
సాక్షి, విశాఖపట్టణం : విశాఖపట్టణం అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ(వుడా) కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో పెద్ద ఎత్తు మంటలు ఎగసి పై అంతస్తులకు వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో భవనం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. చాలాసేపటి నుంచి మంటలు అదుపులోకి రాకపోవడంతో, అధికారులు మరో రెండు అగ్రిమాపక యంత్రాలును పిలిపించే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఫైల్లు, ఆఫీస్ ఫర్నీచర్ తగలబడిపోయిందని అధికారులు భావిస్తున్నారు.