్ వేలీ కుంభకోణంపై మళ్లీ విచారణ మొదలు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతంలో వుడా ఉన్నతస్థాయి అధికారులతో పాటు దిగువ స్థాయి ఉద్యోగులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమందిపై చర్యలు తీసుకున్నా కీలక సూత్రధారులు, పాత్రధారులూ తమ పలుకుబడి, ప్రాపకంతో తప్పించుకున్నారు. పరదేశిపాలెంలోని ఓజోన్ వేలీ సహా రుషికొండ, మధురవాడ, ఎంవీపీసెక్టార్–1,2,3, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, ఆదిభట్లనగర్, ఎండాడల్లోని పది లేఅవుట్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు 2010లోనే తేటతెల్లమైంది. వుడా తొలిసారిగా చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వ, జిరాయితీ, డి.పట్టా భూములను సేకరించారు. ఇందులో డి.పట్టా యజమానుల నుంచి సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అంతకుముందు రూరల్ ఎమ్మార్వోగా పనిచేసి వుడా ఎస్టేట్ అధికారిగా, కార్యదర్శిగా పనిచేసిన జగదీష్ ఈ కుంభకోణంలో కీలకపాత్రధారిగా గుర్తించారు. రూరల్ ఎమ్మార్వో పరిధిలో తనకున్న అనుభవాన్ని లేఅవుట్ల బాగోతంలో రంగరించినట్టు అప్పట్లో తేల్చారు. ల్యాండ్‌పూలింగ్ సంగతిని ముందుగా తెలుసుకున్న ఆయన డి.పట్టాదారులతో మంతనాలు సాగిం చి వారి నుంచి కొంతమంది బినామీల పేరిట జీపీఏ రాయించుకోవడం.. నిబంధనల ప్రకా రం ఎకరానికి 1200 బదులు 1500 గజాలు ఇచ్చేలా జీవో ఇప్పించడం.. కోరుకున్న చోట్ల ఈ జాగాను ఇప్పించడం.. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసేయడం.. ఈ వ్యవహారంలో సహకరించిన అప్పటి మున్సిపల్ మంత్రికి, 15 వేల గజాలకు బదులు 12 వేలిచ్చినట్టు ఆరోపణలు రావడం.. అందులో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. వీసీ విష్ణుపై అభియోగాలు.. ఈ అక్రమాలకు అప్పటి వీసీ వీఎన్ విష్ణు సహకారం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన తర్వాత వీసీగా వచ్చిన కోన శశిధర్ ఈ కుంభకోణం లోతుకెళ్లి విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై 2014లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ లేఅవుట్లలో అక్రమాలు నిజమేనని నిగ్గుతేల్చారు. ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనికి బాధ్యులైన నలుగురు వుడా ఉద్యోగులను, బినామీలను, మరికొందరు బాధ్యులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి కీలకపాత్రధారిగా భావిస్తున్న జగదీష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీసీగా పనిచేసిన విష్ణు తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయారు. ఇంకొందరు పదవీ విరమణ చేశారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులను వదిలేశారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్, విజిలెన్స్ జాయింట్ కమిషనర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ఏ జాయింట్ డైరెక్టర్ శారదాదేవి నేతృత్వంలో రెండ్రోజులు (గురు, శుక్రవారాలు) ఈ కమిటీ ఈ లేఅవుట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించింది. వివాదాస్పద లేఅవుట్లను త్వరలో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలనకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కమిటీ ప్రాథమిక పరిశీలనను ముగించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
విశాఖలో మరో అవినీతి చేప
-
ఏసీబీ వలలో ‘ఉడా’ ఏవో
-
ఏసీబీ వలలో ‘వుడా’ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ అవినీతి తిమింగలం ఏసిబి వలలో చిక్కింది.‘వుడా’లో అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్‌గా పనిచేస్తున్నపసుపర్తి ప్రదీప్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. దస్పల్లా హిల్స్‌లోని ఆయన నివాసం నటరాజ్ టవర్స్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 12చోట్ల హైదరాబాద్, అనంతపురం, ఒంగోలు, విశాఖ, విజయవాడల్లోని తండ్రి, కుమారుడు, మామగారు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సోదాలలో వెలుగు చూస్తున్న అక్రమ ఈ ఆస్తుల విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా. ప్రదీప్ కుమారుడి పేరుతో హెచ్ఎస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉన్నట్లు గుర్తించారు. -
వుడా కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
వుడా కార్యాలయంలో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్టణం : విశాఖపట్టణం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ(వుడా) కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో పెద్ద ఎత్తు మంటలు ఎగసి పై అంతస్తులకు వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో భవనం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. చాలాసేపటి నుంచి మంటలు అదుపులోకి రాకపోవడంతో, అధికారులు మరో రెండు అగ్రిమాపక యంత్రాలును పిలిపించే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఫైల్లు, ఆఫీస్ ఫర్నీచర్ తగలబడిపోయిందని అధికారులు భావిస్తున్నారు. -
మీదెంత.. మాదెంత?
