సంగారెడ్డి, న్యూస్‌లైన్ : సమైక్య సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంపై కేసులు ఎత్తివేయడంతో మెదక్ జిల్లాలో శనివారం వారు విధుల్లో చేరారు. తమను గుర్తించిన సీఎం కేసీఆర్, డీజీపీ, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్‌కు, తెలంగాణ పోలీస్ ఫోరానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫోరం అధ్యక్షుడు చిందం సుభాష్ పాల్గొని కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలకు సన్మానం చేశారు. అలాగే దివంగత కానిస్టేబుల్ కిష్టయ్యకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు ఫోరం రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, సభ్యులు కరణం శివానంద్, అనిల్‌కుమార్, హనుమండ్లు, బుర్రి శ్రీనివాస్, జగదీష్, సంగారెడ్డి సబ్‌డివిజనల్ హోంగార్డు అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.