Power Distribution
-
డిస్కంల నష్టాలు రూ.67,276 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థిక సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటేటా పేరుకుపోతున్న నష్టాలు కొండలాగా పెరిగి చివరకు డిస్కంలను దివాళా పట్టించేలా మారాయి. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్ / టీజీఎస్పీడీసీ ఎల్)లు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఏటేటా పెరిగిపోతున్న రెండు డిస్కంల ఆర్థిక నష్టాలు 2023–24 నాటికి రూ.67,276.07 కోట్లకు ఎగబాకాయి.రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఇటీవల రెండు డిస్కంలు సమర్పించిన 2025–26కి సంబంధించిన డిస్ట్రిబ్యూ షన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ ప్రతిపాదనలపై విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్ రావు లేవనెత్తిన పలు అభ్యంతరాలకు వివరణ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించాయి. నష్టాల్లో దక్షిణ తెలంగాణ డిస్కం టాప్దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో వినియోగదారులకు విద్యు త్ సరఫరా చేసే టీజీఎస్పీడీసీఎల్ 2023–24లో రూ.4,909. 53 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. సంస్థ మొత్తం నష్టాలు రూ.47,239.15 కోట్లకు ఎగబాకాయి. ఇక ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో విద్యుత్ సరఫరా చేసే టీజీఎన్పీడీసీఎల్ 2023–24లో రూ.1441.18 కోట్ల నష్టాల ను చవిచూడగా మొత్తం రూ.20,036.92 కోట్లకు పెరిగిపో యాయి. అంటే, రెండు డిస్కంలు కలిపి 2023–24లో రూ.6350.71 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏటేటా నష్టాలు ఇదే తీరులో కొనసాగితే మరో ఐదారేళ్లలో నష్టాల మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి.సర్కారు అదనపు సహాయం ఇస్తేనే..పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం కోసం విద్యుత్ కొనుగోళ్లకు అధిక వ్యయం చేయడంతోనే భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని రెండు డిస్కంలు స్పష్టం చేశాయి. అయితే, ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. వివిధ గ్రాంట్లు, పథకాల కింద ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తే నష్టాలను అధిగమిస్తామని టీజీఎన్పీడీసీఎల్ వివరించింది. -
ఎక్స్ఛేంజీల్లో ‘కరెంట్’పై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పవర్ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాల ట్రేడింగ్ జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో బుక్ చేసుకున్న 1,000 మెగావాట్ల కారిడార్‌ను వదులుకున్నందుకు రూ.261.31 కోట్ల చార్జీలను టీజీఎస్పీడీసీఎల్ చెల్లించడం లేదంటూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చేసిన ఫిర్యాదుతో ఈ మేరకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర విద్యుత్ శాఖ 2022 మార్చి 10న ప్రకటించిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్ కింద విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్ సంస్థలకు చెల్లింపులను ఇన్వాయిస్ల జారీ నుంచి 75 రోజుల్లోగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా బకాయిలను చెల్లించడంలో విఫలమైన దేశంలోని 16 డిస్కంలను బ్లాక్ లిస్టులో పెడుతూ ‘ప్రాప్తి’పోర్టల్‌లో గ్రిడ్ కంట్రోలర్ గురువారం ప్రకటన చేయగా, ఆ జాబితాలో టీజీఎస్పీడీసీఎల్ సైతం ఉండటం గమనార్హం. 2,000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసిన గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండటంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగో లు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేసుకోవడం కోసం అప్పట్లో పీజీసీఐఎల్ నిర్మిస్తున్న వార్ధా–డిచ్పల్లి 765/400 కేవీ కారిడార్‌లో ముందస్తుగా 2,000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకోవడానికి దర ఖాస్తు చేసుకుంది. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను 12 ఏళ్ల పాటు కొనుగోలు చేసుకునేందుకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ విద్యుత్ ధరలు అధికంగా ఉంటాయని విమర్శలు రావడంతో మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేసే ఆలోచనను విరమించుకుంది.ఈ నేపథ్యంలో 1000 మెగావాట్ల కారిడార్‌ను మాత్రమే కేటాయించాలని పీజీసీఐఎల్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో పీజీసీఐఎల్ ఆ కారిడార్ కేటాయింపులను రద్దు చేసింది. కారిడార్‌ను వదు లుకున్నందుకు రూ.261.31 కోట్ల రిలింక్వి‹Ùమెంట్ చార్జీలను చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్కు డిమాండ్ నోటీసులు చేసింది. టీజీఎస్పీడీసీఎల్ ఈ చార్జీల ను చెల్లించకపోవడంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సీఈఆర్సీని ఆశ్రయించింది. టీజీఎస్పీడీసీఎల్ తర హాలోనే దేశంలో కారిడార్ వదులుకున్న మిగిలిన అన్ని డిస్కంల వివరాలను సమరి్పంచాలని పీజీసీఐఎల్‌ను అప్పట్లో సీఈఆర్సీ ఆదేశించింది.ఈ వివరాలేవీ అందించకుండా పీజీసీఐఎల్ రూ.261.31 కోట్ల చార్జీలను ఎలా లెక్కించిందని టీజీఎస్పీడీసీఎల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు టీజీఎస్పీడీసీఎల్ డిపాజిట్ చేసిన రూ.కోటి బ్యాంకు గ్యారంటీని పీజీసీఐఎల్ ఏకపక్షంగా జప్తు చేసుకుంది. చార్జీలు అడగకుండా పీజీసీఐఎల్‌ను నిలువరించాలని కోరుతూ 2021 జూన్ 25న సీఈఆర్సీని టీజీఎస్పీడీసీఎల్ సంప్రదించగా, కేసు విచారణ తుది దశకు చేరింది. కేసు పెండింగ్‌లో ఉండగానే టీజీఎస్పీడీసీఎల్ను బ్లాక్ లిస్టులో పెట్టడం గమనార్హం. -
ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పవర్ ‘ఫుల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందనుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఆయన వర్చువల్ విధానంలో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లుఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ అండ్ సీఈఓ ఎం.కమలాకర్ బాబు, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శువేందు గుప్తా ఒప్పంద పత్రాలను అందుకున్నారు. వీటన్నింటి వల్ల రానున్న రోజుల్లో వేగంగా అడుగులు ముందుకు పడి మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. సరికొత్త అడుగులు.. నాణ్యమైన వెలుగులు ► 19 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతూ రూ.620 కోట్లతో 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. రూ.2,479 కోట్లతో మరో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా సుమారు రూ.3,099 కోట్ల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతోంది. కొత్తగా వస్తున్న ఈ 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. మరోవైపు రూ.3,400 కోట్లతో దాదాపు 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. వీటి వల్ల 1,700 ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిన్నింటి కోసం దాదాపు రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ►ఇటీవల గోదావరి ముంపునకు గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో తిరిగినప్పుడు సబ్స్టేషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ వాటి నిర్మాణాలు ప్రారంభిస్తూ, నిర్మించిన వాటిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ► ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఇది చేయాలంటే కెపాసిటీ సరిపోదని, ట్రాన్స్మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేయాలని అధికారులు చెప్పారు. అందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూటే ఇస్తున్నాం. 25 ఏళ్లపాటు ఢోకా ఉండదు ► రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే, మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం యూనిట్ సగటు ధర రూ.5.30 పడే పరిస్థితులుంటే రూ.2.49కే యూనిట్ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాం. దీనివల్ల 2024 సెప్టెంబర్‌కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ► అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ ఇప్పటికే 25 వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీనికి సంబంధించి రూ.100 కోట్లతో విస్తరణ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనంగా మరో 200 ఉద్యోగాలు వస్తాయి. ► 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి రూ.10 వేల కోట్లకు సంబంధించి హెచ్పీసీఎల్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీనివల్ల దాదాపు మరో 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చి, రాష్ట్ర ప్రగతిని మరింత పెంచే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ కెఎస్జవహర్రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, హెచ్‌పీసీఎల్ డైరెక్టర్ అమిత్ గార్గ్, హెచ్‌పీసీఎల్, ఆయానా, స్ప్రింగ్ అగ్నిత్రా, సోలార్ ఎనర్జీ ఏపీ సిక్స్ ప్రై వేట్ లిమిటెడ్, అవేరా ఏఐ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాం. అక్టోబర్ ఆఖరు వరకు 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) రూ.46,581 కోట్ల సబ్సిడీ అందించాం. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ ఏడాది అదనంగా నిర్ణీత కాలపరిమితిలో మంజూరు చేశాం. వ్యవసాయ విద్యుత్ కోసం ‘సెకీ’తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. స్మార్ట్ మీటర్స్ వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ.52,015 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 12,586 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. సీఎం చిత్తశుద్ధితోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ మంత్రి -
విద్యుత్ రంగ చరిత్రలో ఇదే తొలిసారి
-
విద్యుత్తుపై ఎల్లో ఏడుపులు
-
విశ్వనగరంలో వెలుగు రేఖలు
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్) :ఏదైనా ఒక రాష్ట్రం, ప్రాంతం ఆర్థిక స్థితిని అంచనా వేయడంలో విద్యుత్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. విశ్వ నగరంగా మారిన విశాఖ ఆర్థిక రాజధానిగా బలంగా ఎదిగేలా విద్యుత్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మాల్స్, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా విశాఖలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగని విధంగా భూగర్భం నుంచి కేబుళ్ల ద్వారా విద్యుత్ పంపిణీ కానుంది. పారిశ్రామికవేత్తలు, పర్యాటకులను ఆకర్షించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖలో సిద్ధమవుతున్న ఆధునిక విద్యుత్ వ్యవస్థపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.. తుపాన్లకు తల వంచదు.. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చి విశాఖలో స్థిరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాలను అందిపుచ్చుకుంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సాగర నగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు కూడా మొదలయ్యాయి. తుపాన్లు లాంటి విపత్తుల సమయంలోనూ విశాఖ నగరం అంతటా విద్యుత్ వెలుగులకు ఆటంకం కలుగకుండా రూ.925 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.481.49 కోట్ల ఖర్చుతో 80,529 విద్యుత్ కనెక్షన్లను భూగర్భ విద్యుత్ వ్యవస్థలోకి తెచ్చారు. నగరం మొత్తం 2,449 కి.మీ. పొడవున అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయనున్నారు. సముద్రాన్ని ఆనుకుని ఉన్న నగరం కావడంతో తుపాన్లు వచ్చినపుడు విద్యుత్ స్థంభాలు దెబ్బతింటున్నాయి. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా పాత స్థంభాల స్థానంలో సెంట్రిఫ్యూగల్లీ కాస్ట్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ స్థంభాలు (స్పన్‌పోల్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3,266 స్పన్‌పోల్స్ ఏర్పాటు కాగా అందుకోసం రూ.15.36 కోట్లను వెచ్చించారు. నష్టాల తగ్గింపు, ఆధునీకరణ పనులను సుమారు రూ.1,722.02 కోట్లతో చేపట్టారు. ఇందులో భాగంగా 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 16 నిర్మించనున్నారు. గత మూడు నెలల్లో 421 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 30 శాతం పెరిగిన వినియోగం మొత్తం 1,647 చ.కిలోమీటర్లు విస్తరించిన విశాఖలో 22,80,457 జనాభా ఉంది. వీరికి సరిపడా విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. దాదాపు 8,32,377 గృహ, 1,06,006 వాణిజ్య, 1,803 పారిశ్రామిక, 10,909 ప్రభుత్వ, స్థానిక సంస్థలు, 1,179 హెచ్‌టీ, 5,215 వ్యవసాయ కనెక్షన్లకు విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ విద్యుత్‌ను అందిస్తోంది. ఇంత భారీగా జరుగుతున్న విద్యుత్ సరఫరాలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా 1,281 విద్యుత్ సరఫరా నియంత్రికలు (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు) అమర్చారు. మరో 4,955 డీటీఆర్లను సుమారు రూ.514.688 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. 316.64 సర్క్యూట్ కిలోమీటర్ల మేర లైన్లు మార్చుతున్నారు. ఈ చర్యల ఫలితంగా వేసవిలోనూ విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరుగుతోంది. గతంలో సరాసరి రోజుకు 11 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదు కాగా ఇప్పుడు 16.495 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 30 శాతం పెరిగింది. పూర్తి భద్రత.. విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా విశాఖ సర్కిల్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగా సర్క్యూట్ బ్రేకర్లను అమర్చుతున్నారు. ఇవి విద్యుత్ వైర్లు తెగి కింద పడినప్పుడు ఫీడర్ ట్రిప్ అయ్యేలా చేసి సరఫరాను నిలిపివేస్తాయి. సబ్ స్టేషన్లో అలారం మోగించడం ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఏ ప్రాంతంలో వైరు తెగిందో కచ్చితంగా చూపిస్తాయి. లో ఓల్టేజ్, హై ఓల్టేజ్‌ను అంచనా వేస్తాయి. దీనివల్ల గృహోపకరణాలు కాలిపోవడం, అగ్ని ప్రమాదాలు లాంటి వాటిని అరికట్టవచ్చు. విశాఖ రహదారులపై నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇనుప రక్షణ కంచెలతో పాటు షాక్ కొట్టని పోలీప్రొపిలిన్ వలలను ప్రయోగాత్మకంగా రక్షణ కోసం వాడుతున్నారు. రహదారుల మీదుగా వెళ్లే వైర్లకు కింద ఈ వల ఉంటుంది. వైరు తెగినా వలలోనే పడుతుంది. విద్యుత్ సిద్ధం: విద్యుత్ పరంగా విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ వినియోగం చాలా ఎక్కువ. పోర్టు, నేవీ, రైల్వే, ఆస్పత్రులు లాంటి భారీ వ్యవస్థలకు అనుబంధంగా ఉండే విభాగాలకు విద్యుత్ సరఫరా అందించాలి. విశాఖ, అరకు, పాడేరు లాంటి పర్యాటక ప్రాంతాలు, సింహాచలం, శ్రీకాకుళం లాంటి పుణ్య క్షేత్రాలకు నిత్యం పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. నగరానికి భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, కార్యాలయాలు వస్తున్నాయి. వాటికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా అన్ని సబ్స్టేషన్లను భవిష్యత్ అవసరాలకు సరిపడా సిద్ధం చేశాం. మేజర్ సిటీ ఏరియా అంతా అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టుతో కవర్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో నగరం మొత్తం అండర్ గ్రౌండ్ కేబులింగ్ జరుగుతుంది. వినియోగం ఎంత పెరిగినా విద్యుత్ మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. – ఎల్.మహేంద్రనాథ్, పర్యవేక్షక ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్, విశాఖ సర్కిల్. -
ముదిరిన వివాదం.. తెలంగాణకు ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా పూర్తిగా బంద్ అయింది. ప్రస్తుత (2022–23) ఆర్థిక సంత్సరంలో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ఛత్తీస్‌గఢ్ సరఫరా చేయలేదు. ధరతోపాటు బకాయిలను ఛత్తీస్‌గఢ్ భారీగా పెంచేయగా, తెలంగాణ డిస్కంలు అంగీకరించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేస్తున్న విజ్ఞప్తులను ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీఎస్పీడీసీఎల్) నిరాకరిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టంచేసింది. తెలంగాణ డిస్కంలు, సీఎస్పీడీసీఎల్ మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. 2020–21లో 39.67శాతం, 2021–22లో కేవలం 1,631 మిలియన్ యూనిట్ల (19శాతం) విద్యుత్ మాత్రమే ఛత్తీస్‌గఢ్ సరఫరా చేసింది. 2022–23లో పూర్తిగా నిలిపేసింది. తాజాగా ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు.. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి నివేదించాయి. ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు సద్దుమణిగితే 2022–23 రెండో అర్ధ వార్షికంలో 2,713 ఎంయూల (31%) విద్యుత్ సరఫరా జరగొచ్చని అంచనా వేస్తున్నామన్నాయి. భారీగా పెంచేసిన ఛత్తీస్‌గఢ్ 2022 జూన్ 3 నాటికి బకాయిపడిన రూ.3,576.89 కోట్లను చెల్లిస్తేనే ఒప్పందం మేరకు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని 2022 సెప్టెంబర్ 23న ఛత్తీస్‌గఢ్ ఇన్వాయిస్ పంపింది. అయితే, రూ.2,100 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని అప్పట్లో తెలంగాణ డిస్కంలు బదులిచ్చాయి. తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్ విద్యుత్‌కు రూ.3.90 మాత్రమే చెల్లిస్తామన్నాయి. అయితే, ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం ఆధారంగా ధర చెల్లించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఉత్తర్వులతోపాటు పీపీఏ తుది అనుమతులను సవాల్ చేస్తూ.. తెలంగాణ డిస్కంలు 2018లో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్)లో కేసు వేశాయి. ఎంవోయూ ఆధారంగా ఒప్పందం! ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు, సీఎస్పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్ 22న ఒప్పందం (పీపీఏ) జరిగింది. టెండర్లకు బదులుగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్ 3న జరిగిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఆధారంగా ఈ పీపీఏ జరిగింది. నాడు చౌకగా వస్తుందని.. నేడేమో నష్టమని.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో రూ.12వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లో విద్యుత్ రంగ నిపుణులు రఘు ఈఆర్సీకి వివరించారు. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీని కోరింది. తాజాగా ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో మాత్రం రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతోందని తెలంగాణ డిస్కంలు అంగీకరించడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో జరగనున్న నష్టంపై నాటి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ టీఎస్ఈఆర్సీకి 2016 డిసెంబర్లో లేఖ సైతం రాశారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీవేటు వేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పంపింది. ఛత్తీస్‌గఢ్ పీపీఏను కొన్ని మార్పులతో అనుమతిస్తూ టీఎస్ఈఆర్సీ 2017 మార్చి 31న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. డిస్కంలకు భారీగా నష్టం వివాదాల్లో ఉన్న బకాయిలను అప్టెల్ తీర్పునకు లోబడి చెల్లిస్తామని, వివాదాల్లేని బకాయిలను.. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం చెల్లిస్తామని డిస్కంలు ఛత్తీస్‌గఢ్‌కు తెలిపాయి. అయినా ఛత్తీస్‌గఢ్ అంగీకరించడం లేదు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నామని డిస్కంలు ఈఆర్సీకిచ్చిన వివరణలో పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను తెచ్చేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్)కు చెందిన వార్ధా–డిచ్పల్లి–మహేశ్వరం ట్రాన్స్మిషన్ లైన్లో 1000 మెగావాట్ల కారిడార్‌ను 12 ఏళ్ల కోసం తెలంగాణ డిస్కంలు బుక్ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ రాకపోయినా పీజీసీఎల్‌కు ట్రాన్స్మిషన్ చార్జీల (ఏటా రూ.400 కోట్లకు పైగా)ను చెల్లించి నష్టపోతున్నామని ఈఆర్సీకి తెలిపాయి. -
ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: సంప్రదాయ విద్యుత్ మీటర్ల స్థానంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌ను ఏపీలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలతో మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్, కచ్చితమైన విద్యుత్ బిల్లులు, ఉత్తమ సేవలు అందుతాయని మంత్రి వెల్లడించారు. విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరగడంతో పాటు సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. బ్రిటన్, కేంద్ర అధికారుల భేటీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గేరేత్ విన్ ఓవెన్, బ్రిటిష్ హై కమిషన్ ఇంధన సలహాదారు సుష్మిత రామోజీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఇంధన శాఖ అధికారులను రెండు రోజుల క్రితం కలిసి ఏపీలో చేపట్టనున్న స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుపై చర్చించారని మంత్రికి వివరించారు. ఈ మీటర్లు ఇంటర్నెట్కు అనుసంధానించడం వల్ల విద్యుత్ వినియోగ వివరాలు డిస్కంలకే గాక వినియోగదారులకు కూడా ఏరోజుకారోజు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ చౌర్యం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, వోల్టేజీ హెచ్చుతగ్గులను స్మార్ట్ మీటర్ రికార్డు చేస్తుందని వివరించారు. కాగా, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 5 సర్కిళ్లలో స్మార్ట్ మీటర్ ప్రాజెక్టు అమలుకు రూ.947.15 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించినట్టు డిస్కం సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి, ఏపీ ఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్సిడీ 36,890 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ.36,890 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు విద్యుత్ సరఫరా చేసేవారు. రాష్ట్రం ఏర్పడిన ఆర్నెల్లలోనే రైతులకు 9 గంటల కరెంటును సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారు. రైతుల కరెంట్ కష్టాలను తీర్చడానికి 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 7.93 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేయడంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 26.96 లక్షలకు పెరిగింది. రాష్ట్ర విద్యుత్ రంగం సాధించిన ప్రగతిపై ఆదివారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో ప్రభుత్వం ఈ విషయాలను వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ పటిష్టం రాష్ట్రంలో నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి గత 8 ఏళ్లలో ప్రభుత్వం రూ.37,099 కోట్లను ఖర్చు చేసింది. ట్రాన్స్మిషన్ వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్రంలో కొత్తగా 400–17200 కేవీ సబ్స్టేషన్లు 48, 132కేవీ సబ్స్టేషన్లు 72, ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు 137 నెలకొల్పడంతోపాటు ఈహెచ్‌టీ లైన్‌ను 11,107 సర్క్యూట్ కి.మీ మేర ఏర్పాటుచేసింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి డిస్కంలు 33/11 కేవీ సబ్స్టేషన్లు 1038, 3.65 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాయి. దీంతో గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,160 మెగావాట్లకు పెరిగినా విజయవంతంగా సరఫరా చేయగలిగారు. గతంలో పవర్ హాలిడేలతో మూతబడే పరిస్థితికి చేరిన పరిశ్రమలు ఇప్పుడు 24 గంటల విద్యుత్‌తో నిరంతరంగా పనిచేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1,110 యూనిట్లు ఉంటే 2021 నాటికి 2,012 యూనిట్లకు చేరింది. జాతీయ సగటుతో పోల్చితే 73శాతం అధికంగా ఉండటం రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. దేశంలో అతి తక్కువగా 2.47శాతం ట్రాన్స్మిషన్ నష్టాలు, 99.98 శాతం ట్రాన్స్మిషన్ వ్యవస్థ లభ్యతతో తెలంగాణ ట్రాన్స్‌కో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06 శాతం ఉన్న విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ) ఇప్పుడు 11.01శాతానికి తగ్గింది. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 73 మెగావాట్ల నుంచి 4,950 మెగావాట్లకు పెరిగింది. బడుగులకూ ఉచిత విద్యుత్ రాష్ట్రంలో 5,96,642 ఎస్సీ, 3,21,736 ఎస్టీ గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 2017 నుంచి ఇప్పటివరకు రూ.656 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 29,365 సెలూన్లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. 6,667 పౌల్ట్రీ యూనిట్లు, 491 పవర్‌లూమ్స్‌కు యూనిట్‌కి రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. -
ఏపీలో సబ్స్టేషన్లు సరికొత్తగా..
సాక్షి, అమరావతి : విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానాలకు ఏపీ డిస్కంలు శ్రీకారం చుడుతున్నాయి. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో స్మార్ట్, కంటైనర్, ఇండోర్, ఎయిర్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నాయి. కొన్నిచోట్ల షిష్ట్ ఆపరేటర్లు, సిబ్బంది లేకుండానే ఆన్లైన్లో కంట్రోల్ రూమ్ ద్వారా వాటి నిర్వహణ చేపట్టనున్నాయి. ఇందుకోసం సాధారణంగా వినియోగించే భూమితో పోలిస్తే పది శాతం నుంచి మూడో వంతు భూమిలోనే వీటిని ఏర్పాటుచేస్తున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో.. ఉద్యోగుల అవసరంలేకుండా గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా చేసేలా స్మార్ట్ సబ్స్టేషన్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. విశాఖలోని ఆనందపురం మండలం గిడిజాల వద్ద ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను రూ.50 లక్షల అంచనా వ్యయంతో పూర్తిస్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో విద్యుత్ సిబ్బంది, షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం ఉండదు. విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు వంటి సమాచారమంతా ఆన్లైన్ ద్వారా పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. దాని నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలుగుతుంది. ఈ ప్రయోగాన్ని పరిశీలించి డిస్కం పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చాలనుకుంటున్నామని సంస్థ సీఎండీ కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. స్తంభాల్లేకుండా తక్కువ జాగాలో.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) తిరుపతిలో రెండు కంటైనర్ సబ్స్టేషన్లను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో స్తంభాల్లేకుండా ఇటువంటి సబ్స్టేషన్లను నిర్మించడంవల్ల విద్యుత్ ప్రమాదాలను అరికట్టవచ్చని సంస్థ సీఎండీ హెచ్. హరనాథరావు అంటున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) 16 ఇన్డోర్ సబ్స్టేషన్లను నిర్మిస్తోంది. వీటికోసం రూ.68.12 కోట్లు ఖర్చుచేయనున్నట్లు సంస్థ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి చెప్పారు. అంతేకాక.. తొలిసారిగా కంటైనర్ సబ్‌స్టేషన్‌ను రూ.5.5 కోట్ల వ్యయంతో విజయవాడ శివారులోని గొల్లపూడిలో నిర్మిస్తోంది.. సాధారణ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిలో కేవలం పది శాతం భూమిలోనే వీటిని నిర్మించవచ్చు. జగనన్న కాలనీల్లో ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లను నిర్మిస్తోంది. దీనికి రూ.6.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సాధారణ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సరిపడే భూమితో పోలిస్తే మూడో వంతు భూమి ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సరిపోతుంది. -
‘సర్దుబాటు’ పాపం గత సర్కారుదే
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థల బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల వాటిపై అదనపు ఖర్చుల భారం భారీగా పెరిగింది. ఐదేళ్లలో విద్యుత్ రంగం అప్పులు రెట్టింపై రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పొదుపు చర్యలు, విద్యుత్తు కొనుగోళ్లలో ఆదా ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే గత సర్కారు నిర్వాకాల కారణంగా జరిగిన అప్పుల నుంచి బయటపడేందుకు ‘సర్దుబాటు’ చేసుకోక తప్పని పరిస్థితి డిస్కంలకు ఏర్పడింది. కానీ అవి నివేదించిన వ్యయంలో దాదాపు సగానికి మాత్రమే అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ప్రజలపై పెనుభారం పడరాదని.. 2014 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య కాలానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలను వాస్తవ ఖర్చుల ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం చేయలేదు. దీంతో రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లు ఏపీఈఆర్సీని కోరాయి. నిజానికి ఇదేమీ వాటి వాస్తవ ఖర్చు కాదు. రెండు డిస్కంల వాస్తవ ఖర్చు రూ.25,952 కోట్లుగా ఉన్నప్పటికీ అవి రూ.7,224 కోట్లు మాత్రమే అడిగాయి. అయితే అంత మొత్తాన్ని అనుమతిస్తే ప్రజలపై ఒకేసారి భారం పడుతుందనే ఉద్దేశంతో ఏపీఈఆర్సీ అందులో సగం మొత్తాన్ని తిరస్కరించింది. పీఆర్సీ, వడ్డీలు, ఇతర ఖర్చులు.. డిస్కంల వినతిపై కొద్ది నెలలుగా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఆడిట్ పద్దుల ఆధారంగా డిస్కంలు కోరిన దానిలో దాదాపు సగం అంటే రూ.3,669 కోట్లు వసూలుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ఈ మొత్తంలో రూ.3,100 కోట్లు పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) వల్ల అదనపు ఖర్చులు కాగా వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.569 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం అదనపు వ్యయాన్ని సెప్టెంబర్ విద్యుత్ బిల్లు నుంచి ప్రారంభించి ఎనిమిది నెలల పాటు ఏపీఈపీడీసీఎల్‌లో యూనిట్‌కు 45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్‌కు రూ.1.27 చొప్పున ట్రూఅప్ పేరిట సర్దుబాటు చేయనున్నారు. 2019 ఏప్రిల్ 1 తరువాత కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ట్రూ అప్ వర్తించదు ఐదేళ్లలో సర్దుబాటు చేయకపోవడంతో... ‘సర్దుబాటు వ్యయం అనేది ఏటా జరగాలి. ఎప్పటికప్పుడు జరిగితే ప్రజలపై పడే భారం చాలా తక్కువ. కానీ 2014 నుంచి 2019 వరకూ అలా జరగకపోవడంతో డిస్కంల అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికైనా సర్దుబాటు చేయకపోతే వాటి మనుగడ కష్టమవుతుంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా రూ.913 కోట్ల అదనపు సర్దుబాటు వ్యయాన్ని అప్పటి సబ్సిడీ విధానాల ప్రకారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి రూ.27,240 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. అంటే రెండున్నరేళ్లలో కేవలం రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి పెరిగాయి. -
విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.2,342 కోట్లకుపైగా ఆదా చేసిందని నీతి ఆయోగ్, ఆర్ఎంఐ సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవడం, సాంకేతికత ద్వారా మార్కెట్లో విద్యుత్తు ధరలను నిశితంగా గమనిస్తూ చౌక కరెంట్‌ను ఎక్కువగా కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదా చేయగలిగింది. తద్వారా ప్రజలపై భారం పడకుండా నివారించగలిగింది. ‘నష్టాల నుంచి పురోగమన బాటలో విద్యుత్తు పంపిణీ రంగం’ పేరుతో రూపొందించిన నివేదికను నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, ఆర్ఎంఐ ఇండియా ప్రిన్సిపల్ అక్షిమా ఘాటే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► డిస్కమ్‌లు చేసే మొత్తం వ్యయంలో 80 శాతం విద్యుత్తు సేకరణపైనే ఉంటుంది. విద్యుత్తు డిమాండ్‌పై తప్పుడు అంచనాలతో డిస్కమ్‌లు ఖరీదైన, దీర్ఘకాలిక థర్మల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. విద్యుదుత్పత్తి చేయనప్పుడు కూడా అదనపు సామర్థ్యానికి సంబంధించి ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సి రావడం అదనపు వ్యయానికి దారి తీస్తోంది. ఫలితంగా మౌలిక వసతులపై పెట్టుబడులు తగ్గిపోయి ఉత్పత్తి సంస్థలకు చెల్లింపుల్లో జాప్యానికి కారణమవుతోంది. ► 12 రాష్ట్రాలలో అధ్యయనం నిర్వహించగా మిగులు విద్యుత్తుపై ఏటా రూ.17,442 కోట్ల మేర ఫిక్స్డ్ వ్యయాన్ని చెల్లిస్తున్నట్లు తేలింది. మార్కెట్‌ను సరిగా వినియోగించుకోవడం విద్యుత్తు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఒక కీలక మార్గం. విద్యుత్తు ఎక్సే్ఛంజీల ద్వారా విద్యుత్తు వర్తకంలో వార్షిక వృద్ధి రేటు 23 శాతంగా నమోదైంది. ► సంప్రదాయ దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు బదులుగా స్వల్పకాలిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నట్లు రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్(ఆర్టీఎం) సూచికల్లో కనిపిస్తున్న వృద్ధి స్పష్టం చేస్తోంది. విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం రూపుదాల్చుతోంది. మార్కెట్ బేస్డ్ ఎకనమిక్ డిస్పాచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ (ఎంబీఈడీ) అనే నూతన విధానంలో స్థిర దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా జరిగే అమ్మకాలు, కొనుగోళ్లు సహా అన్ని విద్యుత్తు లావాదేవీలను విద్యుత్తు ఎక్సే్ఛంజీలకు మళ్లించనున్నారు. ఫిక్స్డ్ కాస్ట్ చెల్లింపు కొనసాగినప్పటికీ వేరియబుల్ కాస్ట్ తగ్గుతుంది. భవిష్యత్తులో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. ► విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ రూ.2,342 కోట్ల మేర ఆదా చేసింది. 2019–21 మధ్య రెండేళ్లలో విద్యుత్తు కొనుగోళ్లలో అనుకూల విధానాల ద్వారా ఇది సాధ్యమైంది. బహిరంగ మార్కెట్లలో విద్యుత్తు కొనుగోలు చేయడం కూడా ఇందులో భాగం. పలు రాష్ట్రాలు సబ్సిడీలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్నాయి. దీనివల్ల విద్యుత్తు లీకేజీ, డిస్కమ్‌లకు నష్టాలు వాటిల్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ నష్టాలను నివారించేందుకు వ్యవసాయానికి ప్రత్యేకంగా విద్యుత్తు ఫీడర్లను అమర్చాయి. వ్యవసాయానికి సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తూ డిస్కమ్‌లు సేకరణ వ్యయాన్ని తగ్గించుకున్నాయి. ► దీర్ఘకాలిక, ఖరీదైన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుని డిస్కమ్‌లు ఇరుక్కుపోయాయి. తక్కువ వ్యయంతో విద్యుత్తు మార్కెట్లో లభ్యమైనంత కాలం డిస్కమ్‌లు కొత్తగా ఖరీదైన దీర్ఘకాలిక పీపీఏలను కుదుర్చుకోరాదు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలు 2022 వరకు కొత్త థర్మల్ పీపీఏలను నిషేధించాయి. సాధ్యమైన చోట డిస్కమ్‌లు ఖరీదైన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల నుంచి వైదొలగవచ్చు. పంపిణీ రంగం కీలకం.. ‘వ్యాపారాన్ని సులభతరం చేయడం, జీవిత సౌలభ్యాన్ని మెరుగుపరచేందుకు సమర్థవంతమైన పంపిణీ రంగం అవసరం. విద్యుత్తు పంపిణీ, సేకరణ, పర్యవేక్షణ, పునరుత్పాదక ఇంధన శక్తి సమీకృతం, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ తదితర అంశాల్లో ప్రైవేట్ రంగాల పాత్ర లాంటి వాటిని ఈ నివేదిక విశ్లేషించింది’ – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ నష్టాల అంచనా రూ.90 వేల కోట్లు ‘దేశంలో చాలా డిస్కమ్‌ల నష్టాలు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్లు వరకు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. సంచిత నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కమ్‌లు సకాలంలో బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. పంపిణీ రంగాన్ని సమర్థ, లాభదాయక బాట పట్టించడం, సంస్కరణల ఎంపికలో నివేదిక ఉపకరిస్తుంది’ – వీకే సారస్వత్, నీతి ఆయోగ్ సభ్యుడు దీర్ఘకాలిక విధానాలు అవసరం.. ‘డిస్కమ్‌ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక విధానాలతోపాటు సంస్థాగత, నిర్వాహక, సాంకేతిక సంస్కరణలు అవసరం’ – క్లే స్ట్రేంజర్, ఆర్ఎంఐ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్‌లో ఆదా ఇలా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించేలా చర్యలు చేపట్టారు. నిర్వహణ వ్యయంలో 80 శాతం విద్యుత్ కొనుగోలు ఖర్చే ఉంటుంది. మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చౌకగా లభించే సమయంలో ఎక్కువగా తీసుకునేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. రియల్ టైం విధానం వల్ల ప్రతి 15 నిమిషాలకు ఒకసారి జాతీయ స్థాయిలో విద్యుత్ ధరలను అంచనా వేసే వీలుంది. ఈ సదుపాయాన్ని విరివిగా ఉపయోగించుకునే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, మార్కెట్లో లభ్యతను శాస్త్రీయంగా గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. -
విద్యుత్‌లో తెలంగాణ నయా రికార్డు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) విద్యుత్ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీఎల్ పరిధిలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ వినియోగం వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదుకాగా 2019–20లో డిమాండ్ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది. పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్లో భారీగా యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలోని మెదక్‌లో 1,443, మహబూబ్‌నగర్‌లో 1,126 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. -
వేసవిలో విద్యుత్ కొరత ఉండొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఎనర్జీ డిపార్ట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పని తీరుపై క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటికి నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. థర్మల్ యూనిట్ల నిర్మాణం దీర్ఘ కాలం పాటు కొనసాగితే అవి భారంగా తయారవుతాయని తెలిపారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని అధికారులకు సూచించారు. విద్యుత్ కొరత లేకుండా చూసుకొండి వేసవి దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంతమేరకు విద్యుత్ అవసరమవుతుందో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇంధనశాఖ ఎక్స్ అఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీ జీ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్ -
ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్ పంపిణీ రంగం!
