పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపుతో ముంపు మండలాల్లో శుక్రవారం సంపూర్ణ బంద్ జరిగింది.
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపుతో ముంపు మండలాల్లో శుక్రవారం సంపూర్ణ బంద్ జరిగింది. దుకాణాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ముంపు ప్రాంతాలకు బస్ సర్వీసులను ఆర్‌టీసీ అధికారులు రద్దు చేశారు.
భద్రాచలంలోని ముఖ్య కూడళ్లలో అఖిలపక్షం నాయకులు ప్రదర్శన, అటవీశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కెచ్చెల రంగారెడ్డి, పట్టం నారాయణ, కె.ఫణీశ్వరమ్మ, ముర్ల రమేష్, గుండు శరత్, బాదం జగదీష్, దాసరి శేఖర్, ఎవి.రావు, దాగం ఆదినారాయణ, జంజర్ల రమేష్, కాటం హరినాధ్, మడివి నెహ్రూ, కల్లూరి జయబాబు, చల్లగుళ్ల నాగేశ్వరరావు, కె.సీతారాములు, బి.రాజు, బండారు వెంకటేశ్వర్లు, కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నిరనన హోరు
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముంపు మండలాల్లో నిరసల హోరు సాగింది. వీఆర్‌పురంలో రహదారులపై అఖిలపక్షం నాయకులు ముళ్ళ కంచెలు వేసి వాహనాల రాకపోకలను పూర్తిగా అడ్డున్నారు.
వంటావార్పు నిర్వహించారు. కూనవరం పాత బస్టాండ్ సెంటర్‌లో అఖిలపక్షం నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడి దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు.