సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సీమాంధ్రలో పూర్తిగా దెబ్బతినడానికి కారణాలను అన్వేషించేందుకు జూన్ తొలి వారంలో సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ నిర్ణయించింది. జూన్1 లేదా 2వ తేదీల్లో రాజమండ్రి లేదా విశాఖలో ఒకచోట భారీ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు శాసనసభలో ప్రాతినిథ్యం లేకపోయినప్పటికీ.. ఆచరణ సాధ్యం కాని హామీల అమలులో చంద్రబాబు విఫలమవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై చట్ట సభల వెలుపల ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని అభిప్రాయానికి వచ్చారు.