సాక్షి, హైదరాబాద్: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్డ్ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. ‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్కే తెలిపారు. క్రాస్ సబ్సిడీ కోసం సెంట్రల్ ఫండ్.. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్ సబ్సిడీ అంటారు. విద్యుత్ టారీఫ్‌లో క్రాస్ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్’పేరుతో ప్రత్యేక ఫండ్ పెట్టనున్నామని ఆర్కే సింగ్ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్‌లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. పీపీఏలన్నీ పంచుకోవాలి.. ‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్కే సింగ్ వెల్లడించారు. ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్.. భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్ కొనసాగిస్తారా? విద్యుత్ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్ రీడింగ్ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్) ప్రాంతీయ బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి. మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ విద్యుత్ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్‌రావు కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్..
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సరికొత్త హై టెన్షన్ లో సాగ్ (హెటీఎల్‌ఎస్) సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతోంది. ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచబోతోంది. కొత్తగా లైన్లు వేయకుండా, ఉన్న కారిడార్‌తోనే ఎక్కువ విద్యుత్ సరఫరా చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఎక్కువ కరెంట్ రావడమే కాకుండా, కొత్త లైన్లు వేసే అవసరం లేకపోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 2 జిల్లాల్లో చేసిన ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరికొన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కండక్టర్ల మార్పుతో రెట్టింపు వేగం విద్యుత్ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుత్ పంపిణీ లైన్ల సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే కొత్త కారిడార్లు వేయాలి. వ్యవసాయ భూముల్లోంచి విద్యుత్ లైన్లు వేయడం కష్ట సాధ్యంగా మారుతోంది. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో హెటీఎల్‌ఎస్ టెక్నాలజీపై ట్రాన్స్‌కో దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కారిడార్‌ను వాడుకుంటూనే కేవలం కండక్టర్‌ను మార్చడం ద్వారా రెట్టింపు విద్యుత్‌ను పంపేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. హెచ్‌టీఎల్‌ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కండక్టర్లు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అత్యధిక వేగంతో కరెంట్‌ను సరఫరా చేస్తాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు, వివిధ రకాలుగా లభిస్తున్న విద్యుత్‌ను గ్రిడ్‌పై ప్రతికూల ప్రభావం లేకుండా పంపిణీ చేయడానికి ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. రూ.100 కోట్ల వ్యయం.. హెటీఎల్‌ఎస్ టెక్నాలజీ కోసం ఏపీ ట్రాన్స్‌కో రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.15 కోట్లతో 13 కిలోమీటర్ల మేర 132 కేవీ కండక్టర్లు వేశారు. ఇవి మంచి ఫలితాన్నిచ్చాయి. రెండో దశలో విశాఖ, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు విద్యుత్ జోన్లలో కొత్త కండక్టర్లు వేయనున్నారు. 27 కిలోమీటర్ల మేర 220 కిలోవాట్ల సామర్థ్యంతో, 110 కిలోమీటర్ల మేర 132 కేవీ సామర్థ్యంతో హెటీఎల్‌ఎస్ కండక్టర్లు వేయబోతున్నారు. కాగా, విద్యుత్ లోడ్ తగ్గించడమే లక్ష్యంగా.. కొత్త టెక్నాలజీతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నట్లు ట్రాన్స్‌కో డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
‘మేక్ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో దేశీయ ఉపకరణాల వినియోగానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల్లోనూ కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ పంపిణీ విభాగంలో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్లు, రియాక్టర్లు, స్విచ్ గేర్లు, సబ్స్టేషన్ల నిర్మాణ సామగ్రి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే హైడ్రో టర్బైన్స్, జనరేటర్స్ వంటి భాగాలన్నీ స్థానికంగా తయారైనవే వాడాలని సూచించింది. ఇవీ మార్గదర్శకాలు ► థర్మల్ విభాగంలో ఇప్పటివరకూ విదేశీ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో స్వదేశంలో తయారైన ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బాయిలర్స్‌లో వాడే మిల్స్, ఎయిర్ ప్రీ హీటర్స్, టర్బైన్స్లో వినియోగించే ముఖ్యమైన విడి భాగాల విషయంలోనూ దేశీయంగా తయారైన వాటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► చివరకు బొగ్గు నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కన్వేయర్లు, ఇతర భాగాలు భారత్‌లో తయారైనవే ఉండాలి. ► బొగ్గును మండించడం ద్వారా వచ్చే బూడిదను నిల్వ చేసే విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలి. కేటగిరీలుగా విభజన.. ► దేశీయ, విదేశీ ఉపకరణాలు వాడే కాంట్రాక్ట్ సంస్థలను కేటగిరీలుగా విభజించాలి. ► దేశీయ పరికరాలు వాడే వారికి కాంట్రాక్ట్ విధానంలో సడలింపులు ఇవ్వాలి. ► విదేశీ, దేశీయ ఉపకరణాలు వాడాల్సిన పరిస్థితుల్లో భారత్‌లో లభించే వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థలను ముందుగా గుర్తించి.. విదేశీ దిగుమతి అవకాశం కల్పించాలి. అవసరమైతే విదేశీ వస్తువుల దిగుమతికి వీలుగా దేశీయ కంపెనీలు ఇతరులతో ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ► ఈ ముసాయిదాను గతంలోనే విడుదల చేసిన కేంద్రం తాజాగా కొన్ని మార్పులతో రాష్ట్రాలకు పంపింది. దీనిపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరింది. -
కేంద్రం పవర్ గేమ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. అలాగే విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది. దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడాలని మరో నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన సంస్కరణల అమలు కోసం కేంద్ర విద్యుత్ చట్టం– 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై జూన్ 5లోగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. (చదవండి: ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!) రాష్ట్రాల అధికారాలకు కత్తెర ఈఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కత్తెర వేయబోతోంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ), అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్ఈఆర్సీ)ల చైర్మన్, సభ్యులను.. కేంద్రం నియమించే కమిటీ ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా సుప్రీం కోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఏవైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. విద్యుత్ చట్టం సవరణలు అమల్లోకి వస్తే ఆ అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోనున్నాయి. ప్రస్తుత విధానంలో రాష్ట్రాలు నియమించుకుంటున్న ఈఆర్సీ చైర్మన్, సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలు బొమ్మల్లాగా పనిచేస్తున్నాయని, దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గవర్నర్లను నియమించి రాష్ట్రాలకు పంపినట్లు ఎస్ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఇకపై కేంద్రం నియమించనుందని, దీంతో వీరి నిర్ణయాలు సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటీకరణకు రాచబాట! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ సవరణలు వీలు కల్పించనున్నాయి. ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్ సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, ఫ్రాంచైజీల విషయంలో ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీగా నియామకమైన వ్యక్తి/సంస్థతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యులు కానున్నాయి. ప్రధానంగా నష్టాలు బాగా వస్తున్న ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనకపోతే జరిమానా ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ఏటా డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన ప్రతి యూనిట్‌కు 50 పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం పేర్కొంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను వచ్చే ఏడాదికి సర్పాజ్ చేసుకుంటూ పోతున్న ప్రస్తుత విధానానికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరింది. ఈ నిబంధలను అమలు చేస్తే ఏటా విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. ప్రస్తుతం అవలంభిస్తున్న విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నివాస గృహాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, హెయిర్ కటింగ్ సెలూన్స్ తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీరికి సంబంధించిన కొంత సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుండగా, మిగిలిన భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న సబ్సిడీలను నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేకుండానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రానుంది. దీంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం క్రాస్ సబ్సిడీల భారం మోస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే కేటగిరీల వినియోగదారులకు ఈ విధానంతో భారీ ఊరట లభించనుంది. మరోవైపు క్రాస్ సబ్సిడీల ఆదాయానికి గండిపడటంతో ఆ మేరకు చార్జీల భారం సైతం సబ్సిడీ వినియోగదారులైన గృహాలు, ఇతర వినియోగదారులపైనే పడనుంది. వ్యవసాయ కనెక్షన్లకు సైతం మీటర్లు పెట్టి బిల్లులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం తీసుకొస్తున్న జాతీయ టారిఫ్ పాలసీ వస్తేనే విద్యుత్ సబ్సిడీల విషయంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ప్రస్తుతం ఇలా.. భవిష్యత్తులో ఎలా.. ఇప్పుడు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.45 పైసల నుంచి రూ.9.50 వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. నెలకు 50 యూనిట్లు మాత్రమే వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 100 యూనిట్ల లోపు వినియోగిస్తే 51–100 యూనిట్లకు రూ.2.45 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్లు దాటితే తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున టారిఫ్ ఉంది. వినియోగం 300 యూనిట్లు దాటితే రూ.7.20, 400 యూనిట్లకు చేరితే రూ.8.50, 400–800 యూనిట్ల వినియోగానికి రూ.9, 800 యూనిట్లు దాటితే రూ.9.50 చొప్పున ధరతో టారిఫ్ వసూలు చేస్తున్నారు. (చదవండి: 9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు) తక్కువ విద్యుత్ వినియోగించే పేదలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీల అమలును నిలిపేయాల్సి వస్తుంది. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్) ఆధారంగా ఆయా కేటగిరీల వినియోగదారులకు టారిఫ్‌ను నిర్ణయించాలని ఈ బిల్లులో కేంద్రం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున యూనిట్ విద్యుత్ సరఫరాకు సగటున రూ.7.02 వరకు వ్యయం అవుతోంది. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, తదితర కేటగిరీలకు ఈ వ్యయంలో స్వల్ప తేడాలుంటాయి. ఆయా కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే వ్యయాన్ని సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు లేకుండా పూర్తి స్థాయిలో తిరిగి రాబట్టుకోవాలని కొత్త బిల్లు చెబుతోంది. అంటే, యూనిట్‌కు రూ.7, ఆపై చొప్పున టారిఫ్‌ను వినియోగదారులందరూ చెల్లించాల్సి రానుంది. దీంతో ప్రస్తుతం నెలకు వందల్లో బిల్లులు చెల్లిస్తున్న గృహ, ఇతర కేటగిరీల బిల్లులు ఒక్కసారిగా రూ.వేలకు పెరగనున్నాయి. -
ఖతార్ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా
న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్ఎల్), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. ఈ డీల్ నేపథ్యంలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.350ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.342 వద్ద ముగిసింది. -
విద్యుత్ కష్టాలు తీరేనా.?
సాక్షి,ఆదిలాబాద్: ఇది ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్.. ఉమ్మడి జిల్లాలో ఇది పాత సబ్‌స్టేషన్. 1970వ సంవత్సరంలో నిర్మించారు. ఇటీవల కాలంలో ఈ సబ్‌స్టేషన్ నుంచి సప్లయ్ పదేపదే ట్రిప్ అవుతుండడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ వచ్చింది. అయినా దీనిని మెయింటెనెన్స్‌ను అధికారులు మరిచారు. మాటిమాటికి ట్రిప్ కావడం సరఫరాలో అంతరాయం సమస్యలకు సంబంధించి ఎవరో ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత రెండు రోజులుగా భుక్తాపూర్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో బ్రేక్ డౌన్ ప్రకటించి యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. పాత తుప్పుపట్టిన ఎలక్ట్రికల్ సామగ్రిని మార్చి కొత్తవి అమర్చారు. సబ్‌స్టేషన్ ఆవరణలో గడ్డి తీయించారు. కంచెకు రంగులు దిద్దారు. ఎన్నో రోజుల తర్వాత ఈ సబ్‌స్టేషన్ పూర్తి స్థాయి మరమ్మతుకు నోచుకుంది. ఇకనైనా సరఫరాలో ట్రిప్ జరగదని వినియోగదారులు ఆశిస్తున్నారు. నిర్వహణ అస్తవ్యస్తం.. ఉమ్మడి జిల్లాలో 215 సబ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన తరువాత అనేకం కొత్తవి నిర్మించారు. గత ఐదారు సంవత్సరాలుగా ఆపరేటర్లను నియమించకపోవడంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. దీంతో సబ్స్టేషన్ల నిర్వహణ గందరగోళంగా మారింది. గతంలో వీటి నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ ఆపరేటర్లను నియమించుకుని సబ్‌స్టేషన్‌ను మెయింటెనెన్స్ చేసేవారు. దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి నేరుగా ఆపరేటర్లకు సంస్థే వేతనాలు ఇస్తోంది. రెండు సబ్స్టేషన్లకు కలిపి ఏడుగురు ఆపరేటర్లతో నిర్వహణ చేయాలని సంస్థ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఏడుగురు కూడా రెండు సబ్స్టేషన్లకు అందుబాటులో లేని పరిస్థితి. 8గంటల చొప్పున ఒక ఆపరేటర్ విధులు నిర్వహిస్తే ఈ లెక్కన 24 గంటల్లో ముగ్గురు ఆపరేటర్ల తప్పనిసరి. అదనంగా ఒక ఆపరేటర్ ఉంటే ఎవరైనా ఆపరేటర్ సెలవులో ఉంటే సర్ధుబాటు చేసుకునే పరిస్థితి. రెండు సబ్స్టేషన్లకు ఏడుగురు ఆపరేట్లతో నిర్వహణ చేస్తుండడంతో వారికి మెయింటెనెన్స్ గగనంగా మారింది. కొత్త సబ్స్టేషన్లు నిర్మించామని, అదే విధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చేశామని గొప్పలు పోతున్న సంస్థ అసలు నిర్వహణ విషయంలో తప్పటడుగు వేస్తోంది. దీంతో పలు సబ్స్టేషన్లు నిర్వహణ లేక గాడీ తప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిత్యం సరఫరాలో ట్రిప్ అయి విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. కంటిరెప్పపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం సబ్ స్టేషన్ మెయింటెనెన్స్‌లో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అంతరాయం ఉంటుందని అధికారికంగా ప్రకటించి సాయంత్రం 5 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. ఆదివారం కూడా ఇలాగే రిపీట్ చేశారు. వినియోగదారులు విద్యుత్ గోసను అనుభవించారు. -
ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై శుక్రవారం శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ...‘ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వం అవసరం లేకున్నా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు కమిటీ వేశాం. అయితే ఆ నిపుణుల కమిటీపై చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు. నివేదిక రాకుండానే అజేయకల్లం, విద్యుత్ కార్యదర్శిపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిపుణుల కమిటీ విచారణ ఇంకా కొనసాగుతోంది. పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు భయపడి పోతున్నారు. ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి ఆర్పీవోలను నిర్దేశిస్తోంది. 2015-16లో ఆర్పీఓ 5 శాతం నిర్ణయిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 5.5 శాతం కొనుగోలు చేసింది. 2016-17లో ఆర్పీఓ అయిదు శాతం నిర్ణయించగా, 8.6 శాతం కొనుగోలు చేసింది. ఇక 2017-18లో ఆర్పీఓ 11శాతం నిర్ణయిస్తే 23.4శాతం కొనుగోలు చేసింది. దీంతో 2016-17లో రూ.430 కోట్లు, 2017-18లో రూ.924.9 కోట్లు, 2018-19లో రూ.1292.8 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడింది. ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నామని తెలిసి... కొన్ని కంపెనీలకు లాభం చేకూరేలా ఈ ఒప్పందాలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వం రూ.2654 కోట్లకు విద్యుత్ కొనుగోలు చేసింది. అవసరం లేకున్నా గత ప్రభుత్వం కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం. ఈ భారాన్ని మోసే పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు లేవు. పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు,ప్రభుత్వానికి న్యాయం చేస్తాం. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2019 చదవండి: కరెంట్ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా విండ్ పవర్‌ను యూనిట్‌కు రూ.4.84కు ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఈఆర్సీ ధరల ప్రకారం థర్మల్ పవర్ యూనిట్ రూ.4.20కి అందుబాటులో ఉంది. అయినా థర్మల్ పవర్‌ను కాదని చంద్రబాబు విండ్ పవర్‌ను కొనుగోలు చేశారు. థర్మల్ పవర్‌ను తీసుకోకపోయినా... యూనిట్‌కు రూ.1.10 పైసలు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంపై యూనిట్ ధర రూ.5.94కు కొనుగోలు చేసినట్లు అయింది. దీనివల్ల యూనిట్ రూ.1.74పైసలు నష్టపోయాం. ఏడాదికి రూ.2766కోట్లు అదనంగా చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా మనం ఎందుకు పట్టించుకోలేదు?. దానికి కారణం డబ్బులే. సోలార్ విద్యుత్ కొనుగోలు విధానంలో కూడా ఇలాగే వ్యవహరించారు. విండ్ పవర్లో 64 శాతం కొనుగోళ్లు కేవలం ముగ్గురితో జరిగాయి. నోరెత్తితే టెక్నాలజీ అంటారుగా... 2016-18 మూడేళ్లలో రూ.5,497 కోట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. గత మూడేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. టెక్నాలజీని తానే కనిపెట్టానని చంద్రబాబు అంటారు. ఆ టెక్నాలజీ ద్వారా ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా?. తెలిసీ 25ఏళ్లకు ఈ పీపీఏలను ఎలా ఒప్పందం చేసుకున్నారు. కేంద్రం నుంచి ఇన్సెంటీవ్లు వస్తున్నాయని చంద్రబాబు అంటున్నారు. గత మూడేళ్లలో కేవలం రూ.540కోట్లు మాత్రమే వచ్చాయి?. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా తన వ్యక్తిని తెచ్చుకునేందుకు ....ఆ చట్టాన్ని కూడా మార్చారు. గత అయిదేళ్లుగా ఏపీ పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా ఉంది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు విద్యుత్ కొనుగోళ్లు చేశారు. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు లేకపోగా ఎక్కువ ధరలకు విద్యుత్ కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా సబ్సిడీ భారం పెరుగుతోంది. అయిదేళ్లలో రెవెన్యూ లోటు రూ.66,361కి చేరింది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయడం సమంజసమేనా?. ఇంత దారుణంగా టీడీపీ స్కామ్‌లు చేసింది. రాష్ట్రానికి ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా?’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
కరెంట్ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా
చౌక ధరలకే ముందుకొస్తున్నారు.. 5 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్రూ. 2.70కే రాష్ట్రానికి అందించేందుకు ఎలాంటి పీపీఏలు లేకుండానే పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులలాబీయింగ్కు రాష్ట్రం ఎందుకు తలొగ్గాలి? ప్రజలకు అతి తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తుంటే ఎక్కువ ధరలున్న పీపీఏలను సమీక్షించడాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు కుదుర్చుకున్న తప్పుడు డీల్స్‌పైనే సీఎం దృష్టి పెట్టారు. సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. అవినీతికి అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజలు, ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత సర్కారు హయాంలో అధిక ధరలతో చేసుకున్న పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను క్షుణ్నంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా ఏటా రూ.2,500 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నివారించవచ్చని సీఎం భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు విమర్శించడం ఏమిటని కల్లం తప్పుబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. వ్యవసాయం, విద్యుత్ అత్యంత కీలక రంగాలని పేర్కొన్నారు. కీలకమైన విద్యుత్ రంగం గాడి తప్పుతోందని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని సరైన మార్గంలోకి తెచ్చి అవినీతికి తావు లేకుండా తీర్చిదిద్దాలని నిర్ణయించారని వివరించారు. మూడేళ్లలో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వివాదాస్పదం కావడంతో వీటిని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని తెలిపారు. సీఎం సదాశయాన్ని అంతా అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. ధరలు తగ్గాయని కేంద్రమే చెప్పింది పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో పలు రకాలుగా స్పందించిందని కల్లం గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018–19 సర్వేలో స్పష్టంగా పేర్కొందన్నారు. 2010లో యూనిట్ రూ. 18 చొప్పున ఉన్న సౌర విద్యుత్ ధర 2018 నాటికి రూ. 2.44కి తగ్గిందని కేంద్రం ప్రకటించిందన్నారు. 2018–19 ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. దేశంలో పవన విద్యుత్ ధర 2017 డిసెంబర్ నాటికి యూనిట్ రూ.4.20 నుంచి రూ. 2.44కి తగ్గిందన్నారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా గత రెండేళ్లలో 3,000 మెగావాట్ల వరకూ యూనిట్ రూ. 4.84 చొప్పున కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో పవన, సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గితే రాష్ట్రంలో మాత్రం ఎలాంటి టెండర్లకు వెళ్లకుండా పీపీఏలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో థర్మల్ ప్రాజెక్టులతో దీర్ఘ, మధ్య కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్నాయని, థర్మల్, జల విద్యుత్ ద్వారా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ తీరడానికి ఆస్కారం ఉందని కల్లాం పేర్కొన్నారు. సోలార్, విండ్ పవర్ కన్నా థర్మల్ విద్యుత్తు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని వివరించారు. చౌకగా లభించే జెన్కో థర్మల్ విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేట్ పవన విద్యుత్‌ను తీసుకోవడం దారుణమన్నారు. పవన, సౌర విద్యుత్‌ను ఇష్టానుసారంగా కొనుగోలు చేయడం వల్ల పీపీఏలు చేసుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ నిలిపివేసినా స్థిర వ్యయం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. థర్మల్ విద్యుత్తు యూనిట్‌కు రూ.4.20కే అందుబాటులో ఉంటే వాడకుండా పవన్ విద్యుత్తు యూనిట్‌కు రూ.5.94, సౌర విద్యుత్తు రూ.6.10 చొప్పున కొనుగోలు చేయడం వల్ల ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడిందన్నారు. ప్రజా ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, వీటిని కాపాడానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు నష్టం కలిగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. అవినీతిపై యుద్ధం చేస్తామని సీఎం బహిరంగంగానే ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలపై సమీక్షించడాన్ని ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా స్వాగతించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమంటూ అత్యధిక ధరలున్న పీపీఏలు సమీక్షించడం మంచి నిర్ణయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు. సమీక్షించాలని గతంలో చెప్పింది... ప్రజలపై భారం మోపే విద్యుత్ ఒప్పందాలను రాష్ట్రం ఎందుకు సమీక్షించడం లేదని కేంద్రం కూడా గతంలో ప్రస్తావించినట్లు ఇంజనీర్స్ అసోసియేషన్ తెలిపిందని కల్లాం పేర్కొన్నారు. 5 శాతం తీసుకోవాల్సిన రెన్యూవబుల్ పవర్‌ను 22 శాతం తీసుకున్నారని, థర్మల్ విద్యుత్ కన్నా ఇది తక్కువ ఉంటే ప్రోత్సహించడం మంచిదని, కానీ అధిక ధరలు చెల్లించి ఎందుకు తీసుకున్నారనేది బోధపడటం లేదన్నారు. తక్కువ ధరకు లభించే థర్మల్ విద్యుత్తును తీసుకోకుండా, వాటికి బ్యాక్‌డౌన్ వల్ల స్థిర విద్యుత్ చెల్లించడం, విండ్, సోలార్కు అయ్యే ఖర్చుతో కలిపితే ఏడాదికి రూ. 2,500 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియకుండా ఏపీఈఆర్సీకి వివరాలు ఇవ్వడం లేదన్నారు. గత ఏడాది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ 3 వేల మెగావాట్ల సోలార్ పవర్‌కు టెండర్లు పిలిచిందని, అందులో 2,400 మెగావాట్లు రద్దు చేసిందని, సాఫ్ట్‌బ్యాంక్ అనే సంస్థ గణాంకాల మాయజాలం చేస్తే, కేవలం 27 పైసలు తేడా ఉందంటూ టెండర్లు రద్దు చేశారని తెలిపారు. కర్నూలులో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తే అందులో 350 మెగావాట్లు యూనిట్ రూ. 4.63 చొప్పున పీపీఏ చేసుకున్నారని చెప్పారు. గత ఐదేళ్లుగా జరిగిన పీపీఏలను సమీక్షిస్తామని, అక్రమాలు జరగకుంటే వాటికి ఏ ఇబ్బందీ ఉండదని కల్లాం ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధరలు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుల్లో డిస్కమ్‌లు గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రైవేట్ విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థలు రూ. 18,375 కోట్ల మేరకు బకాయిలు పడ్దాయని, ఇవి ఇప్పటికి రూ. 20 వేల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి 31 వరకూ డిస్కమ్‌ల నష్టాలు రూ. 15 వేల కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక పరిస్థితి ఇలా దిగజారడం వల్ల డిస్కమ్‌లకు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదన్నారు. దీనివల్ల ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. కేవలం ఎన్టీపీసీకే రూ. 5 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, సెప్టెంబర్ నాటికి చెల్లించకుంటే మరో రూ. 450 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఏపీఈఆర్సీకి ఇచ్చిన ఆదాయ అంతరం (రెవెన్యూ గ్యాప్) రూ. 3 వేల కోట్ల వరకూ భారం పడుతోందన్నారు. దీన్ని ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో సంప్రదాయేత ఇంధన వనరులు (విండ్, సోలార్) డిమాండ్‌లో 5 శాతం మాత్రమే ఉండాలని, కానీ దీన్ని 22 శాతం తీసుకున్నారని, దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చిందని, ఆ ఉత్పత్తిదారులతో ఒప్పందాలున్నాయని కాబట్టి విద్యుత్ తీసుకోకపోయినా ఫిక్స్డ్ ధర చెల్లించాల్సి వచ్చిందన్నారు. కొన్నింటికి యూనిట్‌కు రూ. 1.10, మరికొన్నింటికి రూ. 1.25 చెల్లిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా పారిశ్రామిక విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. విద్యుత్ ధరలు పెరిగితే పారిశ్రామిక వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ తక్కువ ధరకే లభిస్తే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 221 ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 88, కొత్త రాష్ట్రంలో 133 ఒప్పందాలు జరిగాయని వివరించారు. 25 సంవత్సరాల పీపీఏల నెట్ వ్యాల్యూ రూ.9,200 కోట్లని తెలిపారు. ఇందులో ప్రధాన పీపీఏలు ఐదున్నాయని, వీటితోనే 75 శాతం విద్యుత్ తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అందులో గ్రీన్కోవి 16 (999 మెగావాట్లు), రెన్యూ 15 (717 మె.వా), మైత్రా 7 పీపీఏలు (352 మె.వా), కేంద్ర ప్రభుత్వ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నాలుగు పీపీఏలు (189 మె.వా), ఎకోరిన్ (151 మె.వా), యాక్సిస్ (210మె.వా) ఉన్నాయన్నారు. కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో విండ్, సోలార్ విద్యుత్ ధరల గురించి శ్రీకాంత్ వివరించారు. 1995లో విండ్ యూనిట్ రూ. 2.23 ఉందని, 2006లో రూ. 2.70 ఉందని, 1995–2000 మధ్య తమిళనాడులో రూ.2.70 వరకూ ఉందని తెలిపారు. ప్రస్తుతం సెఖీ బిడ్ 2017లో రూ. 2.43 ఉందని, తమిళనాడులో రూ. 2.86 చొప్పున ఉందన్నారు. విద్యుత్ ధరలపై అత్యున్నత కమిటీ సమీక్ష టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అత్యున్నతస్థాయి సంప్రదింపుల కమిటీ సోమవారం భేటీ అయింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఇంధనశాఖ సలహాదారు కృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. విండ్, సోలార్ ఉత్పత్తిదారులకు కమిటీ అన్ని విషయాలను వివరించింది. దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గాయని, రాష్ట్రంలో ఎలాంటి బిడ్డింగ్ లేకుండా పీపీఏలు చేసుకోవడం వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సౌర, పనవ విద్యుత్ ధరలు చౌకగా ఉన్న విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కమిటీ సూచనలపై సమాలోచనలు జరుపుతామని విండ్, సోలార్ ఉత్పత్తిదారులు తెలిపారు. త్వరలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ టారిఫ్‌లపై ఎవరి నిర్ణయం ఉండదు : చంద్రబాబు సాక్షి, అమరావతి: విద్యుత్ టారిఫ్ నిర్ణయంలో ఎవరి ప్రమేయం ఉండదని, పద్ధతి ప్రకారం ధరల నిర్ణయం ఉంటుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. టారిఫ్ నిర్ణయం స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా ఉంటుందన్నారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్స్‌లో సోమవారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీఏలను రద్దు చేయొద్దని కేంద్ర ఇంధన శాఖ కోరిందని, మంత్రివర్గం ఖరారు చేసిన తర్వాతే అవి అమల్లోకి వస్తాయని తెలిపారు. పీపీఏలను సమీక్షించాల్సిందే: సీపీఎం రాష్ట్ర ప్రజలపైన, ప్రభుత్వ ఖజానాపైన భారాన్ని తగ్గించడానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కేంద్రం పీపీఎలను సమీక్షించి ప్రజలకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజ్ఞప్తి చేశారు. -
బాబు జమానా.. రైతుకు షాక్
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): అన్నదాతలు కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయారు. వరుణుడి కరుణ లేక వర్షాధార పంటలన్నీ తుడిచిపెట్టుకుపోగా.. బోరుబావుల్లో వచ్చే అరకొర నీటితోనైనా పంటలు వేద్దామంటే ప్రభుత్వం కరుణ చూపడం లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో వేలాది రూపాయలు ధారబోసి బోర్లు వేయించుకున్న రైతులు పంటలను సాగు చేసుకోలేకపోతున్నారు. ఏళ్ల తరబడి విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. కనెక్షన్లు మాత్రం మంజూరు కావడం లేదు. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోటా తగ్గించి..రైతులను వేధించి.. తమది రైతు ప్రభుత్వమని, వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చంద్రబాబు తరచూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే..ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరించారు. మరోవైపు అర్హులైన రైతులు ఉన్నప్పటికీ కొత్త వారికి కనెక్షన్లు మంజూరు చేయకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనా కాలమంతా ఇదే పరిస్థితి. దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ కనెక్షన్ రాకపోవడంతో బోరుబావులను నిరుపయోగంగా ఉంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రైతులు ఇటు పంటలను, అటు ఆర్థికంగాను నష్టపోతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35,638 మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. వైఎస్సార్ పథకానికి తూట్లు రైతు సంక్షేమం కోసం వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ (త్రీఫేజ్) అందించేందుకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారు. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. మొదటి ఏడాదే జిల్లాకు రూ.39.74 కోట్లతో 5,085 కనెక్షన్లు మంజూరు. తర్వాత ప్రతియేటా కోటా పెంచుతూ వెళ్లారు. వైఎస్సార్ పుణ్యమా అని జిల్లాలో ఇప్పటికి దాదాపు 1.50 లక్షల కనెక్షన్ల ద్వారా ఉచిత విద్యుత్ అందుతోంది. అయితే..చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఉచిత విద్యుత్ పథకానికి క్రమేణా తూట్లు పొడుస్తూ వచ్చారు. 2018–19 సంవత్సరంలో అర్హులైన జిల్లా కోటాను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేశారు. సాధారణంగా ఏటా జనవరి– ఫిబ్రవరి మాసాల్లో పెండింగ్ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా మొత్తం కోటా విడుదల చేయాలని సీఎండీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ మాసంలోనే కోటాను విడుదల చేయాలి.అయితే..ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. కనెక్షన్లు ప్రశ్నార్థకమే ఎన్నికల కోడ్, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం కొత్త కనెక్షన్ల మంజూరు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు కోటాను, సర్వీసులను సకాలంలో విడుదల చేయకపోవడంతో పెండింగ్ దరఖాస్తులు 35,638కి చేరుకున్నాయి. ఇప్పటికే డీడీల రూపంలో 13,553 మంది రైతులు డబ్బు చెల్లించారు. వీరి మొత్తం రూ.7,62,35,625లు ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు చేరింది. డబ్బు చెల్లించినా కనెక్షన్లు రాకపోవడంతో రైతులు వేదన చెందుతున్నారు. -
