రాజధానికి 25వేల ఎకరాలు అవసరం: నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మొత్తం 25 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని రాష్ట్ర మునిసపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. భూసేకరణకు తమ వద్ద రెండు ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన చెప్పారు. రాజధాని కోసం ప్రైవేటు భూమిని సేకరిస్తామని, అలా సేకరించి, అభివృద్ధి చేసిన భూమిలో భూ యజమానులకు కొంత వాటా ఇస్తామని అన్నారు. రాబోయే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా భూసేకరణ ఉంటుందని తెలిపారు.
శివరామకృష్ణన్ కమిటీ శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ కమిటీ కూడా రేపు సమావేశమవుతుందని మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణరంగ నిపుణులను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.