♦ భూముల స్పష్టతపై వుడా, రెవెన్యూ తర్జనభర్జన ♦ 8 మండలాల్లో తేలని లెక్క ♦ అభివృద్ధికి పనికిరాని స్థలాల్ని త్యజించాలని వుడా నిర్ణయం విశాఖ నగర అభివృద్ధి సంస్థకు రెవెన్యూ భూముల బదలాయింపు వ్యవహారం తలకు మించిన భారంగా మారింది. రెవెన్యూ అప్పగించిన భూముల్లో వేల ఎకరాలు అభివృద్ధికిపనికిరానివే ఉండటంతో వాటిని త్యజించాలని భావిస్తోంది. మరోవైపు అప్పగించిన భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై ఇంకా ఎనిమిది మండలాలపై రెవెన్యూ శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. విశాఖసిటీ: వుడా పరిధి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల వరకూ విస్తరించి ఉంది. వుడాకు గతంలో 11,610.24 ఎకరాల భూములను రెవెన్యూ శాఖ అప్పగించాలని నిర్ణయించింది. వీటిని వివిధ రకాలుగా అభివృద్ధి చేసి వాటి ద్వారా కొత్త ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. స్టేట్ ఎలినేషన్ కమిటీ మాత్రం కేవలం 1,431 ఎకరాలకు మాత్రమే ఆమోదముద్ర వేసింది. మిగిలిన భూములన్నీ రెవెన్యూ పరిధిలోనే ఉండిపోయాయి. దీంతో వివిధ అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు వుడాకు తెలియకుండానే రెవెన్యూ శాఖ 4,214.12 ఎకరాలను ఇతర సంస్థలకు కట్టబెట్టింది. మిగిలిన భూముల్లో వుడా 2,132.72 ఎకరాల్ని వినియోగించుకుంది. 8 మండలాల్లో తేలని లెక్క చిక్కు ఇదిలా ఉండగా.. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించి 8 మండలాల్లో రెవెన్యూ శాఖ అప్పగించిన భూములు ఎక్కడెక్కడున్నాయన్న అంశంపై స్పష్టత రావడం లేదు. అటు రెవెన్యూ రికార్డుల్లోనూ, ఇటు వుడా రికార్డుల్లోనూ సర్వే పరంగా ఇబ్బందులు ఉన్నాయి. విశాఖ జిల్లా పరిధిలో అర్బన్, పెందుర్తి, గాజువాక మండలాల్లోనూ, విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం, విజయనగరం, కొత్తవలస, పూసపాటిరేగ మండలాల్లోనూ మొత్తం 519 ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వీటిని గుర్తించడంతో పాటు సంయుక్తంగా నిర్వహించాల్సిన 1383.80 ఎకరాల్లో వుడా సిబ్బందితో కలిసి సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ జి.సృజన ఇటీవల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ పూర్తయితే.. వుడా భూములపై స్పష్టత వచ్చే అవకాశముంది. రెండు వేల ఎకరాలకు నో భూముల రికార్డులు ట్యాంపరింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న వుడా భూముల్ని తీసుకోవాలంటూ ఇటీవల కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వుడా వీసీ బసంత్‌కుమార్‌కు సూచించారు. ఈ భూబదలాయింపు ప్రక్రియ అధికారికంగా సాగాలి. అంటే.. నిబంధనల ప్రకారం ఈ భూములన్నింటికీ నిర్ణీత రుసుం చెల్లించి రెవెన్యూ రికార్డుల నుంచి వుడా రికార్డులకు బదలాయింపు చేసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం.. తమకు చెందాల్సిన భూములకు దాదాపు రూ.1400 