కవర్డ్ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవో
సాక్షి, అమరావతి: తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో వెలుగు చూసిన రూ.131 కోట్ల కవర్డ్ కండక్టర్ల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) జోక్యం తెరపైకి వస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి సన్నిహిత అధికారుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. కేసును పక్కదారి పట్టించి, అసలు దోషులను రక్షించడానికే ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొరతో బలవంతంగా రాజీనామా చేయించారని విద్యుత్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కవర్డ్ కండక్టర్ల కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు ఎస్పీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. తవ్వేకొద్దీ పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగింది? ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునేందుకు వీలుగా డిస్కమ్‌ల పరిధిలో కవర్డ్ కండక్టర్స్(తొడుగు తీగలు) వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్లను 2016లో ఎస్పీడీసీఎల్ పిలిచింది. అయితే, కేవలం ఒకే ఒక్క కంపెనీకి టెండర్ దక్కేలా నిబంధనలను రూపొందించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బెంగుళూరు కేంద్రంగా పనిచేసే రేచమ్ ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీసాయి ఎలక్ట్రికల్ ఎంటర్ప్రైజెస్, ఫ్రంట్‌లైన్ ఎలక్ట్రికల్స్ అనే సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎల్–1గా నిలిచిన రేచమ్ ఆర్పీజీ సంస్థకు టెండర్ అప్పగించారు. అయితే, ఈ మూడు కంపెనీలకు డిపాజిట్ డీడీలను ఒకే అకౌంట్ నుంచి తీసినట్టు విచారణలో బయటపడింది. దీన్నిబట్టి ఈ మూడు కంపెనీలు ఒకే వ్యక్తివనే అనుమానాలు బలపడుతున్నాయి. రూ.131 కోట్ల విలువైన కవర్డ్ కండక్టర్ల పనులను కేవలం ఓ డిస్కమ్ సీఎండీ అప్పగించేందుకు వీల్లేదని, దీని వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి ఉందనే సందేహాలు తలెత్తాయి. విజిలెన్స్ నివేదిక బుట్టదాఖలు కవర్డ్ కండక్టర్లను స్వీడన్ నుంచి తెప్పించామని పేర్కొంటూ కాంట్రాక్టు సంస్థ బిల్లులు సమర్పించింది. వీటిని గుజరాత్‌లోనే కేవలం రూ.64.52 కోట్లకు కొన్నట్టు విజిలెన్స్ విచారణలో బయటపడింది. కానీ, కాంట్రాక్టు సంస్థ ఏకంగా రూ.195.83 కోట్ల మేర బిల్లులు సమర్పించింది. ఆ మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించేసింది. రూ.131.30 కోట్ల మేర అదనంగా చెల్లించారని విజిలెన్స్ విభాగం తేల్చింది. 2016లో జరిగిన ఈ కుంభకోణంపై 2018 జూన్‌లో విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. కాంట్రాక్టు సంస్థకు అదనంగా చెల్లించిన సొమ్మును వెంటనే రాబట్టాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ కేసులో రాజీనామా చేసిన హెచ్‌వై దొర హయాంలో చెల్లించిన బిల్లులు కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఆ తర్వాత ఆయన పదవీ కాలం ముగిసింది. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఎంఎం నాయక్ బాధ్యతలు చేపట్టారు. విజిలెన్స్ నివేదిక తర్వాత ఆయన కాంట్రాక్టు సంస్థకు బిల్లులు ఇవ్వకుండా తొలుత నిరాకరించినట్టు తెలిసింది. కానీ, ïసీఎంవో ఒత్తిడి చేయడంతో కాంట్రాక్టు సంస్థకు బిల్లులన్నీ చెల్లించక తప్పలేదు. సన్నిహితుడిదే పెత్తనం సీఎంవోలో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారికి అత్యంత సన్నిహితుడినని చెప్పుకునే వ్యక్తి కవర్డ్ కండక్టర్స్ విషయంలో మొదటి నుంచీ అత్యుత్సాహం చూపిస్తున్నట్టు అధికార వర్గాలు చెçపుతున్నాయి. వాస్తవానికి టెండర్లో పాల్గొన్న సంస్థలు కూడా అతడి నేతృత్వంలోనే నడుస్తున్నాయని తెలిసింది. సీఎంవోలోని ఐఏఎస్ అధికారి బినామీ సొమ్మును ఇతర మార్గాల్లో విదేశాలకు చేరవేయడంలో ఈయన పాత్ర ఉంటుందని చర్చ జరుగుతోంది. కవర్డ్ కండక్టర్లు సరఫరా చేసిన కంపెనీకి బిల్లులన్నీ చెల్లించేలా అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. రూ.131 కోట్ల కుంభకోణం జరిగిందని, దోషులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేస్తే ఇంతవరకూ ఎవరిపైనా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది ప్రమేయం ఉండటం వల్లే కేసులు పెట్టే సాహసం చేయలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి తీసుకున్న కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో విద్యుత్ పంపిణీ, సరఫరా, టెలిఫోన్ ఆధారిత సేవల్లో ప్రముఖ కంపెనీ అయిన బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) డాక్టర్ కె.వి.శ్రీనివాస్‌ను నియమించింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. బీఎస్ లిమిటెడ్ 2010–15 వరకు ఎస్బీఐ నుంచి దశల వారీగా రూ.5 వేల కోట్లకు పైగా రుణం తీసుకుంది. తీసుకున్న రుణంలో కొంత చెల్లించిన బీఎస్ లిమిటెడ్, ఎస్బీఐకి రూ. 924.88 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయి చెల్లించడంలో బీఎస్ లిమిటెడ్ విఫలం కావడంతో ఆ కంపెనీపై ఎస్బీఐ హైదరాబాద్‌లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఎస్బీఐ కోరింది. రుణ బకాయి వసూలు నిమిత్తం ఎస్బీఐ ఇప్పటికే డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ముందు సర్ఫేసీ చట్టం కింద పిటిషన్ దాఖలు చేసిందని బీఎస్ లిమిటెడ్ వివరించింది. ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం.. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు పద్మనాభస్వామి బీఎస్ లిమిటెడ్ వాదనలను తోసిపుచ్చారు. ఎస్బీఐకి బకాయి ఉన్న విషయం వాస్తవమని, దీనిని తోసిపుచ్చేందుకు సరైన కారణాలేవీ కనిపించడం లేదన్నారు. ఎస్బీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటూ బీఎస్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతినిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీఎస్ లిమిటెడ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించారు. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదన్నారు. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని, దివాలా ప్రక్రియకు సంబంధించి పత్రికా ప్రకటన జారీ చేయాలన్నారు. -
‘ఎత్తిపోతల’కు ఊరట కొంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరలపై స్వల్ప ఊరటే లభించింది. యూనిట్ ధరను రూ.6.40 నుంచి రూ.4.88కి తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా... విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 60 పైసలు మాత్రమే తగ్గించి, యూనిట్ ధరను రూ.5.80గా నిర్ణయించింది. దాంతో ఎత్తిపోతల పథకాల విద్యుత్ ఖర్చులో కేవలం రూ.146.77 కోట్లకు మాత్రమే ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి భారీగా వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వ కుర్తి వంటి మొత్తం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వాటికి ప్రస్తుతం ఏటా 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. యూనిట్‌కు రూ.6.40 చొప్పున లెక్కిస్తే.. ఏటా వీటికి రూ.1,565.57 కోట్ల మేర ఖర్చవుతోంది. తాజాగా ధర రూ.5.80కు తగ్గించడంతో ఖర్చు 1,418.80 కోట్లకు తగ్గనుంది. అంటే రూ.146.77 కోట్ల మేర మాత్రమే భారం తగ్గుతోంది. అదే డిస్కంలు కోరిన మేర రూ.4.88కి తగ్గిస్తే.. భారం ఏకంగా రూ.371.82 కోట్లు తగ్గేదని అంచనా. ఇక ఈ ఏడాది జూన్–జూలై నాటికి మరిన్ని ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తుండడంతో.. విద్యుత్ అవసరం 3,331 మెగావాట్లకు పెరుగుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. యూనిట్ ధర రూ.4.88కి తగ్గించి ఉంటే.. భారం ఏకంగా రూ.911.36 కోట్ల మేర తగ్గేదని అంచనా. -
‘విద్యుత్’ అధికారుల పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) జి.రఘుమారెడ్డితో సహా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న మరో ఆరుగురు డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) డైరెక్టర్(ఆపరేషన్స్) నర్సింగ్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు జగత్‌రెడ్డి (ట్రాన్స్మిషన్), నర్సింగ్‌రావు (గ్రిడ్ ఆపరేషన్స్), జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం (హైడల్ విభాగం), సచ్చిదానందం (థర్మల్ విభాగం)ల పదవీకాలం మరో ఏడాదికి పెరిగింది. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావుతో సమావేశమై డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు, నియామకాలపై చర్చించారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారికి ఏడాదిపాటు పొడిగింపు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, రఘుమారెడ్డి పదవీకాలం 2016లో ముగియగా, అప్పుడు ఏడాదిపాటు పొడిగించారు. జెన్కో డైరెక్టర్లు వెంకట్రాజం, సచ్చిదానందంల పదవీకాలాన్ని వచ్చే ఏడాది నవంబర్ 30 గా నిర్ణయించారు. రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
‘సర్కిల్’ సగం
విడిపోనున్న ఖమ్మం సర్కిల్ కార్యాలయం ♦ భద్రాద్రి జిల్లాకు ‘పవర్’ సర్కిల్ ♦ ట్రాన్స్‌కో ఎస్ఈ పోస్టు మంజూరు ♦ నాలుగు సర్కిళ్లుగా ఖమ్మం పాత సర్కిల్ ♦ పోస్టుల విభజనపై దృష్టి పెట్టిన అధికారులు ఖమ్మం: మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం డీఈ స్థాయి అధికారిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఖమ్మం సర్కిల్ ఇప్పుడు రెండుగా విడిపోనుంది. ఖమ్మం సర్కిల్ పరిధిలోనే ప్రస్తుతం రెండు జిల్లాలకు సంబంధించిన కార్యకలాపాలు ఖమ్మం కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సర్కిల్ మంజూరు చేయడంతో మరో నెల రోజుల్లో కొత్తగూడెం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇందుకోసం ఇప్పటికే సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) పోస్టును ఆ శాఖ ఉన్నతాధికారులు మంజూరు చేశారు. సర్కిల్ కార్యాలయ నిర్వహణకు కావాల్సిన మిగిలిన పోస్టుల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. నాలుగు సర్కిళ్లుగా ఖమ్మం జిల్లాల పునర్విభజనకు పూర్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఖమ్మం సర్కిల్ పరి ధిలోనే ఉండేది. జిల్లాలు విడిపోవడంతో వాజే డు, వెంకటాపురం మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లగా, గార్ల, బయ్యా రం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. అయితే సర్కిళ్ల పునర్విభజన జరగకపోవడంతో ఇప్పటివరకు ఈ నాలుగు మండలాలు సైతం ఖమ్మం సర్కిల్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాలను సర్కిల్ కార్యాలయాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పాత ఖమ్మం సర్కిల్ పరిధి ఇప్పుడు నాలుగు సర్కిళ్ల పరిధిలోకి విడిపోనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సర్కిళ్లతోపాటు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లే విద్యుత్ కనెక్షన్లను అధికారులు విభజించారు. రెండు సర్కిళ్లకు రెండేసి డివిజన్లు.. ప్రస్తుతం ఖమ్మం ఎన్పీడీసీఎల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్ కేంద్రాలుగా డీఈ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం సర్కిల్ విభజన నేపథ్యంలో ఖమ్మం, సత్తుపల్లి డివిజన్లు ఖమ్మం సర్కిల్ పరిధిలోకి రానుండగా.. కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లు కొత్తగూడెం సర్కిల్ కార్యాలయం పరిధిలోకి రానున్నాయి. దీంతోపాటు సర్కిల్ కేంద్రంలో డీఈ పోస్టుల విభజనపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. అవసరం మేరకు కొత్త సర్కిల్లో డీఈ పోస్టులను మంజూరు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే రెండు జిల్లాలకు సం బంధించిన పూర్తి సమాచారం, రెండు సర్కి ళ్ల పరిధిలోకి వచ్చే సబ్స్టేషన్లు, కనెక్షన్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో 9లక్షల కనెక్షన్లు.. ప్రస్తుతం ఖమ్మం సర్కిల్ పరిధిలోని కొన్ని కనెక్షన్లు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్తుండగా.. మిగిలిన మొత్తాన్ని రెండు సర్కిళ్ల పరిధిలోకి విభజించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి 17,821 కనెక్షన్లు వెళ్తుండగా.. మహబూబాబాద్ జిల్లాలోకి 27,070 కనెక్షన్లు వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పడే సర్కిల్ విభజనపైనే అధికారులు దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లోని అన్ని కేటగిరీల్లో 9.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఖమ్మం సర్కిల్ పరిధిలోకి 5,53,303 కనెక్షన్లు వస్తుండగా, భద్రాద్రి జిల్లా సర్కిల్‌లోకి 3,56,845 కనెక్షన్లు వెళ్తున్నాయి. రెండు జిల్లాల్లో సర్కిళ్ల పరిధిలోకి వచ్చే కనెక్షన్ల వివరాలు.. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం గృహ వినియోగదారులు 4,16,554 2,89,581 కమర్షియల్ 36,359 27,053 చిన్నతరహా పరిశ్రమలు 3,131 1,195 కుటీర పరిశ్రమలు 369 228 వ్యవసాయం 87,809 33,956 విద్యుత్ దీపాలు, నీటి సరఫరా 5,128 2,820 దేవాలయాలు, పాఠశాలలు 3,384 1,940 తాత్కాలిక కనెక్షన్లు 10 0 పెద్దతరహా పరిశ్రమలు 559 72 మొత్తం 5,53,303 3,56,845. -
రాష్ట్రంలో కొత్త విద్యుత్ సర్కిళ్లు!
మరో 21 సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు - 15 నుంచి 36కు పెరిగిన డిస్కంల ఆపరేషన్స్ సర్కిళ్లు - గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 4 సర్కిళ్లు - కొత్త జిల్లాలకు అనుగుణంగా డిస్కంల అధికార వికేంద్రీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అధికార వికేంద్రీకరణ చేపట్టాయి. ఉమ్మడి జిల్లాల ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయాల ఆధ్వర్యంలోనే కొత్త జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవహారాలను డిస్కంలు పర్యవేక్షిస్తుండగా, తాజాగా కొత్త జిల్లాల్లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 15 ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయాలుండగా, తాజాగా మరో 21 కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సర్కిల్ కార్యాలయాల సంఖ్య 36కు పెరిగింది. గ్రేటర్ పరిధిలో 6 సర్కిల్ కార్యాలయాలు ఉండగా.. పెంపులో భాగంగా 4 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. విద్యుత్ సర్కిల్ కార్యాలయాల పర్యవేక్షణలోనే క్షేత్రస్థాయి వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. విద్యుత్ పంపిణీలో అంతరాయాలను సరిదిద్దడం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల వసూళ్లు తదితర కీలక బాధ్యతలను విద్యుత్ సర్కిల్ కార్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. ఒకేసారి వీటి సంఖ్య భారీగా పెంచడంతో క్షేత్రస్థాయి వరకు సర్కిల్ కార్యాలయాల సేవలు అందనున్నాయి. ఈ కార్యాలయాలకు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) స్థాయి అధికారులను నియమిస్తూ డిస్కంలు ఉత్తర్వులిచ్చాయి. భారీ ఎత్తున డివిజనల్ ఇంజ నీర్లను ఎస్ఈలుగా పదోన్నతులు కల్పించాయి. దక్షిణ డిస్కం పరిధిలో.. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 10 సర్కిల్ కార్యాలయాలుండగా, కొత్తగా మరో 9 కార్యాలయాలను సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్, రంగారెడ్డి ఈస్ట్, రంగారెడ్డి నార్త్, రంగా రెడ్డి సౌత్ సర్కిల్ కార్యాలయాలున్నాయి. తాజా గా గ్రేటర్ పరిధిలో 4 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నార్త్ సర్కిల్‌ను రెండుగా విభజించి బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి సౌత్ సర్కిల్ పేరును వికారాబాద్‌గా మార్చింది. గ్రామీణ ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లతోపాటు సిద్దిపేటలో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉండగా, ఇప్పుడు యాదాద్రి, సూర్యాపేట, గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్‌లలో కొత్త సర్కిల్లను ఏర్పాటు చేసింది. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో.. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండగా, తాజాగా మరో 10 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యా యి. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సర్కిళ్లు ఉండగా, కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, జగి త్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వరంగల్ సర్కిల్‌ను వరంగల్ అర్బన్‌గా పేరు మార్చింది. దీంతో టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో సర్కిళ్ల సంఖ్య 17కి పెరిగింది. -
ముగిసిన విద్యుత్ బంధం!
