సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ కేటాయింపులు చేస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) పరిధిలోని కర్నూలు, అనంతపు రం జిల్లాలు రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర రాష్ట్రం లో కలుస్తున్నందున, ఈ రెండు జిల్లాలను సీపీడీసీఎల్ నుంచి తొలగించి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్)లో విలీనం చేస్తున్నారు. దీంతో విద్యుత్ కేటాయింపులో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ కోటా తగ్గి, ఎస్‌పీడీసీఎల్‌కు కోటా పెంచారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులు, రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చిన తరువాత కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
విద్యుత్‌సంస్థ పేరు ప్రస్తుతశాతం కొత్తశాతం
ఈపీడీసీఎల్ 15.80 15.80
ఎస్‌పీడీసీఎల్ 22.27 30.31
సీపీడీసీఎల్ 46.06 38.02
ఎన్‌పీడీసీఎల్ 15.87 15.87