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు తమ ఆధీనంలో ఉన్న భూములు స్థితిగతులు, ఆక్రమణకు గురైన వాటి వివరాలు, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి ఉంది., కొండ ప్రాంతంలో ఎంత భూములున్నాయనే వివరాలపై వుడా ఎస్టేట్ విభాగం ఇప్పటి వరకూ 10,226.44 ఎకరాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం భూమిలో 3314.84 ఎకరాలను ఖాళీ స్థలాలుగా గుర్తించారు. ఇందులో 2313.31 ఎకరాల్లో కొండ ప్రాంతాలు, గుట్టలు, వాగులు, గెడ్డలు, పచ్చికబయళ్లు, రహదారులు, లోయలున్నాయి. ఇవి అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. బదలాయింపు ప్రక్రియలో ఈ 2,313.31 ఎకరాలకూ రెవెన్యూకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రెవెన్యూ శాఖ 4,214.12 ఎకరాల్ని ఇతర సంస్థలకు ఇప్పటికే కట్టబెట్టేసింది. అంటే మొత్తం దాదాపు 6,527.43 ఎకరాలు వుడాకి కానివే ఉన్నాయి. వీటిని బదలాయింపు ప్రక్రియ నుంచి మినహాయించాలని రెవెన్యూ శాఖను వుడా కోరింది. త్వరలోనే స్పష్టత వస్తుంది ఆరు బృందాలతో నిర్వహించిన సర్వే దాదాపు పూర్తయింది. రెవెన్యూతో కలిసి చేయాల్సింది త్వరలోనే పూర్తవుతుంది. అప్పుడే వుడా భూములపై స్పష్టత వస్తుంది. వుడాకు కేటాయించిన భూముల్లో కొంత మేర పలు ప్రభుత్వ శాఖలకు రెవెన్యూ శాఖ అప్పగించింది. వాటి బదులుగా కొన్ని భూముల్ని అప్పగించాలని వీసీ బసంత్‌కుమార్ సూచనల మేరకు రెవెన్యూ అధికారుల్ని కోరాం. అభివృద్ధికి పనికిరాని భూముల్ని బదలాయింపు నుంచి మినహాయించాలని సూచించాం. దీనిపై రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. – వసంతరాయుడు, వుడా ఎస్టేట్ అధికారి -
‘వుడా’కు 21.68 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా పెదగంట్యాడలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)కు 21.68 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ భూమి ఎకరం విలువ రూ.60 లక్షలుగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే నగరాభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని వుడాకు ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ మంగళవారం జీవో జారీ చేశారు. -
లాటరీ పద్ధతిలో 600 వుడా ప్లాట్లు
బీచ్‌రోడ్ : దాకమర్రి లేఅవుట్‌కు జరిగిన వేలం పాటను రద్దు చేసి లాటరీ ద్వారా స్థలాలు విక్రయం చేయాలని కోరుతూ వుడా వీసీకి బీజేపీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర మాట్లాడుతూ దాకమర్రి లేఅవుట్ వేలంపాటలో అమ్ముడయిన స్థలాల రేటు చూస్తే కళ్ళు తిరిగేటట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వుడా ఏర్పాటు ముఖ్య ఉద్దేశం పేద, మధ్య తరగతి నివాసం లేని వారికి స్థలాలు సరసమయిన ధరలకు అందించడమని తెలిపారు. గతంలో వుడా స్థలాలను లాటరీ పద్ధతిలో తక్కువ ధరకే అందించారు...అలాగే ఈ స్థలాలను కూడా లాటరీ ద్వారా విక్రయించాలని కోరారు. ఇందుకు వుడా వీసీ టి.