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాలు బంద్ సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం పూర్తిగా తెగిపోయింది. విద్యుత్ వాటాల పంపకాల ప్రకారం తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను ఏపీ శనివారమే నిలిపివేయగా, ఆదివారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ సైతం ఏపీ వాటా సరఫరాను నిలుపుదల చేసింది. విద్యుత్ పంపకాలకు సంబంధించిన రూ. 3,139 కోట్ల బకాయిలు చెల్లిం చలేదని తెలంగాణకు ఏపీ విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా, ఏపీ నుంచే రూ. 1,676.46 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సైతం ఏపీకి విద్యుత్ వాటాల పంపకాలను నిలిపివేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని జెన్కో విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. మూడేళ్ల పాటు రెండు రాష్ట్రాలు థర్మల్ విద్యుత్‌లో వాటాలు పంచుకోగా, తాజాగా ఈ పంపకాలకు బ్రేక్ పడినట్లు అయింది. -
కరెంట్‌కూ నగదు బదిలీ: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల మాదిరిగానే విద్యుత్ సరఫరాకు కూడా నగదు బదిలీ(డీబీటీ) పథకం అమలుకు నీతి ఆయోగ్ మద్దతు తెలిపింది. కనీవిని ఎరగని రీతిలో పెద్దనోట్లను రద్దు చేసిన దేశం విద్యుత్ రంగంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే సాహసం చేయొచ్చని అభిప్రాయపడింది. అధిక భాగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ రంగంలో సత్ఫలితాలు సాధించాలంటే దీర్ఘకాలంలో ప్రైవేటీకరణ చేపట్టాలని సంస్థ సీఈఓ అమితాబ్ కాంత్ సూచించారు. బుధవారం ఆయన ఇండియా ఎనర్జీ ఫోరంలో మాట్లాడారు. ‘ఏ వినియోగదారుడు కూడా డీబీటీ లేకుండా విద్యుత్ పొందకూడదు. బలవంతంగానైనా దీన్ని అమలు చేయాలి. మార్కెట్ ధరల ప్రాతిపదికన ధరలు నిర్ణయించే, పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించే నియంత్రణ సంస్థలు రావాలి’ అని కాంత్ అన్నారు. దిగువ స్థాయుల్లో మీటర్ విధానం అమల్లోకి రాకుంటే విద్యుత్ రంగం మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. డీజిల్ వినియోగం తగ్గించాలంటే కాలుష్య పన్నులు విధించాలని సూచించారు. కేవలం పదేళ్లే జీవిత కాలమున్న బొగ్గు వాడకాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ ఇంధన రంగం విష వలయంలో చిక్కుకుందని ఇందులో మార్పు రావాలని తెలిపారు. -
నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు
ఏలూరు (మెట్రో) : ప్రపంచ బ్యాంక్ నిధులతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థ వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ రమేష్ ప్రసాద్ తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విధ్యుత్ పంపిణీ సంస్థ) ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్పు చేసి నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించామన్నారు. అంతే కాకుండా కొత్తలైన్లు ఏర్పాటు చేసి గృహ వినియోగానికి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులందరూ ఉత్తమ పనితీరు చూపించి జిల్లాకు ఉన్నత పేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కొత్తగా జిల్లాలో సబ్‌స్టేçÙన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కేవీసీహెచ్ పంతులు, డీఈటీ కె.రఘునాథ్‌బాబు, ఏడీ అంబేడ్కర్ పాల్గొన్నారు. -
‘ఛత్తీస్ విద్యుత్’పై బహిరంగ విచారణ
ఫిబ్రవరి 11న నిర్వహిస్తామని ప్రకటించిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై బహిరంగ విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించింది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు సింగరేణి భవన్‌లోని తమ కార్యాలయంలో విచారణ నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఒప్పందంపై విద్యుత్‌రంగ నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఒప్పందానికి సవరణలు జరిపాకే ఆమోదం కోసం తమ వద్దకు తేవాలని ఈఆర్సీ గతేడాది నవంబర్లోనే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించింది. ఈఆర్సీ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో డిస్కంలు బేఖాతరు చేశాయి. రాతపూర్వక ఆదేశాలిస్తేనే ఒప్పందంలో సవరణల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో మిన్నకుండిపోయాయి. దీనిపై 2 నెలలకుపైగా జాప్యం జరగడంతో ఈఆర్సీ వెనక్కి తగ్గింది. ఒప్పందంపై అనేక అభ్యంతరాలు... లోపాల పుట్టగా ఉన్న ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్‌రంగ నిపుణుడు, తెలంగాణ విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు, విద్యుత్‌రంగ కార్యకర్త ఎం.తిమ్మారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్‌రావు, రిటైర్డు ఇంజనీర్ నారాయణరెడ్డి ఈఆర్సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు. ఈ ఒప్పం దంపై బహిరంగ విచారణ జరపాలని టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ఈఆర్సీకి వినతిపత్రం సమర్పిం చారు. విచారణ జరపాలని ఈఆర్సీ తాజాగా నిర్ణయించినా పిటిషన్‌దారులకు డిస్కంల నుంచి లిఖి తపూర్వకంగా వివరణలు అందలేదు. తమ అభ్యంతరాలపై డిస్కంల వివరణల పట్ల అభిప్రాయాన్ని తెలుపు తూ జరిగే బహిరంగ విచారణ లో పిటిషన్‌దారులు ఈఆర్సీ చైర్మన్, సభ్యుల బెంచ్ ఎదుట వాదనలు వినిపించనున్నారు. దీనిపై డిస్కంల ప్రతివాదనలూ విన్నాక ఒప్పందం భవితవ్యంపై ఈఆర్సీ ఆదేశాలివ్వనుంది. పిటిషన్‌దారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఒప్పందంలో సవరణలు జరపాలని ఈఆర్సీ ఆదేశిస్తే రాష్ట్ర డిస్కంలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మేరకు సవరణలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ సర్కారు ఒప్పుకోకపోతే ఈ ఒప్పందం మరుగునపడనుంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై ప్రధాన అభ్యంతరాలివే.. ► ఛత్తీస్‌గఢ్‌కన్నా తక్కువ ధరకు విద్యుత్ విక్రయించే ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ సంస్థలు చాలా ఉన్నా ఛత్తీస్‌గఢ్ నుంచే ఎందుకు కొంటున్నట్లు? ► విద్యుత్ చట్టం ప్రకారం విద్యుత్ ధరల నిర్ణయాధికారం రాష్ట్ర ఈఆర్సీకే ఉండాలి. కానీ ఛతీస్‌గఢ్ ఈఆర్సీకి ఎందుకు కట్టబెట్టారు ? ► ఏ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తారో కనీసం సూచనప్రాయంగా కూడా తెలపకుండా ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ► విద్యుత్ కొనుగోలు చేసినా చేయకున్నా రూ. వందల కోట్ల స్థిర చార్జీలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లించేలా నిబంధనలు ఎందుకు ఉన్నాయి? ► విద్యుత్ ఉత్పత్తికి వాడే బొగ్గును ఎక్కుడ్నుంచి తెస్తారో కూడా ఒప్పందంలో పేర్కొనలేదెందుకు? ► విద్యుత్ అమ్మకం ధరను రాష్ట్ర సరిహద్దుల వద్ద కాకుండా ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి సంస్థ సరిహద్దుల వద్ద నిర్ణయించేలా ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? -
మేం జోక్యం చేసుకోలేం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు వారికి ఇతర ఉద్యోగుల్లాగే చట్ట ప్రకారం సమాన జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయం పొందేందుకు బాధితులకు ప్రత్యామ్నాయం ఉందని, అందువల్ల వారు సంబంధిత ఫోరాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. ఇది ఉద్యోగుల సర్వీసు వివాదమని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దీనిని విచారించడం సాధ్యం కాదంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కరెంటు ఏపీది.. కాసులు తెలంగాణవి
చింతూరు :‘సొమ్మొకడిది సోకొకడిది’ అన్న సామెత విలీన మండలాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఆంధ్రాలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకుంటున్న తెలంగాణ అధికారులు అదే విద్యుత్తును విలీన మండలాలకు సరఫరా చేస్తూ ఈ మండలాల్లో విద్యుత్తు ద్వారా వస్తున్న ఆదాయాన్ని తన్నుకుపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, నెల్లిపాక మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. చింతూరు మండలంలోని లోయర్ సీలేరు ప్రాజెక్టు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం కూడా ఇదే జిల్లాలో విలీనమైంది. ఈ కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా నిత్యం 460 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేంద్రం ద్వారా ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ పరిధిలోని సీతారామపట్నం 220 కేవీ సబ్‌స్టేషన్‌కు 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగేది. ఇదే విద్యుత్తును జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వినియోగించేవారు. ఇక్కడి నుంచి భద్రాచలం సమీపంలోని ఎటపాక 132 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా జరిగి అక్కడి నుంచి విలీన మండలాలైన నెల్లిపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు సరఫరా చేసేవారు. ఇప్పుడీ మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైనా ఇప్పటి వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా విలీన మండలాల్లో చాలావరకు ప్రభుత్వ శాఖల విభజన ప్రక్రియ పూర్తయి ఆంధ్రా అధికారుల పాలన కొనసాగుతున్నా విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో విలీన మండలాల్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధీనంలో ఇక్కడ విద్యుత్ సరఫరా జరిగేది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాలు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోకి వెళ్లాల్సి ఉండగా, పైస్థాయిలో విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ మండలాల్లో ఇంకా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిబ్బందే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ విభజన జరగకే.. పవర్ కంపెనీల నడుమ విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాక పోవడంతో విలీన మండలాలకు సంబంధించి ప్రతినెలా సుమారు రూ.60 లక్షల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, నెల్లిపాక, వీఆర్‌పురంలలో గృహావసరాలకు సంబంధించి 30 వేలు, వ్యవసాయానికి 1124, కమర్షియల్‌కు సంబంధించి 1100, ఇండస్ట్రియల్‌కు సంబంధించి 22, ప్రభుత్వ శాఖలకు సంబంధించి 350 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా బిల్లుల రూపంలో ప్రతినెలా సుమారు రూ.60 లక్షల వరకు వసూలవుతుంటాయి. ప్రస్తుతం ఈ సొమ్ములన్నీ తెలంగాణ ప్రాంతంలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోనే వసూలు చేస్తూ తెలంగాణ కు తీసుకెళుతున్నారు. తద్వారా ఆంధ్రా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అన్నిశాఖల మాదిరిగానే విద్యుత్‌శాఖకు సంబంధించి కూడా విభజన ప్రక్రియ చేసి ఉంటే ప్రభుత్వానికి ఈపాటికే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి విద్యుత్‌శాఖకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తిచేయాలని విలీన మండలాల ప్రజలు కోరుతున్నారు. విభజన ప్రక్రియ కొనసాగుతోంది.. విద్యుత్‌శాఖకు సంబంధించి కూడా విభజన ప్రక్రియ కొనసాగుతోందని లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ నాగభూషణరావు ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మాదిరిగానే ప్రస్తుతం పొల్లూరు కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఆంధ్రా, తెలంగాణ ల ఫీడర్లు మారే వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశముందన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కు ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నామనే దానిపై జలవిద్యుత్ కేంద్రం వద్ద ఇంటర్‌స్టేట్ మీటర్‌ను ఏర్పాటు చేశామని, దీనిద్వారా తెలంగాణ కు ఎంత విద్యుత్ సరఫరా జరుగుతుందో నమోదవుతుందని తెలిపారు. ఈ నమోదు ఆధారంగా ప్రస్తుతం తమ నుంచి వాడుకుంటున్న విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి సొమ్ములు వసూలు చేసే అవకాశముందన్నారు. కాగా విలీన మండలాల్లో ఇప్పటికే విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు రంపచోడవరం ఏడీఈ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి విభజన ప్రక్రియ పూర్తికాగానే విలీన మండలాల్లో కూడా తమ సిబ్బందే బిల్లులు వసూలు చేస్తారని చెప్పారు. -
డిస్కంల ‘గుడ్డి’ నివేదిక
ఈఆర్సీకి తప్పులతడక ఏఆర్ఆర్ల సమర్పణ కేంద్ర విద్యుత్ ప్లాంట్లలో రాష్ర్ట వాటా తగ్గింపు53.89% బదులు 52.12% చూపించిన పంపిణీ సంస్థలు ఏపీ వాదనకు బలం చేకూర్చేలా అధికారుల నిర్లక్ష్యం పొరుగు రాష్ర్టం నివేదికలనే కాపీ కొట్టిన ఫలితం రాష్ర్టంలోనూ ఉప్పు తయారీకి కొత్త చార్జీలు ప్రతిపాదించిన వైనం తప్పులను సవరించకపోతే నష్టం తప్పదంటున్న నిపుణులు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల తీరు సొంత రాష్ట్రానికే చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. కృష్ణపట్నం, దిగువ సీలేరు ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే ఏపీతో అమీతుమీపోరాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పొరుగు రాష్ట్రం చేతిలో అస్త్రంగా మారే అవకాశముంది. ప్రస్తుతం ఎలాంటి సమస్యల్లేకుండా సరఫరా అవుతున్న కేంద్ర, అంతర్రాష్ర్ట ప్రాజెక్టుల్లోని కోటాలకు కోత పడే ప్రమాదం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ ప్లాంట్లతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. ఇరు ప్రాంతాల పరిధిలోని డిస్కంలకు సరఫరా అవుతున్న విద్యుత్ శాతం ఆధారంగా ఈ కేటాయింపులు జరుపుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జీవో 20 జారీ అయింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేటాయింపుల ఆధారంగానే తెలంగాణకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. సింహాద్రి, రామగుండం, తాల్చేరు ఎన్టీపీసీ ప్లాంట్ల నుంచి 53.89 శాతం విద్యుత్ అందుతోంది. తాజాగా తెలంగాణ డిస్కంలు ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌లలో కేంద్ర విద్యుత్ కేంద్రాల్లోని వాటాను 52.12 శాతానికి తగ్గించి చూపిం చాయి. దీంతో ఇప్పుడు వస్తున్న వాటాను తగ్గించుకున్నట్లయింది. మాచ్‌ఖండ్, తుంగభద్ర అంతర్రాష్ట్ర జల విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి ఉమ్మడి ఏపీకి కేటాయించిన విద్యుత్‌లోనూ తెలంగాణకు 53.89 శాతం వాటా రావాల్సి ఉంది. కానీ డిస్కంలు దీన్ని కేవలం 41.68 శాతంగానే చూపించాయి. విభజన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి జనాభాను ప్రామాణికంగా తీసుకోగా.. విద్యుత్ వనరుల విషయంలో డిస్కంలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ మాచ్‌కండ్, తుంగభద్ర విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే కోటాను జనాభా ఆధారంగా లెక్కించినట్లు ఏఆర్‌ఆర్‌లో పేర్కొని డిస్కంలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. పొరుగు రాష్ర్టం చేతికి అస్త్రం కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌లో తెలంగాణకు కేటాయించిన 53.89 శాతం కోటాను సవాల్ చేస్తూ ఇప్పటికే ఏపీ సర్కారు కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(సీఈఆర్సీ)లో అప్పీల్ దాఖలు చేసింది. డిస్కంలకు సరఫరా అయ్యే విద్యుత్ ఆధారంగా కాకుండా, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ కోటాను 52.12 శాతానికి తగ్గించాలని వాదిస్తోంది. ఈ వివాదంపై సీఈఆర్సీ ఇంకా తీర్పును వెల్లడించలేదు. ఈ కీలక సమయంలో ఏపీ వాదనకు బలం చేకూర్చేలా డిస్కంలు ఏఆర్ఆర్లను తప్పుగా చూపడంతో రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పులను సవరించకపోతే రాష్ట్రం అంధకారంగా మారే ప్రమాదముందని టీజేఏసీ ప్రతినిధి రఘు ‘సాక్షి’కి తెలిపారు. గుడ్డిగా కాపీ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్కంలు ఒకే ప్రైవేటు కన్సల్టెన్సీతో ఏఆర్ఆర్లను తయారు చేయించాయి. ముందే సిద్ధమైన ఏపీ డిస్కంల నివేదికను మక్కీకి మక్కీగా కాపీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణకు విద్యుత్ వాటాల్లో నష్టం తెచ్చేందుకు కన్సల్టెన్సీ ఉద్దేశపూర్వకంగా ఈ తప్పులు చేసిందా లేక డిస్కం అధికారులే నిర్లక్ష్యంగా వాటాలను తగ్గించి చూపించారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్త చార్జీల పట్టికనుసైతం యథాతథంగా ఏపీ నుంచి కాపీ కొట్టినట్లు అందులోని కేటగిరీలను బట్టి అర్థమవుతోంది. ఉప్పు తయారీపై యూనిట్‌కు రూ. 3.70 చొప్పున తెలంగాణ డిస్కంలు కొత్త చార్జీలు ప్రతిపాదించాయి. సముద్రం లేకున్నా తెలంగాణలో ఉప్పును ఎలా తయారు చేస్తారో డిస్కం అధికారులకే తెలియాలి. కరెంటుకు ఢోకా లేదట! మూడేళ్ల వరకు విద్యుత్తు సమస్య తప్పదని ప్రభుత్వం పదేపదే చెబుతుంటే.. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. తాజాగా సమర్పించిన ఏఆర్‌ఆర్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నాయి. రాష్ట్రంలో 553 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ఈఆర్సీకి నివేదించాయి. ఏపీతో పేచీ ఉన్న కృష్ణపట్నం, హిందుజా, దిగువ సీలేరు నుంచి రాష్ట్రానికి వాటా దక్కుతుందని కూడా స్పష్టం చేశాయి. వీటి లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 15 నుంచి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ ద్వారా 1223 మిలియన్ యూనిట్లు, జనవరి నుంచి కృష్ణపట్నం మొదటి యూనిట్‌తో 431 మెగావాట్లు, ఏప్రిల్‌లో రెండో యూనిట్ నుంచి మరో 431 మెగావాట్ల(మొత్తం 5650 మిలియన్ యూనిట్లు) విద్యుత్ సమకూరుతుంది. ఇలా పలు ప్లాంట్ల నుంచి విద్యుత్ వస్తుందని డిస్కంలు అంచనా వేశాయి. అలాగే పదేళ్ల సగటు ఆధారంగా 3614 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ వస్తుందని పేర్కొన్నాయి. వచ్చే ఏడాది విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు సగటున రూ. 3.84 ఖర్చవుతుందని లెక్కగట్టాయి. వినియోగం కూడా పెరుగుతుందని అంచనా వేశాయి. కాగా, వ్యవసాయ విద్యుత్ వినియోగం సీపీడీసీఎల్ పరిధిలో ఈ ఏడాది 7238.26 మిలియన్ యూనిట్లు.. వచ్చే ఏడాది 7528.19 మిలియన్ యూనిట్లకు చేరుతుందని పేర్కొన్నాయి. అలాగే ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ ఏడాది 4715 మిలియన్ యూనిట్లకు.. వచ్చే ఏడాది 4903.82 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేశాయి. ఇక ఎన్పీడీసీఎల్ ప్రస్తుత సంవత్సరానికి రూ. 262.23 కోట్ల నికర లోటులో ఉన్నట్లు నివేదించగా.. ఎస్పీడీసీఎల్ రూ. 1249.45 కోట్ల నష్టాన్ని చూపించింది. -
విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించాలి: బాబు
హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో ట్రాన్స్మిషన్ల నష్టాలను తగ్గించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. ఒక్క ట్రాన్స్మిషన్ నష్టం తగ్గించినా 250 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన అన్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే బాధ్యతను స్థానిక అధికారులకు అప్పగించాలని చంద్రబాబు సూచించారు. -
‘కోతల’ పథకాలు!
