రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు వారికి ఇతర ఉద్యోగుల్లాగే చట్ట ప్రకారం సమాన జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయం పొందేందుకు బాధితులకు ప్రత్యామ్నాయం ఉందని, అందువల్ల వారు సంబంధిత ఫోరాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. ఇది ఉద్యోగుల సర్వీసు వివాదమని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దీనిని విచారించడం సాధ్యం కాదంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.