బాబురావు నాయుడు బదులిస్తూ దాకమర్రిలో లేఅవుట్లు 24 క్యారట్ బంగారమని అభివర్ణిస్తూ...వాటికి ఆ ధర తక్కువేనని తెలిపారు. స్థలం రేటు, అభివద్ధి రేటు రెండూ మొత్తం రూ.10 వేలు కంటే ఎక్కువ అని... అందుకే వాటి ధర వేలంలో సరాసరి రూ. 14 వేలుకు వెళ్లిందని తెలిపారు. త్వరలో ఎల్ఐజీ, ఈబీజీ వారికి సుమారు 600 స్థలాలను లాటరీ పద్ధతిలో విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయం తీసుకుందని, త్వరలో విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు. వుడా సంస్థ విశాఖను అభివృద్ధి చేయాలి అంటే...ఆదాయం లేకుండా ఎలా అభివృద్ధి సాధ్యమని ప్రశ్నించారు. -
మాస్టర్ ప్లాన్.. ఫ్లాప్
మధురవాడ : జీవీఎంసీ, వుడా అధికారుల మధ్య సమన్వయ లోపం.. అధికార పార్టీ అనుచరగణం బంధు ప్రీతి.. అన్నీ కలపి ప్రజల పాలిటశాపంగా మారాయి. నగర శివారు 4,5 వార్డుల్లోని పలు వుడా మాస్టర్ ప్లాన్ రోడ్లు, నగరంపాలెం రోడ్డు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా తయారైతే.. రేవళ్లపాలెం రోడ్డు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక జాతీయ రహదారి–బక్కన్నపాలెం(సాయిప్రియా గార్డెన్) మధ్య నిర్మిస్తున్న 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డుకు చిప్పాడ దివీస్ లేబొరేటరీ కెమికల్ పరిశ్రమ యాజమాన్యం మోకాలడ్డుతోంది. నగరంపాలెం రోడ్డుకు మోక్షమెప్పుడో.. మధురవాడ జాతీయ రహదారి– నగరంపాలెం 80అడుగుల రోడ్డు అతీ గతీ లేకుండా పోయింది. ఈ పనులకు అధికార పార్టీనేతలు మోకాలడ్డుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో అప్పటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు పనులు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఉన్నాయి. జాతీయ రహదారి నుంచి నగరంపాలెం మీదుగా భీమిలి బీచ్‌రోడ్డు వరకు 4కిలో మీటర్లు మేర నిర్మాణం సాగే దీనికి రూ.4కోట్లు నిధులు మంజూరైనట్లు వుడా అధికారులే చెపుతున్నా... పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జీవీఎంసీ, వుడా అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తోంది. సాయిప్రియా గార్డెన్ రోడ్డుకు దివీస్ మోకాలడ్డు.. జాతీయ రహదారి–బక్కన్నపాలెం(సాయిప్రియా గార్డెన్) రోడ్డు నిర్మాణ పనులు రు.2కోట్లతో జరుగుతున్నాయి. రెండేళ్లు నుంచి 90శాతం పనులు పూర్తి చేశారు. కానిlఈ రోడ్డు జాతీయ రహదారిని కలిపే చోట చంద్రంపాలెం వద్ద బాపూజీ కళామందిరం వెనుక భీమిలి మండలం చిప్పాడలో ఉన్న దివీస్ లేబోరేటరీకి చెందిన సుమారు రెండు ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలం మధ్యలోంచి రోడ్డు వెళ్తున్న కారణంగా వారు ప్లాన్‌నే మార్చటానికి ఒత్తిడి చేస్తుండటంతో పనులు ముందుకు సాగడంలేదు. రేవళ్లపాలెం రోడ్డుది అదే పరిస్థితి.. ఇక రేవళ్లపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు అసంపూర్తిగా ఉన్న పనులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ఈ రోడ్డులో రేవళ్లపాలెం వద్ద నిర్వాసితులౌతున్న 33 మంది పునరావాసంపై అధికారలు తేల్చటం లేదు. మొదట్లో వీరికి నవోదయ వద్ద ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ సమీపంలో సర్వే నెంబరు 137లో 76సెంట్లులో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడకపోవటంతో సందిగ్దం నెలకొంది. -
వుడా స్థానంలో వీఎండీఎ
వచ్చే నెల నుంచి కార్యకలాపాలు 100 గజాల్లోపు ఆక్రమిత పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చే నెలలో రేషన్‌కార్డుల జారీ సకాలంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి జిల్లా అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష విశాఖపట్నం : వుడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (వీఎండీఎ) వచ్చే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనికి సీఎం చైర్మన్‌గా ఉండబోతున్నారు. ప్రతీ నెలా పెండింగ్ ప్రాజెక్టులను సీఎం స్వయంగా సమీక్షించనున్నారు. ప్రాజెక్టులనుసైతం నిర్ధేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో పెండింగ్ సమస్యలు..స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. వివరాలను మంత్రి అయ్యన్న మీడియాకు వివరించారు. వంద గజాల్లోపు స్థలంలో ఉంటున్న ఆక్రమిత నిరుపేదలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. స్వాతం త్ర వేడుకల సందర్భంగా 15న సీఎం అధికారికంగా ప్రకటిస్తారు. నగరంలో 80 వేల మంది వరకు ఉన్నట్టుగా అంచనా. అభ్యంతరాలు లేని ప్రాంతాలకు చెందిన 17వేలమందికి మాత్రమే తొలివిడత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు.అర్హులైన దరఖాస్తుదారులకు వచ్చే నెలలో రేషన్‌కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందుగా రేషన్‌కార్డులివ్వాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల కోసం వెయ్యిఎకరాల భూములవసరమవుతాయని..వాటిని నిర్ధేశిత కాలపరిమితిలో సేకరించాలని సూచించారు. విశాఖ-భీమిలి మధ్య నాలుగులైన్ల రహదారిని నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.సాగర తీరంలోస్విమ్మింగ్ జోన్స్ గుర్తించి అభివృది ్ధచేయాలని సూచించారు.లంబసింగ్, అల్లూరి సీతామరాజు సమాధి, అరకు ప్రాంతాలను యనిట్గా తీసుకుని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తారు. లంబసింగిలో బొటానికల్ గార్డెన్, రోజ్గార్డెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.విశాఖలో మెగా ఆడిటోరియం నిర్మించేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి, గాదె శ్రీనివాసుల నాయుడు, జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని, అర్బన్,రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టారు. మధ్యాహ్నం వరకు మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిలు సీఎం పర్యటనలో పాల్గొన్నప్పటికీ సమీక్షలో మాత్రం కన్పించలేదు. -
ఇక భూంఫట్!