* పాత వాటి స్థానంలో కొత్త పథకాలకు రూపకల్పన * గ్రాంట్‌ను 90 శాతం నుంచి 60 శాతానికి కుదింపు * లక్ష్యాలను అధిగమిస్తే మరో 15 శాతం అదనంగా చెల్లింపు * 15 శాతం కోతకు సిద్ధం.. 10 వేల కోట్ల మేర కత్తిరింపు * డిస్కంలపై పెనుభారం, ప్రత్యేక రాష్ట్రాలకు మినహాయింపు * రేపు ఢిల్లీలో రాష్ట్రాలతో భేటీకి అవకాశం * కొత్త పథకాల విధివిధానాలపై చర్చించనున్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇచ్చే నిధుల కత్తిరింపునకు రంగం సిద్ధమైంది. విద్యుత్ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాల స్థానంలో కొత్త వాటిని తీసుకొస్తూ గ్రాంట్ల భారాన్ని కేంద్రం తగ్గించుకుంటోంది. పర్యవసానంగా రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆర్థికంగా పెనుభారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కొత్త పథకాల విధివిధానాలపై మంగళవారం(23న) అన్ని రాష్ట్రాలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు రాష్ర్ట ఇంధన శాఖ వర్గాలకు సమాచారం కూడా అందింది. విద్యుత్ రంగంలో మార్పులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే గ్రాంట్ల విషయంపైనే ఇంధన శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామీణ, పట్టణ విద్యుదీకరణకు సంబంధించి ప్రస్తుతం రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన(ఆర్‌జీజీవీవై), రీ స్ట్రక్చర్డ్ యాక్సిలరేటడ్ పవర్ డెవలప్మెంట్ రిఫా ర్మ్స్ ప్రోగ్రాం(ఆర్‌ఏపీడీఆర్‌పీ) పేరిట దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి కింద గత యూపీఏ ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంట్‌గా విడుదల చేసింది. మిగతా పది శాతాన్ని రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్రాల డిస్కంలకు వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం వీటి స్థానంలో కొత్త పథకాలను రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన(డీడీయూజీజేవై), పట్టణ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత విద్యుత్ పంపిణీకి ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్(ఐపీడీఎస్)పేరిట కొత్త పథకాల అమలుకుకసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే నిధుల కూర్పును మార్చడం వల్ల ఈ పథకాలు రాష్ట్రాల పాలిట గుదిబండగా మారనున్నాయి. ఇకపై భారీగా కత్తిరింపు కొత్త పథకాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేవలం 60 శాతం గ్రాంట్ రానుంది. మిగతా 40 శాతం నిధుల్లో పది శాతాన్ని డిస్కంలు సొంతంగా జమ చేసుకోవాలి. 30 శాతం నిధులను రుణంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పథకం అమలులో మైలురాళ్లను అధిగమిస్తే.. అదనంగా మరో 15 శాతం గ్రాంటు మంజూరవుతుందని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో నిర్ణీత లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలకు సైతం మొత్తంగా 75 శాతం గ్రాంట్ మాత్రమే అందుతుంది. అప్పటికీ గతంతో పోల్చితే 15 శాతం నిధులను కేంద్రం కత్తిరించినట్లే అవుతుంది. అంతమేరకు డిస్కంలపై అదనపు భారం పడనుంది. సొంతంగా పది శాతం నిధులు భరించటంతో పాటు... రుణం తీసుకునే నిధుల్లో పది శాతాన్ని డిస్కంలు తమ వంతు వాటాగా డిపాజిట్ రూపంలో ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి వస్తుందని, ఇది పెను భారమేనని తెలంగాణ నార్తర్న్ డిస్కంకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా డిస్కంలపైనే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ రాయితీలతో ఆర్థికంగా కుదేలైన డిస్కంలు.. ఈ గ్రాంట్ల కుదింపుతో మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నుంచి 85 శాతం గ్రాంట్ లభించనుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రత్యేక హోదాకు నోచుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ నిధుల కోత ఇబ్బందికరంగానే మారనుంది. రాష్ట్రాలపై వేల కోట్ల భారం ప్రస్తుతం అమల్లో ఉన్న 12వ పంచవర్ష ప్రణాళికతో పాటు.. 13వ పంచవర్ష ప్రణాళికలోనూ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పథకానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు కింద 2022 సంవత్సరం వరకు మొత్తం రూ. 43,033 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రస్తుతమున్న ఆర్జీజీవీవైని ఇందులోనే విలీనం చేసి.. మొత్తం రూ. 33,453 కోట్లను గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు మంజూరు చేయాల్సి ఉంటుందని కేంద్రం లెక్కగట్టింది. 90 శాతం గ్రాంటు కిందైతే రూ.38,729 కోట్లను చెల్లించాల్సి వచ్చేది. కానీ, కొత్త తిరకాసులతో అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలు ఏకంగా రూ. 5,276 కోట్ల భారాన్ని మోయాల్సి ఉంటుంది. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, సోలార్ విద్యుత్, మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ పంపిణీ లక్ష్యంగా అమలయ్యే ఐపీడీఎస్ పథకానికి రూ.32,612 కోట్లు అవసరమని అంచనా. ఇందులో రూ.25,354 కోట్లను గ్రాంట్లుగా ఇచ్చేందుకు ఆర్థిక ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుతమున్న ఆర్‌ఏపీడీఆర్‌పీ బదులు ఈ కొత్త పథకం అమలుకానుంది. అయితే గ్రాంట్లలో కోత విధించడంతో ఈ పథకం కింద కూడా రాష్ట్రాలపై రూ. 4 వేల కోట్లకుపైగా భారం పడనుంది. మొత్తంగా రెండు పథకాలు కలిపి రూ.10 వేల కోట్ల వరకు గ్రాంట్లకు కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు డిస్కంలకు 2012లో కేంద్రం నుంచి దాదాపు రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. రుణ భారం తప్ప సొంత వాటాలు చెల్లించే అవసరం లేకపోవటంతో ఈ గ్రాంట్లతో డిస్కంలకు ఆర్థికంగా ఊరట లభించింది. కానీ, కొత్త నిబంధనలతో ఇరు రాష్ట్రాల్లోని డిస్కంలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.800 కోట్ల భారం పడనుంది. ఢిల్లీలో మంగళవారం రాష్ట్రాలతో భేటీ నిర్వహించేందుకు కేంద్ర ఇంధన శాఖ, కేంద్ర విద్యుత్ అథారిటీ సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావు, టీఎస్-ఎస్పీడీసీఎల్ చైర్మన్ సి.రఘుమారెడ్డి హాజరుకానున్నారు. అయితే సమావేశ తేదీ మారే అవకాశం ఉంది. -
ఎన్పీడీసీఎల్ ఆదాయూనికి గండి !
రూ.120 కోట్లకు బ్రేక్ స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఎఫెక్ట్ నిలిచిపోనున్న బిల్లుల వసూళ్లు గత నెల బిల్లుల ఆధారంగా వసూళ్లకు సిద్ధమైన ఉన్నతాధికారులు హన్మకొండ సిటీ : కొనసాగుతున్న స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మెతో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నెలవారీ ఆదాయానికి గండి పడనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారుల బిల్లులు తీసేవారు లేకుండా పోయూరు. గృహవినియోగదారుల ఇళ్లలో బిల్లులు తీసే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఐదుజిల్లాల పరిధిలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరు నెలకు 30 లక్షల మంది వినియోగదారుల మీటర్ రీడింగ్ తీసి బిల్లులు అందజేస్తారు. ఈ బిల్లుల ఆధారంగా వినియోగదారులు ప్రతి నెలా బిల్లు చెల్లించేవారు. ఇలా గృహవినియోగదారుల ఇళ్లలో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తీస్తున్న బిల్లుల ద్వారా ప్రతి నెల రూ.120 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరుతుంది. అయితే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తమ సమస్యల సాధనకు ఈ నెల ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మె చెస్తున్నారు. దీంతో ఐదు జిల్లాల పరిధిలో బిల్లులు తీయడం నిలిచిపోరుుంది. ఫలితంగా విద్యుత్ సంస్థపై ఆర్థికలోటు ప్రభావం పడనుంది. మెట్టు దిగడం లేదు... ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళ్లిన స్పాట్ బిల్లింగ్ వర్కర్లు అదే రోజు అధికారులతో చర్చలు జరిపినా... ఎలాంటి అంగీకారానికి రాలేకపోయారు. మరోసారి చర్చలకు కూర్చుందామని చెప్పిన అధికారులు ఆరు రోజులుగా మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పాట్ బిల్లింగ్ వర్కర్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిన్నాయని, సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. సోమవారం నుంచి సమ్మెతోపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, స్పాట్ బిల్లింగ్ వర్కర్ల ప్రతినిధులు హన్మకొండలో సమావేశం కానున్నారు. ఇందులో పోరాటాన్ని ఉధృతం చేసే నిర్ణయాలు తీసుకోనున్నట్లు యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు సికిందర్ చెప్పారు. దీన్నిబట్టి స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఇప్పట్లో ముగిసేలా లేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా... పూర్తిస్థారుులో వసూళ్లు చేసేందుకు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెల బిల్లు ప్రకారం ప్రస్తుత బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విద్యుత్ సరఫరాలో సవాళ్లున్నాయ్...
నష్టాలు తగ్గించేందుకు కార్యాచరణ ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ హన్మకొండ సిటీ : రాష్ట్రంలో విద్యుత్ సర ఫరా విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) కొంటె వెంకటనారాయణ అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో విద్యుత్ పంపిణీలో వివాదాలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ మేరకు విద్యుత్ లోటు ఏర్పడగా, వర్షాభావ పరిస్థితులు తోడు కావడంతో సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, లోటును త గ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ అవసరం అందుబాటులో ఉన్న విద్యుత్‌ను వినియోగదారులకు సక్రమంగా అందజేసేందుకు పటిష్టమైన పంపిణీ వ్యవస్థ అవసరమని సీఎండీ వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు విద్యుత్ సరఫరాలో సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. కాగా, విద్యుత్ పంపిణీలో 2012-2013లో 13.37 శాతం ఉన్న నష్టాన్ని 2014-2015నాటికి 12.59కి తగ్గించగలిగామని వివరించారు. అంతేకాకుండా పట్టణాల్లో విద్యుత్ సరఫరా మెరుగు పరిచేందుకు 23 సబ్స్టేషన్లు నిర్మించామని, మండల కేంద్రాలు, గ్రామాల్లో కొత్తగా 86 సబ్స్టేషన్లు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 1,23,335 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరా మెరుగు పర్చడం, నష్టాలు తగ్గించాలనే లక్ష్యంతో హెచ్‌వీడీఎస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రూ.8.54 కోట్లతో 322 ఎస్సీ కాలనీలకు, రూ.4.17 కోట్లతో గిరిజన ఆవాస ప్రాంతాలు, నీటివనరులకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు సీఎండీ తెలిపారు. అలాగే, నక్కలగుట్టలోని విద్యుత్ భవన్‌పై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసి 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. నూతనంగా భవనాలు నిర్మించుకునే వారు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేసేలా ప్రోత్సహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ నుంచి మానసిక వికలాంగులకు, కుష్టువ్యాధిగ్రస్తులకు రూ.83 వేల సహాయాన్ని అందించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేసిన సీఎండీ.. శుక్రవారం కార్యాలయంలో నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డెరైక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, టి.చంద్రశేఖర్, ఆర్.జాన్‌ప్రకాశ్‌రావు, జి.సుదర్శన్, సీజీఎంలు ఎండీ.యూనస్, ఎం.వెంకటనారాయణ, కె.ఈశ్వరయ్య, వి.సుధాకర్, జి.రాజారావు, పి.సంధ్యారాణి, టి.సదర్లాల్, బి.అశోక్‌కుమార్, జి.రవీంద్రనాథ్, జీఎంలు మధుసూదన్, వి.తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, శివరామకృష్ణ, సాంబయ్య, కె.రమేష్, రాధాకృష్ణంరాజు, ఎస్.రంగారావు, సత్యనారాయణ, వేణుగోపాలాచారి, అచ్చేశ్వర్రావు, శివరాం, రవీందర్, కె.కిరణ్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, ఈఈలు రవీందర్, ఎస్.అమర్నాథ్, ఎస్ఈ మోహన్‌రావు, ఛీఫ్ విజిలెన్స్ అధికారి యువీఎస్.రాజు పాల్గొన్నారు. -
విద్యుత్ మంటలు
ముదురుతున్న పీపీఏల రద్దు వివాదం ఎక్కడి విద్యుత్ అక్కడే అంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు వాటాలు చెల్లవని ఎస్ఆర్ఎల్డీసీకి చెప్పిన ఏపీఎస్‌ఎల్‌డీసీ ఏపీజెన్కో నిర్ణయానికి ఈఆర్సీ తిరస్కృతి డిస్కంలూ ప్రతిపాదిస్తే పరిశీలిస్తామని స్పష్టీకరణ ఈఆర్సీ ఆమోదం అక్కర్లేదంటున్న ఏపీ వర్గాలు ముందస్తుగా హైకోర్టులో ఏపీజెన్కో కేవియట్ దాఖలు రద్దు నిర్ణయంపై వెంటనే స్టే రాకుండా వ్యూహం 23న హైకోర్టుకు వెళ్లే యోచనలో టీ విద్యుత్ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గిరాజుకుంటోంది. తాజాగా చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుతమున్న కోటా మేరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలన్న దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ) ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) గురువారం తెగేసి చెప్పింది. తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీజెన్కో పంపిన పీపీఏల రద్దు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తిరస్కరించింది. జెన్కోతో పాటు నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కూడా పీపీఏలు కుదుర్చుకున్నందున ఇరు పక్షాలూ రద్దు ప్రతిపాదనలు ఇవ్వాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్‌కు గురువారం లేఖ రాసింది. అయితే, పీపీఏల రద్దుపై ఈఆర్సీ నిర్ణయం ప్రభావం చూపదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీపీఏలకు ఈఆర్సీ అధికారికంగా అనుమతి ఇవ్వనందున వాటి రద్దు విషయంలో ఆ సంస్థ ఆమోదం అవసరం లేదని ఏపీ ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఏపీజెన్కో నిర్ణయం తమకు సమ్మతం కాదని, దీన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణకు చెందిన డిస్కంలు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్(గతంలో సీపీడీసీఎల్)లు తాజాగా లేఖ రాశాయి. అయితే ఆ నిర్ణయంలో మార్పు లేదని బదులిస్తూ ఏపీజెన్కో కూడా లేఖ రాయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు మాత్రం పీపీఏల రద్దుకు అంగీకరించాయి. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యుత్ శాఖ వర్గాలు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద తమ ప్లాంట్ల విద్యుత్‌ని తామే వినియోగించుకుంటామన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లవారీగా జరిగే విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని (షెడ్యూల్‌ని) ఎస్ఆర్ఎల్డీసీకి పంపడం లేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే ఏపీజెన్కో హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడం గమనార్హం. పీపీఏల రద్దుపై కోర్టు వెంటనే స్టే ఇవ్వకుండా ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మరోవైపు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేసేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమవుతున్నాయి. ఎస్ఆర్ఎల్డీసీ ఆదేశాలు పాటించం: ఏపీఎస్‌ఎల్‌డీసీ లేఖ పీపీఏలతో సంబంధం లేకుండా రాష్ట్రాల కోటా మేరకు విద్యుత్ సరఫరా చేస్తామన్న ఎస్ఆర్ఎల్డీసీకి గురువారం ఏపీఎస్‌ఎల్‌డీసీ ఘాటుగా లేఖ రాసింది. రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న మేరకు మొత్తం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం చొప్పున విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసలు పీపీఏలు ప్రస్తుతం అమలులోనే లేనందున తమ రాష్ర్టంలోని విద్యుత్‌ని తామే వాడుకుంటామని, ఈ విషయంలో ఎస్ఆర్ఎల్డీసీ ఆదేశాలను కూడా పాటించాల్సిన అవసరం లేదని ఏపీఎస్‌ఎల్‌డీసీ తన లేఖలో తేల్చి చెప్పింది. ‘అమల్లో ఉన్న పీపీఏలు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడేనని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం పీపీఏల కాలపరిమితి తీరిపోయి అవి అమల్లో లేని విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్లాంట్ల విద్యుత్‌ను మేమే వినియోగించుకుంటాం. ఎస్ఆర్ఎల్డీసీ ఆదేశాల ప్రకారం మేం నడుచుకోవాల్సిన అవసరం లే దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలనే పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని డిస్కంలకు మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని రాష్ర్ట ప్రభుత్వం మాకు ఈ నెల 17న ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 37 ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనే ఆ రాష్ర్ట లోడ్ డిస్పాచ్ సెంటర్లు విధిగా పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ, ఉత్పత్తి సవ్యంగా సాగడానికి ఇది తప్పనిసరి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేం నడుచుకుంటాం. ఇక్కడి విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ని వంద శాతం ఇక్కడే ఇవ్వడం మా విధి. మేం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌కు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తాం. ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కోటా నిర్ణయించేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినిధి లేని విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అందువల్ల ఈ కోటా నిర్ణయం అమలు సమంజసం కాదు’ అని ఏపీఎస్‌ఎల్‌డీసీ తన లేఖలో స్పష్టం చేసింది. అదేవిధంగా జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ఎస్‌ఎల్‌డీసీలు ఏర్పడిన విషయాన్నీ గుర్తుచేసింది. తమ నిర్ణయాన్ని గౌరవించి రాష్ర్టంలో విద్యుత్ సరఫరాకు, గ్రిడ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు విన్నవించింది. విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్‌కు మంగళం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్ఆర్ఎల్డీసీకి చెప్పాల్సిన ఆయా కేంద్రాల ఇంజనీర్లు ఈ ప్రక్రియకు తాజాగా మంగళం పాడారు. ‘తమ రాష్ట్రానికి చెందిన ప్లాంట్ల నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్న సమాచారాన్ని కేవలం ఏపీఎస్ఎల్డీసీకి మాత్రమే ఇస్తాం. తమవి అంతర్రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లు కానందున వాటి ఉత్పత్తి షెడ్యూల్‌ను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని ఎస్ఆర్ఎల్డీసీకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్లాంట్ల చీఫ్ ఇంజనీర్లు(సీఈ)లు గురువారం స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే సమాచారం ఎస్ఆర్ఎల్డీసీకి చేరడం లేదు. ఫలితంగా కోటా ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా విషయంలో అస్పష్టత రావడం లేదు. మొత్తానికి గురువారం నాడు ఏపీలో ఉత్పత్తి అయిన విద్యుత్ అక్కడే వినియోగమైనట్లు తెలుస్తోంది. పీపీఏలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకునే వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. అయితే, అమల్లోలేని పీపీఏలపై కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని ఏపీ ఇంధన శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
