650 చ.అ విస్తీర్ణంలో ప్లాన్
వుడా ఆలోచన అధికారులతో సమీక్ష
విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరంలో ప్రతీ ఒక్కరికి సొంతింటి కలను నిజం చేసేలా హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని వుడా నిర్ణయించింది. విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు అధ్యక్షతన సోమవారం వుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా అదనపు కమిషనర్ బిసి రమేష్, అపార్టుమెంట్ నిర్మాణ సంఘం ప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ ఉద్యోగులు, ఇతర మధ్య తరగతి వర్గాల స్తోమతకు తగ్గట్టుగా ఇళ్ల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. కనీసం 650 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించేలా గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడంపై చర్చించారు. నగరంలో ఏటా బిల్డర్ల ద్వారా జరుగుతున్న ఇళ్ల నిర్మాణం స్థాయిలో ప్రభుత్వ సంస్థల నుంచి గృహ నిర్మాణ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అనుమతుల ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంను నివారించాలని సమావేశం తీర్మానించింది. అవసరమైతే బ్యాంకుల ద్వారా ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సాయం పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు తయారు చేశారు. సొంతింటిని సమకూర్చుకోవడం కోసం ఉద్యోగులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఆర్థిక సాయం మంజూరయ్యేలా బ్యాంకుల నుంచి పనులు వేగంగా జరిగేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా నిర్ణయించారు. అపార్టుమెంట్ బిల్డర్ల సంఘం ప్రతినిధులంతా ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉందని అధికారులు బిల్డర్లకు తేల్చిచెప్పారు.
ఉద్యోగులకు వుడా ఇళ్లు
Published Tue, May 5 2015 1:42 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
Advertisement