- వుడా పరిధిలోకి పర్యాటక శాఖ - అస్మదీయులకు భూపందేరానికి మార్గం సుగమం - ఇక ప్రైవేటు గుప్పెట్లోకి ఎర్రకొండ, సీతకొండలు! ఇదీ ఉత్తర్వు పర్యాటక శాఖను వుడా పరిధిలోకి ప్రభుత్వం తీసుకువస్తూ ప్రభుత్వం జీవో 146ను మంగళవారం జారీ చేసింది. వుడా వీసీ ఇక నుంచి ప్రాంతీయ పర్యాటక కమిషనర్‌గా వ్యవహరిస్తారు. పర్యాటక శాఖలోని అధికారులు, సిబ్బంది నేరుగా ఆయన నియంత్రణలోకి వస్తారు. ప్రాజెక్టుల రూపకల్పన, అందుకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, డీపీఆర్‌లు రూపొందించడం, భూ కేటాయింపు అన్ని కూడా ఆయన పరిధిలోకి చేర్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాజు తలచుకుంటే... అన్న చందంగా మారింది విశాఖ నగరంలో ప్రభుత్వ భూపందేరం బాగోతం. పర్యాటకాభివృద్ధి ముసుగులో తమ అస్మదీయులకు భారీ భూ సంతర్పరణకు ప్రభుత్వం కార్యరంగాన్ని సిద్ధం చేసింది. నగరంలో ఎర్రకొండ, సీతకొండలతోసహా 2వేల ఎకరాలను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేసింది. పర్యాటక శాఖను ఏకంగా వుడా పరిధిలోకి తీసుకువచ్చింది. వుడా వీసీకి విశేష అధికారాలు కల్పిస్తూ పర్యాటక ప్రాజెక్టులపేరిట తమ అనుయాయులకు భూ పందేరానికి మార్గం సుగమం చేసింది. భూంఫట్!... ఇదీ పన్నాగం భారీ భూపందేరానికి మార్గం సుగమం చేయడానికే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది. పర్యాటక ప్రాజెక్టు పేరిట నగరంలో 1,854 ఎకరాలను తమ అస్మదీయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని ఎర్రకొండ(893 ఎకరాలు) , సీతకొండ(212 ఎకరాలు), పెద్దగంట్యాడలో నరవ(275 ఎకరాలు), నాగుపూర(446 ఎకరాలు), మధురవాడలో గుడ్లవానిపాలెం(28 ఎకరాలు) భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. అటవీ భూములుగా ఉన్నవాటిని డీనోటిఫై చేయాలని వుడా కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎర్రకొండ, సీతకొండలపై 1,105 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు రూపొందించాలని టెండర్లు పిలిచింది. కానీ ప్రభుత్వ భూములు, కొండలు వుడా పరిధిలో ఉన్నాయి. పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టుల బాధ్యత పర్యాటక శాఖ చూస్తుంది. వేర్వేరు అధికారిక వ్వవస్థల వల్ల తమ వారికి భూములు కట్టబెట్టడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిచింది. పర్యావరణ, సీఆర్‌జెడ్ చట్టాలు, వుడా మాస్టర్‌ప్లాన్ నిబంధనలను బేఖాతరు చేస్తుండటంతో ఏమైనాఅవరోధాలు తలెత్తవచ్చని కూడా సందేహించింది. ఒకే వ్యవస్థ ఉంటేఅనుకున్న విధంగా పనికానిచ్చేయొచ్చని యోచించింది. పర్యాటక శాఖను పూర్తిగా వుడా పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో ఎర్రకొండ, సీతకొండలతోసహా 1,850ఎకరాల ధారాదత్తానికి మరో అడుగు వేసింది. -
ఉద్యోగులకు వుడా ఇళ్లు
650 చ.అ విస్తీర్ణంలో ప్లాన్ వుడా ఆలోచన అధికారులతో సమీక్ష విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరంలో ప్రతీ ఒక్కరికి సొంతింటి కలను నిజం చేసేలా హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని వుడా నిర్ణయించింది. విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు అధ్యక్షతన సోమవారం వుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా అదనపు కమిషనర్ బిసి రమేష్, అపార్టుమెంట్ నిర్మాణ సంఘం ప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ ఉద్యోగులు, ఇతర మధ్య తరగతి వర్గాల స్తోమతకు తగ్గట్టుగా ఇళ్ల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. కనీసం 650 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించేలా గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడంపై చర్చించారు. నగరంలో ఏటా బిల్డర్ల ద్వారా జరుగుతున్న ఇళ్ల నిర్మాణం స్థాయిలో ప్రభుత్వ సంస్థల నుంచి గృహ నిర్మాణ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అనుమతుల ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంను నివారించాలని సమావేశం తీర్మానించింది. అవసరమైతే బ్యాంకుల ద్వారా ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సాయం పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు తయారు చేశారు. సొంతింటిని సమకూర్చుకోవడం కోసం ఉద్యోగులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఆర్థిక సాయం మంజూరయ్యేలా బ్యాంకుల నుంచి పనులు వేగంగా జరిగేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా నిర్ణయించారు. అపార్టుమెంట్ బిల్డర్ల సంఘం ప్రతినిధులంతా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉందని అధికారులు బిల్డర్లకు తేల్చిచెప్పారు. -