పెరిగిన విద్యుత్ కోతలు
విశాఖపట్నం: విద్యుత్తు కోతలతో జనం విలవిల్లాడుతున్నారు. విశాఖలో ఆదివారం నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది గంటలు విద్యుత్ సరఫరాలో కోతలు విధించారు. మరో రెండు రోజులు ఈ కోతలు తప్పవని ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు ఐదు జిల్లాల పరిధిలో 2100 మెగావాట్ల విద్యుత్తు అవసరముంది. దీనిలో విద్యుత్తు కొరత కారణంగా 1750 నుంచి 1800 మెగావాట్ల కంటే విద్యుత్తు సరఫరా జరగడం లేదు. పరిశ్రమలకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు కొరత వల్ల అనధికారికంగా అధికారులు కోత విధిస్తున్నారు. వడగాడ్పులు, వాతావరణంలో మార్పుల వల్ల విద్యుత్తు వినియోగం మరింత పెరిగింది. ప్రస్తుతం విద్యుత్తు కొరతగా ఉన్నందున రెండు రోజులుగా నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కోతలు పెరిగిపోయూరుు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంటున్నారు. దీంతో జనం అల్లాడిపోతున్నారు. విద్యుత్తులేకపోవడంతో గాలి ఆడక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం వల్లే సర ఫరా చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఎన్టీపీసీలో 500 మెగావాట్లు, సింహాద్రిలో 500 మెగా వాట్లు, ఆర్టీ పీపీ 210, కేటీపీపీలో 500 మెగావాట్లు, కేటీఎస్-ఏబీసీలో 120 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయిందని, దీంతో సరఫరాకు గండిపడినట్టు అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ పంపిణీలో అన్యాయం
తెలంగాణకు రూ.1,060కోట్ల నష్టం: టీ-జాక్ హైదరాబాద్: విద్యుత్ పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని టీ-విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) మండిపడింది. కర్నూలు, అనంతపురం జిల్లాల సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కించడంలో జరిగిన తప్పుల వల్ల తెలంగాణకు ఏకంగా రూ.1;060 కోట్ల మేరకు నష్టం వాటిల్లనుందని టీజాక్ కో-ఆర్డినేటర్ కె. రఘు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. వాస్తవానికి 2005-06 నుంచి 2007-08 వరకు సగటున తీసుకుని కర్నూలు, అనంతపురం జిల్లాల సగటు విద్యుత్ వినియోగాన్ని మాత్రమే లెక్కించాలని కోరారు. ఈ మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగానే రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు విద్యుత్ కోటాను నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. అందువల్ల ఈ మూడు సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగానే కర్నూలు, అనంతపురం జిల్లాల సగటు వినియోగాన్ని లెక్కించి.. ఈ మేరకు మాత్రమే సీపీడీసీఎల్ కోటా నుంచి ఎస్పీడీసీఎల్ కోటాకు మళ్లించాలని కోరారు. దీని ఆధారంగా లెక్కిస్తే రాష్ట్రం మొత్తం వినియోగంలో ఈ రెండు జిల్లాల సగటు విద్యుత్ వినియోగం కేవలం 5.9 శాతం మాత్రమేనన్నారు. అయితే, సగటున గత ఐదేళ్ల వినియోగాన్ని లెక్కించి 8.037 శాతంగా తేల్చడం సరికాదన్నారు. అదనంగా 2.14 శాతం కోటాను సీపీడీసీఎల్ నుంచి ఎస్పీడీసీఎల్కు మళ్లించారని తెలిపారు. తద్వారా తెలంగాణ ప్రాంతం ఏకంగా ఏడాదిలో 1902 మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుత్‌ను నష్టపోతుందని.. దీనిని మార్కెట్ ధర (రూ.5.50)తో లెక్కిస్తే ఏకంగా రూ. 1060 కోట్లు అవుతుందన్నారు. సమ్మెలు వద్దు: విద్యుత్ ఉద్యోగుల రెండు రోజుల సమ్మె వల్ల ఏమీ సాధించలేదని, పైగా రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రఘు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సౌధలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో సమావేశమై సమ్మెపై చర్చించారు. విద్యుత్‌ను నిలుపు చేసి, ఇలాంటి సమ్మెకు దిగడం తెలంగాణ సంస్కృతి కాదని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా, సంస్థకు నష్టం వాటిల్లకుండా నిరసన కార్యక్రమాలు జరపాలన్నారు. మరో వారంలో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో సమ్మెలు సరికాదన్నారు. -
ఇంధన సర్దుబాటు చార్జీలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. కొన్నేళ్ల కిందట వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీలు విద్యుత్ పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చార్జీలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వాలు, విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పంథా కొనసాగిస్తున్నాయి. తాజాగా 2011 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి సర్దుబాటు చార్జీలను ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వసూలు చేస్తున్నారు. యూనిట్‌కు 95 పైసలు.. గతంలో వినియోగించిన విద్యుత్‌కు సం బంధించి ఉత్పత్తి ఖర్చు, బిల్లుల రూ పంలో వసూలైన మొత్తానికి తేడాను విని యోగదారులపై సర్దుబాటు చార్జీల రూ పంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. మూడేళ్ల కిందట వాడుకున్న కరెంట్‌కు సంబంధించి ఈ సంవత్సరంలో బిల్లులు వసూలు చేస్తుండడంపై వినియోగదారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా వందల కోట్ల రూపాయలు జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు కంపెనీకి చెల్లించారు. కాగా ఈ ఏ ప్రిల్ నెల బిల్లులో 2011 అక్టోబర్‌కు సం బంధించిన సర్దుబాటు చార్జీలను విని యోగదారులపై రుద్దటం జరిగింది. ఈ మే నెలలో నవంబర్ 2011, జూన్‌లో డిసెంబర్ 2011 సంబంధించిన సర్‌చార్జీలను వేయనున్నారు. ఏప్రిల్ బిల్లులో వినియోగదారులపై రూ.4.28 కోట్లు అదనపు భారం మోపారు. అప్పట్లో లో టెన్ష న్ కనెక్షన్లపై 42.981 మిలియన్ యూని ట్లు, హైటెన్షన్ కనెక్షన్లపై 46.286 మిలి యన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగిం ది. ప్రతి యూనిట్‌పై 94.87 పైసలు సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేయాలని ఎన్పీడీసీఎల్ అధికారుల నుంచి ఇ దివరకే ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మూడు నెలలకు సంబంధించి వినియోగదారులపై సుమారు రూ.12.50 కోట్లు భారం పడనున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. కాగా వినియోగదారుల నుం చి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానుల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గతంలో ఎవరో అద్దెకు ఉండగా ప్రస్తుతం ఇతరుల రావడం, వారు బిల్లులో సర్దుబాటు చార్జీల విషయంలో కట్టేందుకు వెనుకంజ వేస్తుండడం ఇంటి యజమానులకు గుదిబండగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సెంట్రల్ ‘పవర్’కు విభజన షాక్
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(సీపీడీసీఎల్)లో సమస్యలు తలెత్తనున్నాయి. ఆ సంస్థ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది. దీంతో సీనియారిటీ, పదోన్నతులు వంటివి అందుతాయోలేదోనని ఆందోళన మొదలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో అన్ని ప్రభుత్వ శాఖలు రెండుగా చీలిపోనున్నాయి. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ కూడా వీడిపోనుంది. సమైక్య రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. అందులో హైదరాబాదు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(సీపీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా సౌథ్రెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎస్పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా నేషనల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్), విశాఖపట్నం కేంద్రంగా ఈస్ట్రెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఈపీడీసీఎల్) సంస్థలు తమ పరిధిలోని జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. జెన్కో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ట్రాన్స్‌కో కొలుగోలు చేసి ఈ నాలుగు పంపిణీ సంస్థలకు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమయ్యే విద్యుత్‌లో 40 శాతానికి పైగా విద్యుత్ కేవలం సీపీడీసీఎల్ సంస్థే వినియోగిస్తుండగా మిగతా 60 శాతం విద్యుత్ మిగిలిన మూడు సంస్థలు పొందుతున్నాయి. అన్ని సంస్థల పరిస్థితి బాగానే ఉన్నా సీపీడీసీఎల్లోని సీమ జిల్లాల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. అతిపెద్ద సంస్థ అయిన సీపీడీసీఎల్‌లో మొత్తం 11 ఆపరేషన్స్ సర్కిళ్లు (ఎస్ఈ స్థాయి హోదా కలిగినవి) ఉన్నాయి. ఇందులో హైదరాబాదు సెంట్రల్, సౌత్, నార్త్, రంగారెడ్డి నార్త్, సౌత్, ఈస్టు, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలతోపాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం కూడా ఉన్నాయి. అందులో కర్నూలు, అనంతపురం తప్ప మిగిలినవి తెలంగాణలోనివే. దీంతో రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు, అనంతపురం సర్కిళ్లను సీపీడీసీఎల్ నుంచి విడగొట్టి తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో విలీనం చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంమైనా ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో చర్యలు వేగవంతం అయ్యాయి. అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ నుంచి అధికారాలు బదలాయించనున్నారు. దీంతో ఈ నెల వేతనాలు 24వ తేదీనే చెల్లించనున్నారు. ఉద్యోగుల సీనియారిటీపై గందరగోళం సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎస్పీడీసీఎల్లో కలపనుండడంతో ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు సీనియారిటీ, పదోన్నతులు, ఇతర అంశాలపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆప్షన్లు ఇస్తామని, సర్దుబాటు చేస్తామని చెబుతున్నా పూర్తి స్థాయి స్పష్టత కరువైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 2 వేల మందికి పైగా ఉద్యోగులు, మరో 500 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వారిలో ఒక చీఫ్ జనరల్ మేనేజరుతోపాటు ఎస్ఈ, 9 మంది డీఈలతోపాటు ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు మొత్తం 500 ఇంజినీరింగ్ అధికారులున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 2500 మందికి పైగా ఉద్యోగులతోపాటు 600కి పైగా కాంట్రాక్టు కార్మికులున్నారు. ఎస్పీడీసీఎల్లో ప్రస్తుతం తిరుపతి (చిత్తూరు)తోపాటు కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ (విజయవాడ), గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలను అందులో కలిపితే తమ సర్వీసు, సీనియారిటీ సమస్యలొస్తాయని ఆ సంస్థలోని ఉద్యోగులు సైతం ఆందోళనకు గురవుతున్నారు . కాగా కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలను కలిపి జోన్ ఏర్పాటు చేసి చీఫ్ జనరల్ మేనేజరు(చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి) నియమించారు. కర్నూలులోనే జోనల్ కార్యాలయాన్ని ఉంది. రెండు జిల్లాలను ఎస్పీడీసీఎల్కు బదలాయిస్తే ఇక్కడ ఉన్న సీజీఎం పోస్టు రద్దయ్యే ప్రమాదముంది. అధికారులు స్పందించి ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతుల విషయంలో సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.ఉమాపతి కోరుతున్నారు. -
నాలుగు పంపిణీ సంస్థలకు విద్యుత్ కేటాయింపులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ కేటాయింపులు చేస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) పరిధిలోని కర్నూలు, అనంతపు రం జిల్లాలు రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర రాష్ట్రం లో కలుస్తున్నందున, ఈ రెండు జిల్లాలను సీపీడీసీఎల్ నుంచి తొలగించి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో విలీనం చేస్తున్నారు. దీంతో విద్యుత్ కేటాయింపులో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్ కోటా తగ్గి, ఎస్పీడీసీఎల్కు కోటా పెంచారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులు, రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చిన తరువాత కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. విద్యుత్‌సంస్థ పేరు ప్రస్తుతశాతం కొత్తశాతం ఈపీడీసీఎల్ 15.80 15.80 ఎస్పీడీసీఎల్ 22.27 30.31 సీపీడీసీఎల్ 46.06 38.02 ఎన్పీడీసీఎల్ 15.87 15.87 -
బీపీఎల్ కథ కంచికే..!
600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పీపీఏ రద్దుకు ప్రభుత్వ నిర్ణయం భూమి వెనక్కి తీసుకోవాలని డిస్కంలకు ఆదేశం.. త్వరలో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీపీఎల్ కంపెనీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కథ కంచికి చేరింది. బీపీఎల్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) రద్దు చేసుకునేందుకు వి ద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సిద్ధమయ్యా యి. కంపెనీకి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు బీపీఎల్‌తో డిస్కంలు 2009లో పీపీఏ కుదుర్చుకున్నాయి. ఆ మేరకు 2013 సెప్టెంబర్ 20కి ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక వనరులను (ఫైనాన్షియల్ క్లోజర్) కంపెనీ సమకూర్చుకోవాలి. కానీ ఇప్పటివరకు కంపెనీ ఈ ప్రక్రియ పూర్తిచేయలేదు. దీంతో బీపీఎల్‌కు సెప్టెంబర్ 21న డిస్కంలు షోకాజ్ నోటీసులిచ్చాయి. 15 రోజు ల్లోగా జవాబివ్వాలని ఆదేశించాయి. తమకు మరికొంత గడువివ్వాలని బీపీఎల్ కోరినట్టు తెలిసింది. నిరాకరించిన డిస్కంలు... పీపీఏ రద్దు కు ప్రభుత్వాన్ని అనుమతి కోరాయి. ఇందుకు అంగీకరిస్తూ సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆది నుంచీ అంతే: 1990వ దశకంలో ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు కింద 520 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం వద్ద విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను బీపీఎల్ చేజిక్కించుకుంది. ఈ ప్లాంటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు సరఫరాను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) సమకూర్చింది. తర్వాతి కాలంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని బీపీఎల్ చేపట్టలేదు. 2004లో ఈ ప్రాజెక్టుతో కుదుర్చుకున్న పీపీఏని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కంపెనీ మళ్లీ ముందుకొచ్చి 520 మెగావాట్లకు బదులుగా 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని... ఇందుకు మెగావాట్‌కు రూ.5.1 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని 2009లో ప్రభుత్వానికి తెలిపింది. అయితే మెగావాట్‌కు రూ. 4.76 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా 2009 అక్టోబర్ 9వ తేదీన ఇంధనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా సవరించిన పీపీఏను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి కంపెనీ సమర్పించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్‌కు ఈఆర్సీ ఆదేశించింది. ఈఆర్సీ ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన రుణ సమీకరణను కంపెనీ సెప్టెంబర్ 20 నాటికి చేపట్టాలన్నమాట. అయితే కంపెనీ ఎలాంటి పురోగతి చూపకపోగా మరింత సమయం కావాలని కోరుతోంది. ప్రధాని అయినా కాదేమో: బీపీఎల్ ఫైలును చూసినప్పుడు అధికారులతో సీఎం సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కంపెనీ ముందుకు వచ్చింది. నేను సీఎం అయినా ప్లాంటు కట్టలేదు. రేపు నేను ప్రధాని అయినా ఈ ప్లాంటు రాదేమో’నని వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఉద్యోగుల ఆందోళనతో సగానికి పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి