సీమాంధ్రులంతా గెస్టు ఆర్టిస్టులే
హైదరాబాద్: సీమాంధ్రులు హైదరాబాద్లో ఉండేది తాత్కాలికమేనని, వారంతా గెస్టు ఆర్టిస్టులేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సచివాలయంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంపై మంత్రి స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య శుక్రవారం రాత్రి బారికేడ్లు వెలిశాయి. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
తెలంగాణలో రైతు రుణమాఫీపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని పోచారం అన్నారు. రెండుమూడు రోజుల్లో రుణమాఫీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.