మరో రెండు సుందర గిరులు
వుడా చేతికి శీతకొండ, ఎర్రకొండ ఆ రెండింటిపై పర్యాటక హంగులు చిన్న పట్టణాల రోడ్లు విస్తరణ మీట్ ది ప్రెస్‌లో బాబూరావునాయుడు విశాఖపట్నం సిటీ : నగరంలోని శీతకొండ, ఎర్రకొండలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని వుడా వీసీ డాక్టర్ టి.బాబూరావు నాయుడు అన్నారు. వీజేఎఫ్ ఓ హోటల్లో గురువారం నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ విదేశీ సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరాభివృద్ధికి మలేషియా, అమెరికా వంటి దేశాలు సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమయాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయిస్తున్నట్టు వెల్లడించారు. వుడా చిల్డ్రన్స్ థియేటర్ పెండింగ్ పనులకు ఒకే టెండర్ దాఖలవడంతో ఆ కాంట్రాక్టు పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని కొత్త టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయో లేదో పరిశీలించే పనిని చేపట్టినట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల చిన్నచిన్న తప్పిదాలున్నట్టు గమనించామన్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సర్వే నంబర్‌తో రోడ్లు వెళ్లాలనేది ప్రజలందరికీ తెలిసేలా త్వరలోనే ప్రకటనలు జారీ చేస్తామని ప్రకటించారు. ప్రజలు గమనించి అందుకు తగ్గట్టుగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటారని చెప్పారు. వుడా కార్యాలయం ధనవంతులకే అన్న అపవాదు పోయేలా పేదలకు అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. త్వరలోనే పేదల కోసం మంచి ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. భూసంబంధ అంశాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారని గుర్తు చేశారు. విద్యా వంతులు సైతం లే అవుట్ల నిర్వాహకుల మాయలో పడి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు. అందుకే ప్రజలంద రికీ ఎల్పీలపై అవగాహన కలిగేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. వుడా పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తుని వంటి పట్టణాల్లో నగర రోడ్లను త్వరలో విస్తరిస్తామని ప్రకటించారు. ఆయా పట్టణాల్లో ఇరుకు రోడ్లే ఇప్పటికీ ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నాయని అందుకే మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు. వుడాలో గతంలో జరిగిన కుంభకోణాలన్నీ న్యాయ పరిధిలో ఉన్నందున వాటిపై తనను ప్రశ్నించవద్దని విలేకరులకు సూచించారు. కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావుతో పాటు కార్యవర్గం పాల్గొంది. -
అక్రమ లేఅవుట్
ఎట్టకేలకు దృష్టిసారించిన వుడా ఖాళీ ప్లాట్లను పొక్లయిన్లతో దున్నిస్తున్న అధికారులు జిల్లాలో 6 బృందాల ఏర్పాటు నర్సీపట్నం డివిజన్లో 218 ఎకరాలు గుర్తింపు అక్రమ లేఅవుట్లపై ఎట్టకేలకు వుడా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో వేసిన ప్లాట్లు, రోడ్లు, రాళ్లను పొక్లయిన్లతో తొలగిస్తోంది. దీనికోసం జిల్లాలో 6 బృందాలను నియమించింది. పాయకరావుపేట నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా, వారి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
వుడా జోరు
త్వరలో భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు శివారులో 300 ఎకరాల్లో నిర్మాణ ప్రణాళిక అక్రమాల అడ్డుకట్టకు ట్యాంపర్ప్రూఫ్ డాక్యుమెంట్లు కార్యాచరణకు ఉపక్రమించిన వుడా కొంతకాలంగా ఉదాసీనంగా ఉన్న వుడా మళ్లీ కార్యాచరణకు ఉపక్రమించింది. ద్విముఖ వ్యూహంతో కార్యరంగంలోకి దిగింది. ఓ వైపు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన... మరోవైపు వుడాలో సంస్కరణలకు తెరతీసింది. వుడా వీసీ బాబూరావునాయుడు ఈ కొత్త కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. విశాఖపట్నం: విశాఖ శివారులో ఓ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు వుడా ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తోంది. రో హౌసింగ్‌ను లీజుకు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది. మరోవైపు ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి సారించింది. భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్ల జారీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వుడా వేగవంతం చేసిన కార్యాచరణ ప్రణాళిక ఇలా ఉంది... భారీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు రూపకల్పన కొంతకాలంగా వుడా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. కొన్నేళ్లుగా వివాదాలు, కుంభకోణాలతో కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉంటూ వస్తోంది. కాగా రాష్ట్ర విభజన అనంతర నేపథ్యంలో ఓ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలని వుడా నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం రాష్ట్ర అవసరాల కోసం అటవీభూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ శివారులో డీనోటిఫై చేయనున్న భూముల్లో ఈ భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టాలన్నది వుడా ఉద్దేశం. శివారులోని దాదాపు 300 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇంకా ప్రాథమిక దశలోనే ఈ ప్రాజెక్టు విధివిధానాల గురించి వైస్ చైర్మన్ బాబూరావునాయుడు ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ట్యాంపర్ప్రూఫ్ డాక్యుమెంట్లు: భూ అక్రమాలకు రికార్డులు ఫోర్టరీ చేయడమేనని వుడా గుర్తించింది. ప్రధానంగా వుడా అనుమతులను ఇష్టానుసారంగా ట్యాంపర్ చేస్తూ భూ, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ విస్తీర్ణంలో లే అవుట్లు వేయడం, ఒకే అనుమతితో వేర్వేరు లే అవుటు వేయడం...ఇలా వివిధ రకాలుగా యథేచ్ఛగా అక్రమాలకు తెగిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు వుడా అనుమతులన్నీ త్వరలో ట్యాంపర్ఫ్రూఫ్ డాక్యుమెంట్లుగా జారీ చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోలోగ్రామ్‌తో ఈ డాక్యుమెంట్లను ఏమాత్రం ఫోర్జరీ చేయడంగానీ ఇతరత్రా అవకతవకలకుగానీ అవకాశం ఉండదు. వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక తవ్వకాల అనుమతి పత్రాలను ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అదే తరహాలో వుడా అనుమతిపత్రాలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. రో హౌసింగ్ లీజుకు.. రోహౌసింగ్లో మిగిలిపోయిన ప్లాట్లను లీజుకు ఇవ్వాలని వుడా నిర్ణయించింది. రో హౌసింగ్‌లో 88 యూనిట్లకు గతంలోనే 30 యూనిట్లు వేలంలో విక్రయించేశారు. ఇటీవల మిగిలిన యూనిట్లకు ఇటీవల వేలం నిర్వహించినప్పటికీ కేవలం మూడే అమ్ముడయ్యాయి. దాంతో ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను ఆ యూనిట్లను లీజుకు ఇవ్వాలని వుడా నిర్ణయించింది. బ్యాంకులు, పర్యాటక, ఐటీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు ఈ యూనిట్లను లీజుకు ఇవ్వాలన్నది వుడా ఉద్దేశం. తద్వారా మెరుగైన ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఇలా కొత్త ప్రాజెక్టులతోపాటు సంస్కరణలతో వుడా కార్యాచరణను వేగవంతం చేసింది. -
విశాఖను రాజధానిగా కోరడం సరికాదు
రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మరో వ్యాఖ్య చేశారు. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కోరడం సబబు కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, స్టీల్ ప్లాంటు లాంటివన్నీ ఉన్న తమ నగరాన్ని రాజధానిగా చేయాలని విశాఖ వాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆశలపై నారాయణ నీళ్లు చల్లారు. వుడా (విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)లో అవినీతి నిర్మూలనకు నెల రోజుల్లో చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తామని, వీటిలో ప్రతి 15 రోజులకు ఒకసారి అభివృద్ధిపై సమీక్షిస్తామని ఆయన అన్నారు. మునిసిపాలిటీ, వుడా అధికారులతో సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)